ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తో పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తల కోసం ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ బీమా పథకం’ మరో ఆరు 6 నెలలు పొడిగించబడింది

Posted On: 15 SEP 2020 6:33PM by PIB Hyderabad

'కోవిడ్-19 తో పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తల కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ బీమా పథకం’ 2020 మార్చి,  30వ తేదీన 90 రోజుల కాలానికి ప్రకటించబడింది. ఈ పధకం మరో 90 రోజుల వరకు, అంటే 2020 సెప్టెంబర్, 25వ తేదీ వరకు పొడిగించబడింది.

ఈ పథకం ఇప్పుడు మరో 180 రోజులు అంటే 6 నెలలు పొడిగించబడింది.

కోవిడ్-19 రోగుల యొక్క ప్రత్యక్ష సంబంధం మరియు సంరక్షణలో ఉండాల్సిన మరియు అందువల్ల వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్న సామాజిక ఆరోగ్య కార్యకర్తలతో సహా ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు, ఈ కేంద్ర ప్రభుత్వ రంగ పథకం 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తుంది.  కోవిడ్-19  తో కలవడం వల్ల ప్రమాదవశాత్తు సంభవించే ప్రాణనష్టం కూడా ఇందులో ఉంది.

ఈ పథకం ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది / పదవే విరమణ పొందినవారు / స్వచ్చంద కార్యకర్తలు / స్థానిక పట్టణ సంస్థలు / కాంట్రాక్టు / రోజువారీ వేతనం / తాత్కాలిక / రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన స్వయం ప్రతిపత్తిగల ఆసుపత్రుల్లో నియయించిన   అవుట్ సోర్సు సిబ్బంది  / ఎయిమ్స్ మరియు ఐ.ఎన్.ఐ. లతో పాటు కోవిడ్-19 కు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన ఆసుపత్రులు ఈ పధకం పరిధిలోకివస్తాయి. 

లబ్ధిదారుడు ఇతర బీమా రక్షణ నుంచి పొందే బీమా కంటే ఎక్కువగా, ఈ పధకం ద్వారా బీమా రక్షణ అందించబడుతుంది. 

ఈ పథకానికి వయోపరిమితి లేదు. వ్యక్తిగత నమోదు అవసరం లేదు.  ఈ పథకం కోసం ప్రీమియం మొత్తాన్ని భారత ప్రభుత్వ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భరిస్తుంది.  ఈ పాలసీ క్రింద ప్రయోజనం / క్లెయిమ్ ఇతర పాలసీల కింద చెల్లించవలసిన మొత్తానికి అదనంగా ఉంటుంది.  ఈ పథకానికి సిద్ధం చేసిన మార్గదర్శకాల ఆధారంగా బీమా మొత్తాన్ని అందించడానికి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ,  న్యూ ఇండియా అస్యూరెన్స్ (ఎన్‌.ఐ.ఏ) కంపెనీ లిమిటెడ్ సంస్థతో కలిసి పనిచేసింది.

ఈ రోజు వరకు, ఈ పథకం కింద, మొత్తం 61 క్లైములను పరిశీలించి, బీమా మొత్తాన్ని చెల్లించడం జరిగింది.  156 క్లైములు న్యూ ఇండియా అస్యూరెన్స్ (ఎన్.‌ఐ.ఏ) కంపెనీ లిమిటెడ్ పరిశీలనలో ఉన్నాయి. మరో  67 కేసులలో క్లెయిమ్ ఫారాలను రాష్ట్రాలు ఇంకా సమర్పించవలసి ఉంది. 

పి.ఎమ్.జి.కె.పి. బీమా పధకం 

రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వారీగా 15/09/2020 తేదీ నాటికి క్లైముల వివరాలు

  క్రమ సంఖ్య  

 

రాష్ట్రాలు /

 కేంద్ర పాలిత 

ప్రాంతాలు 

ఎన్.ఐ.ఏ.   స్వీకరించిన 

క్లైములు 

ఎన్.ఐ.ఏ.   ప్రాసెస్   చేసిన   క్లైములు 

ఎన్.ఐ.ఏ.   వద్ద   పరిశీలనలో   ఉన్న   క్లైములు 

 

అర్హత 

లేని 

క్లైములు 

**

రాష్ట్రాల నుండి   పత్రాలు అందవలసి ఉన్న క్లైములు

1

అండమాన్ & నికోబార్ 

0

0

0

0

1

2

ఆంధ్రప్రదేశ్ 

20

4

12

4

4

3

అరుణాచల్ ప్రదేశ్ 

1

1

0

0

2

4

అస్సాం 

5

1+1

3

0

0

5

బీహార్ 

16

2

12

2

1

6

చండీగఢ్ 

1

0

1

0

0

7

ఛత్తీస్ గఢ్ 

3

0

1

2

3

8

ఢిల్లీ 

9

1

8

0

10

9

గుజరాత్ 

28

8+1

13

6

0

10

హర్యానా 

0

0

0

0

3

11

హిమాచల్ ప్రదేశ్ 

1

0

1

0

0

12

జమ్మూ &

కశ్మీర్ 

5

0

5

0

0

13

ఝార్ఖండ్

7

0

4

3

2

14

కర్ణాటక 

8

3

2

3

2

15

కేరళ 

3

3

0

0

0

16

మధ్యప్రదేశ్ 

9

1

4

4

0

17

మహారాష్ట్ర 

49

13+1

19

16

8

18

మిజోరాం 

2

0

1

1

0

19

ఒడిశా 

42

0

42

0

5

20

పుదుచ్చేరి 

0

0

0

0

4

21

పంజాబ్ 

1

1

0

0

7

22

రాజస్థాన్ 

17

4

5

8

1

23

తమిళనాడు 

20

4+1

8

7

2

24

తెలంగాణ 

11

2

6

3

9

25

ఉత్తరప్రదేశ్ 

11

5+1

2

3

1

26

పశ్చిమ బెంగాల్ 

13

3

7

3

2

 

మొత్తం 

282

 61

 

156

65

67

 

మహమ్మారికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పోరాటంలో ముందంజలో ఉన్న ఆరోగ్య సంరక్షణ కార్మికుల సంక్షేమం మరియు శ్రేయస్సును నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ పథకం ఎత్తి చూపుతోంది.  కోవిడ్ కి వ్యతిరేకంగా భారతదేశం తన పోరాటాన్ని కొనసాగించడానికి తోడ్పడుతున్న, ఈ కార్మికుల నిస్వార్థ సేవ, పని పట్ల వారి అంకితభావానికి అందించే ప్రతిఫలం. వీరి కృషి ఫలితంగా, భారతదేశంలో తక్కువ మరణాల రేటు (1.64 శాతం) కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యల్పంగా  నమోదైన మరణాల రేటు (ఈ రోజు నాటికి 3.19 శాతం) కంటే భారతదేశంలో మరణాల రేటు తక్కువగా ఉంది.  

*****


(Release ID: 1654905) Visitor Counter : 263