రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్ కాల్పుల విర‌మ‌ణ ఉల్లంఘనలు

Posted On: 14 SEP 2020 5:32PM by PIB Hyderabad

ఈ ఏడాది (జనవరి 01 నుండి 2020 సెప్టెంబర్ 07 వరకు..) జమ్మూ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబ‌డి మొత్తం 3186 కాల్పుల విరమణ ఉల్లంఘన సంఘటనలు జరిగాయి. దీనికి తోడు ఈ ఏడాది (2020 జనవరి 01 నుండి 31 ఆగస్టు 31 వరకు..) జమ్మూ ప్రాంతంలో భార‌త్‌-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుల‌లో 242 సరిహద్దు కాల్పుల సంఘటనలు జరిగాయి. ఈ సంవత్సరం (2020 సెప్టెంబర్ 07 వరకు) జమ్మూ కాశ్మీర్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల్లో ఎనిమిది మంది ఆర్మీ సిబ్బంది గాయ‌ప‌డి ప్ర‌మాద‌కర మరణాలు పొంద‌గా.. మ‌రో ఇద్ద‌రు అప్ర‌మాదక‌ర ఘ‌ట‌న‌ల్లో మరణం పొందారు. అదనంగా, జమ్మూ కాశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు మరియు నియంత్రణ రేఖ వెంట జ‌రిగిన సంఘ‌ట‌న‌ల్లో బీఎస్ఎఫ్‌కు చెందిన ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు భారత సైన్యం/ బీఎస్ఎఫ్ అవసరమైన విధంగా తగిన ప్రతీకార చ‌ర్య‌ల‌ను నిర్వహించింది. దీనికి తోడు పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన విష‌యాన్ని పాకిస్థాన్ అధికారులకు వివిధ మార్గాలలో తెలియ‌జేయ‌డ‌మైంది. హాట్‌లైన్‌, ఫ్లాగ్‌ సమావేశాలు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ చర్చలతో పాటు ఇరు దేశాల మధ్య దౌత్య మార్గాల ద్వారా తెల‌ప‌డ‌మైంది.

శ్రీ సి.ఎం. ర‌మేశ్‌లు ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ర‌క్ష‌ణ శాఖ స‌హాయ మంత్రి శ్రీ శ్రీపాద్ నాయక్ ఈ రోజు రాజ్య‌స‌భ‌కు లిఖితపూర్వకంగా ఇచ్చిన‌ సమాధానంలో ఈ స‌మాచారాన్ని తెలిపారు.

***


(Release ID: 1654296) Visitor Counter : 179