యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 మహమ్మారి కారణంగా గోవాలో జ‌ర‌గాల్సిన‌ 36వ జాతీయ క్రీడలు వాయిదా

Posted On: 17 SEP 2020 4:33PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కారణంగా 36వ జాతీయ క్రీడలు వాయిదా పడ్డాయి. గోవాకు కేటాయించిన ఈ జాతీయ క్రీడ‌లు షెడ్యూల్ మేర‌కు 20.10.2020 నుండి 04.11.2020 వరకు షెడ్యూల్ చేయబడ్డాయి. 36వ జాతీయ క్రీడలకు క్రీడా మౌలిక సదుపాయాల కల్పన/ అభివృద్ధి కోసం గోవా ప్రభుత్వానికి రూ.97.80 కోట్ల కేంద్ర సహాయం విడుదల చేయ‌డ‌మైంది. 'ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల‌' తొలి సెష‌న్ ఒడిషాలో 22 ఫిబ్రవరి నుండి 2020 మార్చి 1 వరకు విజయవంతంగా జరిగాయి. మొత్తం 17 క్రీడా విభాగాలలో దాదాపు 158 విశ్వవిద్యాలయాల నుండి 3182 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు. జాతీయ క్రీడల గురించి రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత జాతీయ క్రీడా సమాఖ్యలు, క్రీడా ప్రమోషన్ బోర్డులు మొదలైన వాటి ద్వారా అథ్లెట్లు మరియు జట్ల‌కు బాగా తెలుసు. జాతీయ క్రీడల తేదీలు ఖరారైన తర్వాత, భారత ఒలింపిక్ అసోసియేషన్ మరియు జాతీయ ఆటల ఆర్గనైజింగ్ కమిటీ దేశవ్యాప్తంగా ప్రేక్షకులలో జాతీయ క్రీడలను ప్రోత్సహించడానికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వంటి వివిధ ర‌కాల ప్రచార వేదికల‌ను ఉపయోగిస్తాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీ కిరెణ్‌ రిజిజూ ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన‌ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

***



(Release ID: 1655887) Visitor Counter : 166