ఆర్థిక మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 ని ఎదుర్కోడానికి రాష్ట్రాలకు నిధుల విడుదల
Posted On:
14 SEP 2020 5:39PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్) మొదటి వాయిదాగా రూ. 11,092 కోట్లు 2020 ఏప్రిల్ 3 న రాష్ట్రాలకు విడుదల చేసింది. ఈ రోజు లోక్‌సభలో అడిగిన వ్రాతపూర్వక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
మరిన్ని వివరాలను తెలియజేస్తూ, 2020-21 సంవత్సరానికి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి) లో 2 శాతం వరకు అదనపు రుణాలు తీసుకునే పరిమితిని రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతించారని శ్రీ ఠాకూర్ అన్నారు. జిఎస్‌డిపిలో 2% అదనపు రుణ పరిమితికి గాను, 2020-21 సంవత్సరంలో బహిరంగ మార్కెట్ రుణాలు (ఓఎంబి) పెంచడానికి జిఎస్‌డిపిలో 0.50 శాతం అంటే రూ.1,06,830 కోట్ల రుణాలు తీసుకోవడానికి సమ్మతి ఇప్పటికే రాష్ట్రాలకు జారీ అయింది.
విడుదల చేసిన నిధుల గురించి రాష్ట్రాల వారీగా వివరాలు Annexure-I లో ఉన్నాయని, 2020-21 సంవత్సరానికి రాష్ట్రానికి జారీ చేసిన జిఎస్‌డిపిలో 0.5 శాతం అదనపు రుణాలు తీసుకున్నట్లు రాష్ట్రాల వారీ వివరాలు Annexure-II లో లో ఉన్నాయని శ్రీ ఠాకూర్ చెప్పారు.
****
ANNEXURE-I

ANNEXURE-II

***
(Release ID: 1654288)
Visitor Counter : 232