గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
గిరిజన ఉత్పత్తుల గుర్తింపు మరియు మార్కెటింగ్ అభివృద్ధి
प्रविष्टि तिथि:
14 SEP 2020 3:32PM by PIB Hyderabad
గిరిజనులకు ప్రోత్సాహం మరియు వారి అభివృద్ధి కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దాని అధీనంలోని సంస్థ 'ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (ట్రైఫెడ్) ద్వారా “గిరిజన ఉత్పత్తుల అభివృద్ధి మరియు మార్కెటింగ్‌నకు సంస్థాగత మద్దతు” అనే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద మార్కెట్ అభివృద్ధి కార్యకలాపాలతో పాటుగా ట్రైఫెడ్ రిటైల్ మార్కెటింగ్ కార్యకలాపాల్లోనూ పాల్గొంటోంది. గిరిజన సరఫరాదారుల నుండి (అంటే వ్యక్తిగత గిరిజన కళాకారులు, స్వయం సహాయక సంఘాలు, గిరిజన కళాకారులతో పనిచేసే సంస్థలు/ ఏజెన్సీలు) వివిధ గిరిజన ఉత్పత్తులను సేకరించడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల్లో మరియు రిటైల్ నెట్‌వర్క్ ఆఫ్ ట్రైబ్స్ ఇండియా షోరూమ్‌లు మరియు దేశ వ్యాప్త ప్రదర్శనల ద్వారా మార్కెటింగ్ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ట్రైఫెడ్ నిర్వహిస్తు్న వివిధ రకాల గిరిజనుల ఉత్పత్తులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
•మెటల్ క్రాఫ్ట్
• గిరిజన వస్త్రాలు
• గిరిజన ఆభరణాలు
• గిరిజన పెయింటింగ్‌లు
• చెరకు & వెదురు ఉత్పత్తులు
• టెర్రకోట & స్టోన్ పాటరీ
• బహుమతి మరియు నోవాల్టీస్ & సేంద్రీయ మరియు సహజ ఆహార ఉత్పత్తులు
“మెకానిజం ఫర్ మార్కెటింగ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ (ఎంఎఫ్‌పీ) త్రూ మినిమమ్ సపోర్ట్ ప్రైస్ (ఎంఎస్‌పీ) అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ వాల్యూ చైన్ ఫర్ ఎంఎఫ్‌పీ” అనే పథకంలో జోడించేందుకు గాను ఆయా రాష్ట్రాలలో గిరిజన ఉత్పత్తుల విక్రయ మరియు మార్కెటింగ్ ఏజెన్సీల వారి సౌజన్యంతో దేశ వ్యాప్తంగా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ (ఎంఎఫ్‌పీ) వస్తువులను గుర్తించడమైంది. ప్రారంభంలో ఈ పథకంను రాజ్యాంగంలోని షెడ్యూల్ V కింద గుర్తించబడిన ప్రాంతాలు కలిగి ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయబడింది. తొలత పది ఎంఎఫ్‌పీ అంశాలను కవర్ చేయబడ్డాయి. వివిధ భాగస్వామ్య పక్షాల వారు ట్రైఫెడ్‌తో చర్చించిన తరువాత ఈ జాబితా క్రమానుగతంగా సవరించబడింది. ప్రస్తుతం 73 ఐటమ్స్ గుర్తించారు. ఇందులో సాధారణంగా "వ్యవసాయ ఉత్పత్తులు”గా వర్గీకరించబడే 15 వస్తువులూ ఉన్నాయి. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా దేశంలో నెలకొన్న అసాధారణ మరియు చాలా క్లిష్ట పరిస్థితుల కారణంగా గిరిజన సేకరణదారులచే సేకరించబడే వీటిని జాబితాలో చేర్చడమైనది.
మార్కెటింగ్ డెవలప్‌మెంట్ కార్యకలాపంలో భాగంగా ఈ కింది ఉత్పత్తులు కర్ణాటక నుండి సోర్స్ చేయబడుతున్నాయి: అడవి హనీ, షీకాకాయ, కాఫీ, ఉసిరి, మొదలైనవి. ఇందులో సోలిగా గిరిజన సమూహాలు పాలుపంచుకుంటున్నాయి.
“ఇన్‌స్టిట్యూషినల్ సపోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ట్రైబల్ ప్రోడక్ట్స్ /ప్రొడ్యూస్”
మరియు “మెకానిజం ఫర్ మార్కెటింగ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ (ఎంఎఫ్‌పీ) త్రూ మినిమమ్ సపోర్ట్ ప్రైస్ (ఎంఎస్‌పీ) అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ వాల్యూ చైన్ ఫర్ ఎంఎఫ్‌పీ” అనే
పథకాలు డిమాండ్ ఆధారితంగాను, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలపై ఆధారపడి ముందుకు సాగుతాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి శ్రీమతి రేణుకా సింగ్ సరుతా ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలియజేశారు.
*****
(रिलीज़ आईडी: 1654157)
आगंतुक पटल : 232