ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 బాధితులకు క్రొత్త ఆరోగ్య పరిరక్షణ పథకం
Posted On:
15 SEP 2020 3:04PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి క్రింద కొవిడ్-19తో పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తల కోసం వనరులను కేటాయించింది. ఈ పథకం క్రింద కొవిడ్-19 వ్యాధిగ్రస్తులతో ప్రత్యక్షంగా మసలుతూ వ్యాధి సంక్రమించే అవకాశం మెండుగా ఉన్న కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలకు రు.50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారు. కొవిడ్-19 వలన మరణించిన ఆరోగ్య కార్యకర్తలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.
ఈ పథకంలో ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది /పదవీ విరమణ చేసినవారు/స్వచ్ఛంద కార్యకర్తలు/స్థానిక పట్టణ కార్మికులు/కాంట్రాక్టు కార్మికులు/ రోజు కూలీలు/తాత్కాలిక/రాష్ట్రాల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది/కేంద్ర ఆసుపత్రులు/ స్వయం ప్రతిపత్తి కలిగిన కేంద్ర ఆసుపత్రులు/రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు, ఏయిమ్స్ మరియు ఐఎన్ఐలు/కేంద్ర మంత్రిత్వ శాఖల ఆసుపత్రులను కొవిడ్-19 సంబంధిత బాధ్యతలకు అనుమతించారు.
లబ్దిదారుడు ఏ ఇతర బీమా సౌకర్యాన్నైనా పొందుతుంటే అంత కంటే ఎక్కువ మొత్తానికి బీమా సౌకర్యాన్ని ఈ పథకం అందిస్తుంది.
ఆర్థిక-సామాజిక కుల ఆధారిత గణాంకాల(ఎస్ఇసిసి) ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19 సోకిన వారికి ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఎబి-పిఎంజెఏవై) క్రింద రెండవ మరియు తృతీయ స్థాయి కుటుంబాలకు సంవత్సరానికి రు.5 లక్షల ఆరోగ్య రక్షణను అందిస్తున్నారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం ’కొవిడ్-19 పరీక్ష కోసం’ మరియు ’కొవిడ్-19 చికిత్స కోసం’ అని విడివిడిగా ప్రకటించడమైనది.
ఈ రోజు రాజ్య సభలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ (స్వతంత్ర) మంత్రి శ్రీ అశ్వనీ కుమార్ చౌబే వ్రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం
***
(Release ID: 1654504)
Visitor Counter : 156