వ్యవసాయ మంత్రిత్వ శాఖ

మిడుతల దాడిలో పంట నష్టం

Posted On: 18 SEP 2020 3:09PM by PIB Hyderabad

   2019-20 సంవత్సరంలో రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో పంటలపై మిడుతల దాడి జరిగినట్టు వార్తలు వచ్చాయి. 2019-20లో రాజస్థాన్ లోని 8 జిలాల్లో పరిధిలో ఉన్న మొత్తం 1,79,584 హెక్టార్లలో పంట,.. మిడుతల దాడితో దెబ్బతిన్నట్టు రాజస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. గుజరాత్ రాష్ట్రంలోని 2 జిల్లాల పరిధిలో ఉన్న, 19,313 హెక్టార్లలో పంట మిడుతల దాడితో  దెబ్బతిన్నదని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.

  ఇక 2020-21లో పది రాష్ట్రాల్లో మిడుతల దాడి జరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, బీహార్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మిడుతలను నిర్మూలించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యలు తీసుకున్నారు. కాగా, తమ రాష్ట్రాల్లో ఎలాంటి పంటనష్టం జరగలేదని గుజరాత్, చత్తీస్ గఢ్, పంజాబ్, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి.

  2020 మే, జూన్ నెలల్లో 33శాతం పంటనష్టం మిడుతల దాడి కారణంగా సంభవించినట్టు రాజస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. మిడుతల దాడితో బికనీర్ లో  2,235 హెక్టార్లలో, హనుమాన్ గఢ్ లో 140 హెక్టార్లలో, శ్రీగంగానగర్ లో 1,027 హెక్టార్లలో పంటనష్టం జరిగినట్టు రాజస్థాన్ ప్రభుత్వం తొలుత పేర్కొంది. అయితే, ఖరీఫ్ సీజన్ లో నాట్లు పడిన పంటకు సంబంధించి మొదట్లో సమాచారం ఇచ్చామని, పంట నష్టం జరిగిన విస్తీర్ణం మేరకు రైతులు మళ్లీ నాట్లు వేశారని సవరించిన నివేదికలో రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది.

  కాగా ఏడాది జరిగిన మిడుతల దాడిలో 33శాతం విస్తీర్ణంకంటే తక్కువ స్థాయిలోనే పంట నష్టం జరిగినట్టు హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు పేర్కొన్నాయి. హర్యానాలో 6,520 హెక్టార్లలోమధ్యప్రదేశ్ లో 4,400హెక్టార్లలో, మహారాష్ట్రలో 806హెక్టార్లలో, ఉత్తరప్రదేశ్ లో488హెక్టార్లలో, ఉత్తరాఖండ్ లో 267 హెక్టార్లలో పంటనష్టం జరిగిదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి.

    2019-20 సంవత్సరానికిగాను, మిడుతల దాడితో పంట నష్టపోయిన 79,922మంది రైతులకు ప్రకృతి వైపరీత్య ప్రతిస్పందనా నిధి కింద, వ్యవసాయ పెట్టుబడి సబ్సిడీగా రూ.1,32.54కోట్ల సహాయం అందించినట్టు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించిందిఅలాగే, దాదాపుగా రూ.18.74కోట్లను వ్యవసాయ పెట్టుబడి సబ్సిడీగా 9,137మంది రైతులకు చెల్లించినట్టు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.

  2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి  మిడుతల దాడిలో రైతులకు సహాయం అందించినట్టుగా ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వమూ ప్రకటించలేదు. అయితే, మిడుతల దాడిలో పంట నష్టాలను అంచనా వేసేందుకు గిర్దావరి/ సర్వే ప్రస్తుతం కొనసాగుతోందని రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది. పంటకోత ప్రయోగాల ద్వారా పంట దిగుబడి నష్టాలను అంచనా వేసి, పేర్లు నమోద చేసుకున్న రైతులందరికీ నష్టపరిహారం చెల్లిస్తారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పి.ఎం.ఎఫ్.బి.వై.) నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లింపు జరుగుతుంది.

  కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రోజు రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో సమాచారం తెలిపారు.

****



(Release ID: 1656270) Visitor Counter : 151