కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గ‌త మూడేళ్ల‌లో ప్ర‌భుత్వం 3,82,581 డొల్ల కంపెనీల‌ను ర‌ద్దు చేసింది

Posted On: 20 SEP 2020 2:04PM by PIB Hyderabad

దేశంలో డొల్ల (షెల్‌) కంపెనీలను గుర్తించడం వాటిని ర‌ద్దు చేయ‌డానికి గాను ప్ర‌భుత్వం ప్ర‌త్యేక డ్రైవ్‌ను చేప‌ట్టింది. వ‌రుస‌గా రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి ఆర్ధిక వివ‌రాల నివేదిక‌లు(ఎఫ్ఎస్) దాఖలు చేయకపోవడం ఆధారంగా ఈ కంపెనీలు గుర్తించబడ్డాయి.
కంపెనీల చట్టం, 2013 లోని సెక్షన్ 248 ప్రకారం అందించిన నిర్ధ‌ష్ట చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించిన తరువాత కంపెనీల నియ‌మాలు, 2016 (కంపెనీల రిజిస్టర్ నుండి కంపెనీల పేర్లను తొలగించడం) మేర‌కు గ‌డిచిన మూడేళ్ల‌ కాలంలో మొత్తం 3,82,581 డొల్ల కంపెనీలు తొలగించబడ్డాయి. ఈ రోజు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు.'షెల్ కంపెనీ' అనే పదాన్ని కంపెనీల చట్టం క్రింద ఎక్క‌డా నిర్వచించలేదు. డొల్ల కంపెనీ అంనేది సాధారణంగా క్రియాశీల వ్యాపార కార్యకలాపాలు గానీ.. లేదా ముఖ్యమైన ఆస్తులు గానీ లేని సంస్థను సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్, యాజమాన్యాన్ని అస్పష్టం చేయడం, బినామి ఆస్తులు వంటి చట్టవిరుద్ధమైన ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగిస్తారు. 'షెల్ కంపెనీ' సమస్యను పరిశీలించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఈ కంపెనీల గుర్తింపున‌కు ఇత‌ర అంశాల‌తో పాటు హెచ్చరిక‌గా కొన్ని రెడ్ ఫ్లాగ్ సూచికలను ఉపయోగించాలని కూడా సిఫార‌సు చేసింది.
                                     

****


(Release ID: 1656987) Visitor Counter : 153