హోం మంత్రిత్వ శాఖ

తీవ్రవాద వ్యతిరేక చట్టం క్రింద నమోదైన కేసులు

Posted On: 16 SEP 2020 3:28PM by PIB Hyderabad

భారత రాజ్యాంగం 7వ షెడ్యూలు ప్రకారం శాంతి భద్రతలు మరియు రక్షణ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు.

జాతీయ నేర చరిత్ర, నమోదు  సంస్థ (ఎన్సిఆర్బి) కేంద్ర సంస్థ అయినప్పటికి ఆ సంస్థ నేరాలపై రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చిన నివేదికలను తన  వార్షిక సంచిక "క్రైమ్స్ ఇన్ ఇండియా "లో ప్రచురిస్తుంది.  2018 సంవత్సరానికి సంబంధించిన ఇటీవలి ప్రచురణ ప్రకారం మొత్తం 922,901 మరియు 1182 కేసులు నమోదు కాగా 2016, 2017 మరియు 2018 సంవత్సరాల్లో  దేశవ్యాప్తంగా మొత్తం 999,1554 మరియు 1421 మంది తీవ్రవాద వ్యతిరేక చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం 1967(యుఏపిఏ) క్రింద అరెస్ట్ అయ్యారు.

ఎన్సిఆర్బి అందుకున్న సమాచారం ప్రకారం 2016, 2017 మరియు 2018 సంవత్సరాల్లో  దేశవ్యాప్తంగా  తీవ్రవాద వ్యతిరేక చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం 1967(యుఏపిఏ) క్రింద మొత్తం 232,272 మరియు 317 కేసుల్లో రక్షణ సంస్థలు చార్జిషీట్లను నమోదు చేసాయి.  2017 మరియు 2018ల్లో 92 మరియు 52 చార్జిషీట్లు నమోదు కాగా తరువాతి రెండు సంవత్సరాల్లో వరుసగా 31 మరియు 10 చార్జిషీట్లు నమోదయ్యాయి.

ఈ సమాచారాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి  శ్రీ జి.  కిషన్ రెడ్డి ఈ రోజు రాజ్య సభలో వ్రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు. 



(Release ID: 1655441) Visitor Counter : 182