శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ విసిరిన స‌వాలును ఎదుర్కొనేందుకు అంత‌ర్జాతీయంగా జ‌న్యు వైవిధ్యం, వైర‌ల్ క్రమం అంచ‌నాపై ప‌రిశోధ‌న


Posted On: 13 SEP 2020 2:21PM by PIB Hyderabad

భార‌త‌దేశంలోని కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు సార్సు- సిఒవి-2 కు సంబంధించి భార‌త‌దేశంతో స‌హా, ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న్యు ప‌రిణామ క్ర‌మాల‌పై ప‌రిశోధ‌న‌లు సాగిస్తున్నారు. కోవిడ్ -19 వైర‌స్ స‌మ‌స్య‌ను ఎదుర్కోవ‌డానికి అవ‌కాశం ఉన్న మెరుగైన స‌మాధానాన్నిక‌నుగొనేందుకు, వైర‌స్‌లో, మ‌నుషుల‌లోని మాలిక్యులార్ టార్గెట్‌ల‌ను వీరు గుర్తించ‌నున్నారు.

నోవెల్ క‌రొనా వైర్ స‌వాలును ఎదుర్కొని దానిని విచ్ఛిన్నం  చేసేందుకు స‌మ‌స్య‌ను మూలంలోనుంచి చూడ‌డంతోపాటు, భిన్న కోణాల‌లో దీనిని ప‌రిశీలించేందుకు కోల్ క‌తాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నిక‌ల్ టీచ‌ర్చ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ‌కు చెందిన డిపార్ట‌మెంట్ ఆఫ్ కంప్యూట‌ర్ సైన్సు, ఇంజ‌నీరింగ్‌కు  చెందిన అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ ఇంద్ర‌జిత్ షా, ఆయ‌న బృందం వెబ్ ఆధారిత కోవిడ్ సూచిక‌ను రూపొందించారు. ఇది మెషిన్ లెర్నింగ్ ద్వారా వైర‌స్‌ల క్ర‌మాన్ని ఆన్‌లైన్ ద్వారా అంచ‌నావేస్తుంది. ఇందుకు సంబంధించి జ‌న్యుప‌ర‌మైన వైవిధ్యాన్నిఅంచ‌నా వేసేందుకు 566 భార‌తీయ సార్సు -సి.ఒ.వి 2 జెనోమ్‌ల‌ను ప‌రిశీలించారు. పాయింట్ మ్యుటేష‌న్‌, సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిసిజం (ఎస్.ఎన్‌.పి) కి సంబంధ‌ఙంచి వైవిద్య‌త‌ను ప‌రిశీలించారు. 

ఈ అధ్య‌య‌నాన్ని సైన్సు ఇంజ‌నీరింగ్ రీసెర్చి బోర్డు (ఎస్‌.ఇ.ఆర్‌.బి) స్పాన్స‌ర్‌చేసింది.  ఇది డిపార్ట‌మెంట్ ఆఫ్ సైన్సు, టెక్నాల‌జీ (డిఎస్‌టి) కింద చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన సంస్థ‌. దీనిని ఇన్‌ఫెక్షన్లు, జెనిటిక్స్‌, ఎవ‌ల్యూష‌న్ పేరుతో గ‌ల జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. 

భారతీయ సార్సు సిఒవి-2 జన్యువులలోని 6 కోడింగ్ ప్రాంతాలలో 64 ఎస్‌.ఎన్‌.పి లలో 57 ఉన్నాయని వారు కనుగొన్నారు,  అన్నీవాటి స్వ‌భావంలో ఏక‌రీతిగా లేవు.

ఇండియాతో స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌దివేల క్ర‌మాల‌కు  శాస్త్ర‌వేత్త‌లు ఈ ప‌రిశోధ‌న‌ను విస్త‌రింప‌చేశారు. ఇందులో ఇండియాతో స‌హా అంత‌ర్జాతీయంగా  20260, ఇండియా కాక  ఇత‌ర దేశాల‌లో18997, కేవ‌లం ఇండియాలో 3514 ప్ర‌త్యేక మ్యుటేష‌న్ పాయింట్ల‌ను  క‌నుగొన్నారు.

ఇండియాతో స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సార్సు సిఒవి -2 జెనోమ్‌ల జన్యు వైవిధ్యాన్ని శాస్త్ర‌వేత్త‌లు గుర్తించే ప‌నిలో ఉన్నారు. సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం (ఎస్‌.ఎన్‌.పి)ని ఉప‌యోగించి వారు ఎన్నో వైర‌స్ స్ట్రెయిన్‌ల‌ను క‌నుగొన్నారు. వైర‌స్ టార్గెట్ ప్రొటీన్‌ల‌ను గుర్తించారు. ప్రొటీన్‌-ప్రొటీన్ ఇంట‌రాక్ష‌న్ ద్వారా మాన‌వుల‌లోకి చేరే క్ర‌మాన్ని గుర్తించారు. అలాగే జెనిటిక్
వైవిధ్య‌త‌కు సంబంధించిన ప‌రిజ్ఞానాన్ని  స‌మ్మిళితంచేసి సింథ‌టిక్ వాక్సిన్‌కాండిడేట్ల‌ను గుర్తిస్తారు. అలాగే వైర‌స్ ఎంఐఆర్ ఎన్ ఎల‌ను క‌నిపెడ‌తారు. ఇవి మాన‌వ ఎం ఆర్ ఎన్ ఎ ల‌ను కూడా నియంత్రించ‌డంలో పాలుపంచుకుంటాయి.

వివిధ దేశాల‌లో వైరస్ మ్యుటేష‌న్ కు సంబంధించిన క్ర‌మాల‌కు గ‌ల‌ పోలిక‌ల‌ను శాస్త్ర‌వేత్తలు గ‌ణించారు. ఈ ఫ‌లితాల ప్ర‌కారం, అమెరికా, ఇంగ్లండ్‌, ఇండియా లు జియోమెట్రిక్‌మీన్‌లో ఉన్న‌త స్థాయిలో ఉన్నాయి. అవి ఇతరం 72 దేశాల మ్యుటేష‌న్ ఏక‌రూప‌త స్కోరుతో పోలిస్తే వ‌‌రుస‌గా 3.27 శాతం, 3.59 శాతం,5.39 శాతంగా ఉన్నాయి. శాస్త్ర‌వేత్త‌లు సార్స్ -సిఒవి-2లో మ్యుటేష‌న్ పాయింట్ల‌ను క‌నుగొనేందుకు ఒక వెబ్ అప్లికేష‌న్‌ను అభివృద్ధి చేశారు. దీనిని అంత‌ర్జాతీయంగా అలాగే దేశాల‌వారీగా రూపొందించారు. దీనికితో పాటు వారు ప్ర‌స్తుతం ప్రొటీన్ -ప్రొటీన్ ఇంట‌రాక్ష‌న్లు, ఎపిటోప్‌ల అన్వేష‌న్‌, వైర‌స్ ఎంఐ ఆర్ ఎన్ యు అంచ‌నాల పై ప‌నిచేస్తున్నారు.

కోవిడ్ ప్రిడిక్ట‌ర్ లింక్ :
http://www.nitttrkol.ac.in/indrajit/projects/COVID-Predictor/index.php
 ప‌బ్లికేష‌న్ లింక్‌:
https://doi.org/10.1016/j.meegid.2020.104457.

మ్యుటేష‌న్ల‌కు సంబంధించిన అధ్య‌య‌నం ప్ర‌స్తుతం స‌మీక్ష‌లో ఉన్న‌దాని లింక్‌:
Link:http://www.nitttrkol.ac.in/indrajit/projects/COVID-Mutation-10K/

Link:https://www.frontiersin.org/research-topics/15309/sars-cov-2-from-genetic-variability-to-vaccine-design

 మ‌రిన్ని వివ‌రాల‌కు  ద‌య‌చేసి సంప్ర‌దించండి :  డాక్ట‌ర్ ఇంద్ర‌జిత్ షా, ఎన్ఐటిటిటిఆర్‌, కోల్‌క‌‌తా
                            Email: indrajit@nitttrkol.ac.in, Mob: 9748740602]


    

 


ఎ)ప్ర‌త్యేక మ్యుటేష‌న్లు, ప్ర‌త్యామ్యాయాలు, చేర్పులు, తొల‌గింపులు, ఎస్‌.ఎన్‌.పి. (బి)  ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ్యుటేష‌న్ల ఫ్రీక్వెన్సీని తెలియ‌జేసే బ‌యో సిర్కోస్ ప్లాట్‌లు, ఇండియా మిన‌హా ప్ర‌పంచ‌దేశాల‌లో, అలాగే సార్స్ సిఒవి-2 జెనోమ్ వివిధ ట్రాక్‌ల‌లో
సి) ప్ర‌పంచ‌వ్యాప్తంగా , ఇండియాలో సార్స్ సిఒవి-2 పాపులేష‌న్ లో ఎస్ ఎన్ పి 10 శాతానికి మించి ఉంది
డి) వెబ్ అప్లికేష‌న్ స్క్రీన్‌షాట్‌లు ప్ర‌తిపాదిత ప‌రిశీల‌న‌కు ముందు ,ఆ త‌ర్వాత‌.

 

*****


(Release ID: 1653923) Visitor Counter : 257