సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ఉద్యోగుల బదిలీల విధానం

Posted On: 16 SEP 2020 5:33PM by PIB Hyderabad

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, నియామకాలకు సంబంధించి సిబ్బంది &శిక్షణ విభాగం ఇచ్చిన సూచనల మేరకు, క్రింద సూచించిన అంశాల్లో అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాలు తమ సిబ్బంది బదిలీలు, నియామకాల కోసం సొంత మార్గదర్శకాలు కలిగివుండాలి. అవి:

కనీస పదవీకాలం
బదిలీని సిఫారసు చేయడానికి "సివిల్ సర్వీసెస్‌ బోర్డ్‌" తరహా యంత్రాంగం
సిబ్బంది బదిలీల విధానాన్ని సంబంధిత శాఖలు/విభాగాలు పబ్లిక్‌ డొమైన్‌లో పొందుపరచడం

    వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల నిర్దిష్ట అవసరాలపై ఆధారపడి ఉద్యోగుల బదిలీలు/నియామకాల మార్గదర్శకాలు ఉండడం వల్ల, ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒకే బదిలీ విధానాన్ని రూపొందించే ప్రతిపాదన లేదు. "స్టేట్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌" రాష్ట్రాల జాబితాలో ఉండడం వల్ల; నియమాలు, విధానాలను రూపొందించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలే అర్హులు.
దీనిప్రకారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఏక బదిలీ విధానం కోసం కమిషన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదు.

    కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా.జితేంద్ర సింగ్, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు సమర్పించారు.

****



(Release ID: 1655442) Visitor Counter : 172