మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన విద్య లభ్యమయ్యేలా నిశ్చయం చేసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు

Posted On: 14 SEP 2020 4:42PM by PIB Hyderabad

విద్యా సంవత్సరం 2018-19 నుంచి భారత ప్రభుత్వం పాఠశాల విద్య కోసం ఒక సమగ్ర స్కీము సమగ్ర శిక్షను ప్రారంభించింది.  పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని స్థాయిలలో అంటే శిశు (ప్రీ స్కూల్) స్థాయి నుంచి 12వ తరగతి (XII) వరకు  నాణ్యమైన సమీకృత మరియు  సమధర్మ విద్యను ఖచ్చితంగా అమలు చేసే లక్ష్యంతో సమగ్ర శిక్షను ప్రారంభించడం  జరిగింది.  దాని ఉద్దేశం ప్రీ స్కూల్ , ప్రాధమిక, మాధ్యమిక, సెకండరీ నుంచి సీనియర్ సెకండరీ స్థాయిలకు చేరడం అనేది 'పాఠశాల' స్వరూపంగా ఊహించడం జరిగింది.  కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయంతో మునుపు ప్రారంభించిన మూడు స్కీములు సర్వ శిక్షా అభియాన్ (ఎస్ ఎస్ ఎ),  రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ ఎం ఎస్ ఎ)  మరియు ఉపాధ్యాయ విద్య (టి ఇ) లను కలిపి రూపొందించిందే సమగ్ర శిక్ష స్కీము.  

పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని స్థాయిలలో లింగ మరియు సామాజిక వర్గ అంతరాలను పూడ్చడం ఈ స్కీము ప్రధాన ఉద్దేశాలలో ఒకటి.  బాలికలు,  షెడ్యూల్ కులాలు (ఎస్సీ),  షెడ్యూల్ తెగలు (ఎస్టీ),  మైనారిటీ వర్గాలు మరియు ట్రాన్స్ జెండర్ లకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడం ఈ స్కీము లక్ష్యం.  పట్టణాలలో నిర్ధనులైన పిల్లలు,  తరచు వలసల వల్ల ప్రభావితులయ్యే పిల్లలు మరియు  మారుమూల ప్రాంతాలలో మరియు  విసిరేసినట్లున్న ఆవాస ప్రాంతాలలో పిల్లల పట్ల ఈ స్కీము ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది.  ప్రాధమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు ఏర్పాటు  అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు,  కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు (కె జి బి విలు) నిర్మించేటప్పుడు  ప్రత్యేక దృష్టి  జిల్లాలు, విద్యావిషయకంగా వెనుకబడిన బ్లాకులు, వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న జిల్లాలు,  ఆకాంక్షలతో కూడిన జిల్లాల వంటి  వాటికి ప్రాధాన్యం ఇవ్వడానికి స్కీములో ఏర్పాటు చేశారు.  

పి ఎం ఈ - విద్య పేరిట ఒక సమగ్ర ప్రయత్నం ప్రారంభించారు.  బహుళ పద్ధతిలో బోధన చేసేందుకు ఉద్దేశించిన ఈ-విద్య  డిజిటల్ /ఆన్ లైన్ /ఆన్ ఐయిర్ విద్యలను ఒకటిగా చేస్తుంది.   దీని ద్వారా దేశవ్యాప్తంగా  దాదాపు  27 కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం కలుగుతుంది.

రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో పాఠశాల విద్యకు అవసరమైన ఈ-విషయాన్ని సమకూర్చడానికి దేశ డిజిటల్ మౌలిక సదుపాయం దీక్ష ఏర్పాటు చేశారు. అన్ని తరగతులకు క్యూ ఆర్ కోడ్ ఉన్న పాఠ్య పుస్తకాలు సమకూరుస్తారు.  దీని ఉద్దేశం ఒకే దేశం, ఒకే డిజిటల్ వేదిక.  

స్వయం ప్రభలో  ఒక తరగతికి ఒక టెలివిజన్ ఛానల్ ఉండే విధంగా 1 నుంచి 12 తరగతులకు ఛానల్స్ ఉంటాయి.  

రేడియో, సామాజిక రేడియో మరియు సి బి ఎస్ ఇ  పోడ్కాస్ట్ - శిక్షావాణిలను  స్వయం పోర్టల్, ఈ-పాఠశాల విస్తృతంగా ఉపయోగించుకుంటాయి.

దృష్టిలోపం,  వినికిడి సమస్య ఉన్నవారికోసం ప్రత్యేక ఈ-విషయంతో  ' డైసీ'  అనే ప్రత్యేక సమాచార వ్యవస్థను అభివృద్ధి చేశారు.  అంతేకాక సంజ్ఞలతో రూపొందించిన బోధనాంశాలను  జాతీయ ఓపెన్ స్కూలు వెబ్ సైటు / యూ ట్యూబ్ లో ఉంచారు.  

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ 'నిశాంక్' సోమవారం  లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో ఈ సమాచారం తెలియజేశారు.


 

*****



(Release ID: 1654299) Visitor Counter : 118