రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

చట్టబద్ధ ప్రకటిత గరిష్ట చిల్లర ధర వద్ద రైతులకు యూరియా అందిస్తున్నాం: శ్రీ గౌడ

దేశంలో యూరియా కొరత లేదు: శ్రీ గౌడ

నాడు పోస్టు చేయడమైనది: 18 SEP 2020 4:14PM by PIB Hyderabad

అత్యవసర సరుకుల చట్టం-1955 (ఈసీఏ) కింద, ఎరువులను అత్యవసర సరుకుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ, లిఖితపూర్వక సమాధానం రూపంలో రాజ్యసభకు వెల్లడించారు. ఎరువుల (నియంత్రణ) ఆదేశం-1985, ఎరువుల (రవాణా నియంత్రణ) ఆదేశం-1973ను కూడా ఈసీఏ కింద ప్రకటించిందని తెలిపారు. ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోకుండా, ప్రకటించిన గరిష్ట చిల్లర ధరకే అమ్మేలా భరోసా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన అధికారాలు ఇచ్చామని సభకు వెల్లడించారు. తనిఖీలు, జప్తులు చేయడానికి; ఎఫ్‌సీవో-1985, ఈసీఏ-1955 నిబంధనలు ఉల్లంఘించినవారిని శిక్షించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చామన్నారు.

    చట్టబద్ధ ప్రకటిత గరిష్ట చిల్లర ధరకే రైతులకు యూరియా అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 45 కిలోల యూరియా సంచి ధర (వేప పూత, వర్తించే పన్నులు కాకుండా) రూ.242; 50 కిలోల సంచి ధర (వేప పూత, వర్తించే పన్నులు కాకుండా) రూ.268గా తెలిపిన మంత్రి, రైతులందరికీ రాయితీ ధరలకే యూరియా అందుతోందన్నారు.

    రైతులు మార్కెట్‌లో అధిక ధరలకు యూరియా కొంటున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ఎరువుల విభాగానికి సమాచారం అందలేదని మంత్రి రాజ్యసభకు వెల్లడించారు. దేశంలో యూరియా కొరత లేదని మంత్రి గౌడ తన లిఖితపూర్వక సమాధానంలో ప్రకటించారు.

***


(రిలీజ్ ఐడి: 1656350) సందర్శకుల సూచీ సంఖ్య : : 152
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Tamil , Kannada