మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
అంగన్వాడీ వర్కర్ల జీతాల్లో పెంపు
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2020 3:56PM by PIB Hyderabad
వృత్తి కార్యకలాపాలలో పాల్గొనే సమయంలో మహిళలతో సహా ప్రజలంతా కోవిడ్ వ్యాప్తి సంబంధమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇంటి నుంచి పని చేయటం, ఆన్ లైన్ లో బోధన, టెలీ మెడిసిన్ కన్సల్టేషన్ వంటివి ఎక్కువగా ఉపయోగించుకోవాలని కోరింది. అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు కోవిడ్ సంక్షోభ సమయంలో అత్యవసర సేవలలో నిమగ్నమై ఉన్న విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావించింది,
2018 అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు గౌరవ వేతనం నెలకు రూ. 3,000/- నుంచి 4,500/- వరకు పెంచింది. అదే విధంగా అంగన్వాడి హెల్పర్ల వేతనం నెలకు రూ.1500 నుంచి రూ. 2,250 వరకూ పెంచింది అదేవిధంగా పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం కూడా ప్రారంభించి నెలకు 250 రూపాయల చొప్పున ఇస్తూ వచ్చింది. అంగన్వాడీ వర్కర్లకు ప్రోత్సాహకంగా నెలకు 500 రూపాయలు పోషణ్ అభియాన్ కింద అందిస్తున్నారు .
భారత ప్రభుత్వం చెల్లించే గౌరవ వేతనానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలు తమ త్ సొంత నిధుల నుంచి వీరికి ప్రోత్సాహకాలు కూడా చెల్లిస్తున్నాయి.
ఆశా వర్కర్లకి ఇస్తున్న ప్రోత్సాహకాలను జాతీయస్థాయిలో క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నారు. అదనపు కార్యకలాపాలు చేపట్టినప్పుడు వారికి ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ ప్రోత్సాహకాలు రాష్ట్రాలు చెల్లించే మొత్తానికి అదనంగా కేంద్రం ఇస్తున్నవి. 2018 19 ఆర్థిక సంవత్సరంలో ఆశా వర్కర్ల కిచ్చే నెలవారి ప్రోత్సాహకాలను కేంద్ర క్యాబినెట్ సమీక్షించి వెయ్యి రూపాయలు ప్రకటించింది. దీంతో వెయ్యి రూపాయల నుంచి అది రూ. 2000కి పెరిగింది. ఇది కాకుండా కోవిడ్ సంక్షోభ సమయంలో అందించిన సేవలకు గాను నెలకు వెయ్యి రూపాయలు అదనంగా ప్రోత్సాహకం ఇచ్చింది.
ఇవి కాకుండా ఇటీవల ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆశా కార్యకర్తలకు మాస్కులు శానిటైజర్ లాంటి రక్షణ పరికరాలు అందజేశారు. బీమా పథకం కూడా ఆశా కార్యకర్తలతో సహా ఆరోగ్య సిబ్బంది మొత్తానికీ వర్తింపజేస్తున్నారు. దీనివలన కోవిడ్ సేవల సమయంలో మరణించిన వారి కుటుంబీకులకు బీమా కింద రూ. 50 లక్షలు అందుతుంది. అదేవిధంగా కోవిడ్ సంబంధమైన విధుల్లో ఉండగా ప్రమాదం జరిగి మరణించినప్పుడు కూడా ఈ బీమా వర్తిస్తుంది.
కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖా మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 1655848)
సందర్శకుల సూచీ సంఖ్య : : 174