ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆరోగ్య కార్యకర్తల కోవిడ్ 19 మరణాలు
Posted On:
15 SEP 2020 3:01PM by PIB Hyderabad
ఆరోగ్యం రాష్ట్ర సంబంధిత విషయం. ఇటువంటి డేటాను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కేంద్ర స్థాయిలో నిర్వహించదు. ఏదేమైనా, "ప్రధాన మంత్రి గారిబ్ కళ్యాణ్ బీమా ప్యాకేజీ" కింద ఉపశమనం పొందే వారి డేటాబేస్ జాతీయ స్థాయిలోనూ నిర్వహించబడుతుంది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇన్‌ఫెక్షన్ సంక్రమణ నివారణ మరియు నియంత్రణ పద్ధతులపై మార్గదర్శకాన్ని అందించింది. 2020 మార్చిలో అన్ని రాష్ట్రాలకు శిక్షణ ఇవ్వబడింది. 2020 మార్చి 20 నాటికి జిల్లా స్థాయి వరకు శిక్షణను పూర్తి చేయడానికి రాష్ట్రాలకు శిక్షణా ప్రణాళికను కూడా అందించడమైనది. ఐగోట్ ప్లాట్‌ఫామ్‌లో అన్ని వర్గాల ఆరోగ్య కార్యకర్తలకు ఇన్‌ఫెక్షన్ నివారణ మరియు నియంత్రణకు గాను శిక్షణ కూడా అందుబాటులో ఉంచబడింది. ఇన్‌ఫెక్షన్ నివారణ మరియు నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను కోరారు. ఆరోగ్య సంరక్షణ కార్మికులను పర్యవేక్షించే మరియు వారి ఎక్స్పోజర్ స్థితిని సమీక్షించే నోడల్ అధికారిని ఆసుపత్రులు గుర్తించడమైంది. అధిక రిస్క్ ఎక్స్పోజర్ కలిగిన వారిని 7 రోజుల పాటు క్వారెంటైన్ నిర్బంధంలో ఉంచాలి. వైద్యులు, నర్సింగ్ అధికారులు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలు వారి ఎక్స్పోజర్ / క్లినికల్ ప్రొఫైల్ ఆధారంగా, నోడల్ ఆఫీసర్/ డిపార్ట్మెంట్ హెడ్ (లేదా ఆయన నియమించిన సబ్-కమిటీ) క్వారెంటైన్ సమయాన్ని మరో వారం పాటు పోడిగించే విషయమై నిర్ణయం తీసుకుంటారు. కోవిడ్ మరియు నాన్-కోవిడ్ ప్రాంతాల్లోని ఆసుపత్రులలో పనిచేసే ఆరోగ్య సంరక్షణ కార్మికుల సంక్షేమం కోసం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జూన్ 18, 2020న ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఆసుపత్రి మరియు కమ్యూనిటీ సెట్టింగుల (ఫ్రంట్ లైన్ కార్మికులతో సహా) కోసం పీపీఈలను హేతుబద్ధంగా ఉపయోగించే విషయమై మార్గదర్శకాలను కేంద్రం 24.03.2020 న జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు రిస్క్ బేస్డ్ విధానాన్ని అనుసరించాయి. అధిక మరియు తక్కువ రిస్క్ ఉన్న ప్రాంతాల్లో ఉపయోగించాల్సిన పీపీఈ రకాలను ఇది సిఫార్సు చేసింది.
ఆరోగ్య సంరక్షణ కార్మికులలో రోగనిరోధకత మరియు సంక్రమణ నివారణకు హైడ్రాక్సీక్లోరోక్విన్ అందించబడ్డాయి. ఎన్-95 ముసుగులు మరియు ట్రిపుల్ / డబుల్ ప్లై మాస్క్‌లను ధర నియంత్రణలోకి తీసుకురావడం జరిగింది. స్వావలంబన సాధించేంత వరకు పీపీఈ, ఎన్ 95 మాస్క్‌లు, ట్రిపుల్ / డబుల్ ప్లై మెడికల్ మాస్క్‌లు, గాగుల్స్ మరియు వైజర్‌ల ఎగుమతులు నిషేధించబడ్డాయి. “ఇండియా కోవిడ్ -19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపరేషన్‌నెస్ ప్యాకేజీ” కింద 15000 కోట్ల రూపాయల (2 బిలియన్ డాలర్లు) ప్యాకేజీని 2020 ఏప్రిల్ 22 న కేబినెట్ ఆమోదించింది. అత్యవసర కోవిడ్-19 ప్రతిస్పందనతో సహా వివిధ విభాగాల కింద రాష్ట్రాలకు నిధులు మరియు వస్తువులను కేటాయించారు. 9.81 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లు మరియు 28,476 వెంటిలేటర్లు రాష్ట్రాలు / యూటీలకు సరఫరా చేయబడ్డాయి. మహమ్మారి యొక్క ప్రారంభంలోరక్షిత గేర్లు అందుబాటులో లేకపోవడంపై పలు ఆందోళనలు వ్యక్తమైయ్యాయి. ఏదేమైనా, భారత ప్రభుత్వం సామర్థ్యాన్ని పెంచడానికి మరియు పీపీఈల యొక్క అవసరాలకు
అనుగుణంగా రాష్ట్రాలకు కేటాయించడంతో ఈ ఆందోళన పరిష్కరించబడింది. దేశంలో రాష్ట్రాలు / యూటీలకు 3.05 కోట్ల ఎన్-95 మాస్క్‌లు, 1.2 కోట్ల మేర పీపీఈ కిట్లు అందించబడినాయి.
"ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ" కింద ఉపశమనం పొందిన ఆరోగ్య సంరక్షణ కార్మికుల సంఖ్య రాష్ట్రాల వారీగా ఈ క్రిందన ఇవ్వబడ్డాయి:
పీఎంజీకేపీ: బీమా పథకం ప్రకారం కోవిడ్ 19 కారణంగా మరణించిన ఆరోగ్య కార్యకర్తల సంఖ్య
|
రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం వారీగా జాబితా (11-09-2020 నాటికి)భ
|
క్రమ సంఖ్యభ
|
రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం
|
డాక్టర్లు
|
ఏఎన్ఎం/ఎంపీహెచ్‌డబ్ల్యూ
|
ఆశా
|
ఇతరులు
|
మొత్తం
|
1
|
అండమాన్ నికోబార్
|
1
|
0
|
0
|
0
|
1
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
5
|
5
|
1
|
1
|
12
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
0
|
0
|
0
|
0
|
0
|
4
|
అస్సాం
|
1
|
0
|
0
|
4
|
5
|
5
|
బీహార్
|
4
|
1
|
1
|
0
|
6
|
6
|
ఛండీగఢ్
|
0
|
0
|
0
|
0
|
0
|
7
|
ఛత్తీస్‌గఢ్
|
2
|
0
|
1
|
1
|
4
|
8
|
ఢిల్లీ
|
3
|
0
|
0
|
5
|
8
|
9
|
గుజరాత్
|
5
|
6
|
2
|
1
|
14
|
10
|
హర్యానా
|
2
|
0
|
0
|
0
|
2
|
11
|
హిమాచల్ ప్రదేశ్
|
0
|
0
|
1
|
0
|
1
|
12
|
జమ్మూ మరియు కాశ్మీర్
|
2
|
0
|
0
|
1
|
3
|
13
|
జార్ఖండ్
|
2
|
2
|
1
|
1
|
6
|
14
|
కర్ణాటక
|
2
|
0
|
1
|
1
|
4
|
15
|
కేరళ
|
0
|
0
|
0
|
1
|
1
|
16
|
మధ్యప్రదేశ్
|
3
|
0
|
0
|
4
|
7
|
17
|
మహారాష్ట్ర
|
6
|
3
|
0
|
12
|
21
|
18
|
మిజోరాం
|
0
|
0
|
0
|
2
|
2
|
19
|
ఒడిషా
|
3
|
1
|
0
|
1
|
5
|
20
|
పంజాబ్
|
1
|
2
|
1
|
1
|
5
|
21
|
పుదిచ్ఛెరి
|
0
|
0
|
0
|
0
|
0
|
22
|
రాజస్థాన్
|
2
|
5
|
0
|
1
|
8
|
23
|
తమిళనాడు
|
5
|
3
|
0
|
2
|
10
|
24
|
తెలంగాణ
|
3
|
0
|
3
|
1
|
7
|
25
|
ఉత్తర్ ప్రదేశ్
|
8
|
0
|
0
|
1
|
9
|
26
|
పశ్చిమ బెంగాల్
|
4
|
4
|
2
|
4
|
14
|
|
మొత్తం
|
64
|
32
|
14
|
45
|
155
|
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ఈ రోజు ఇక్కడ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాల్ని వెల్లడించారు.
*****
(Release ID: 1654564)
Visitor Counter : 231