వ్యవసాయ మంత్రిత్వ శాఖ

అసోంలో భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం

నాడు పోస్టు చేయడమైనది: 15 SEP 2020 4:04PM by PIB Hyderabad

అసోంలో, ఐసీఏఆర్-భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (‌ఐఏఆర్‌ఐ) ఏర్పాటు కోసం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 2017 మే 26వ తేదీన శంకుస్థాపన చేశారు. మొత్తం 587 ఎకరాల్లో, విద్య-నివాస ప్రాంగణాల కోసం 45 ఎకరాల అభివృద్ధి జరిగింది. ప్రస్తుత పరిస్థితి ఈ క్రింది విధంగా ఉంది: 
 
    45 ఎకరాల సరిహద్దు గోడ, ప్రీఫ్యాబ్రికేటెడ్‌ భవన పనులు జరిగాయి.
    విద్య-పరిపాలన భవనం, రహదారుల నిర్మాణం, స్థలం అభివృద్ధి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది.
    అతిథిగృహం పనులకు అనుమతులు మంజూరయ్యాయి.
    59 శాస్త్రవేత్తల ఖాళీలు మంజూరయ్యాయి. నలుగురు శాస్త్రవేత్తల నియామకం జరిగింది.

    2015-16 విద్యా సంవత్సరం నుంచి, ఐఏఆర్‌ఐ-అసోం విద్యార్థులు ఐఏఆర్‌ఐ-న్యూదిల్లీలో ఏటా ఎంఎస్సీ డిగ్రీలో చేరుతున్నారు. ఇప్పటివరకు 55 మంది ఎంఎస్సీ విద్యార్థులు చేరారు. 28 మంది విద్య పూర్తి చేసుకోగా, 23 మంది ప్రస్తుతం చదువుతున్నారు. ఈశాన్య ప్రాంతానికి, ముఖ్యంగా అసోంకు సంబంధించిన క్షేత్రస్థాయి పరిశోధన పనులను ఈ ప్రాంతంలోని విద్యార్థులు నిర్వహిస్తారు.

    ఐఏఆర్‌ఐ-గోగముఖ్‌లో 2020-21 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా పనుల పురోగతి తీవ్రంగా ప్రభావితమైంది. భవిష్యత్తులో గోగముఖ్‌ ప్రాంగణానికి విద్యార్థులను తరలించే అవకాశం కరోనా పరిస్థితులపై ఆధారపడివుంది.

    కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు సమర్పించారు.

 

****


(రిలీజ్ ఐడి: 1654558) సందర్శకుల సూచీ సంఖ్య : : 144
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Assamese , Manipuri , Punjabi , Tamil