శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

వివిధ అభివృద్ధి దశల్లో దాదాపు 30 రకాల కోవిడ్ వాక్సిన్లు రంగంలో ఫార్మా పరిశ్రమతోబాటు విద్యాసంస్థలు

Posted On: 18 SEP 2020 5:02PM by PIB Hyderabad

బయోటెక్నాలజీ విభాగం ఐదు జాతీయ కోవిడ్-19 బయో రిపాజిటరీలను ఏర్పాటు చేసింది. ఇది దేశవ్యాప్తంగా బయోటెక్నాలజీ  విభాగం, భారత వైద్య పరిశోధనామండలి, శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనామండలి తయారు చేస్తున్న నెట్ వర్క్ లో భాగం. బయో రిపాజిటరీల జాబితాను https://www.icmr.gov.in/cbiorn.html. లో చూడవచ్చు. ఈ రిపాజిటరీలు చికిత్స పరమైన, వైరల్ నమూనాలను సేకరిస్తున్నాయి.ఇప్పటిదాకా 44452  చికిత్స సంబంధమైన, 17 వైరల్ నమూనాలు సేకరించాయి. పరిశోధకులకు, పరిశ్రమకు ఇవి అందుబాటులో ఉంటాయి. నిర్థారణకు, చికిత్సకు, వాక్సిన్లకు ఇవి ఉపయోగపడతాయి.

దేశవ్యాప్త 1000 సార్స్ కోవ్-2 ఆర్ ఎన్ ఎ జీనోమ్ సీక్వెన్సింగ్ విజయవంతంగా పూర్తైనట్టు బయోటెక్నాలజీ విభాగం ఆగస్టు 1న ప్రకటించింది. ఇది పశ్చిమ బెంగాల్ కల్యాణి లోని స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అయిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్ తోబాటు ఐదు జాతీయ క్లస్టర్లు, వైద్యచికిత్సా సంస్థలు, ఇతర ఆస్పత్రుల ఆధ్వర్యంలో నడుస్తోంది.

ఈ సమాచారాన్ని అంతర్జాతీయ వేదిక మీద పంచుకోవటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులకు ఇది ఉపయోగపడాలని భారత్ భావిస్తోంది. దీన్ని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. దేశవ్యాప్త 1000 సార్స్ కోవ్-2 ఆర్ ఎన్ ఎ జీనోమ్ సీక్వెన్సింగ్  సమాచారం https://www.gisaid.org లో చూడవచ్చు. పరిశోధకులు ఇప్పుడు దీన్ని వాడుకోవచ్చు.

దాదాపు 30 కి పైగా వాక్సిన్ నమూనాలు తయారీలో వివిధ దశల్లో ఉన్నాయి. ఈ తయారీలో పరిశ్రమతోబాటు విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. ఈ వాక్సిన్ల అభివృద్ధి వివిధ దశలలో ఉంది. వాటిలో మూడు ట్రయల్స్ దశలో  మరో నాలుగు దాదాపుగా చివరి దశలో ఉన్నాయి.  వాక్సిన్ సంబంధ పరిశోధనలకు, అభివృద్ధికి మద్దతు ఇవ్వటం, వనరులు సమకూర్చటం, క్లినికల్ ట్రయల్స్ కేంద్రాల ఏర్పాటు, నియంత్రణాపరమైన మార్గదర్శకాలు జారీచేయటం జరుగుతోంది.

వాక్సిన్ పంపిణీ మీద, టీకాలు వేయటం మీద  నీతి ఆయోగ్ కింద ఒక జాతీయ నిపుణుల బృందం ఆగస్టు 7న ఏర్పాటైంది. అందుబాటును బట్టి పంపిణీ, టీకాలివ్వటం ఆధారపడి ఉంటుంది. ఒకసారి అందుబాటులోకి వచ్చిందంటే టీకాల పంపిణీ సార్వత్రిక టీకాల కార్యక్రమం కింద పంపిణీ జరుగుతుంది.

కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూగర్భశాస్త్రాల, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలోని సమాచారం  ఇది.

*****


(Release ID: 1656455) Visitor Counter : 239