సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                         ‘హిందీ దివస్-2020’ సందర్భంగా అధికారిక భాషలో చిత్రాలను ప్రదర్శించనున్న చలనచిత్ర విభాగం
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                13 SEP 2020 11:36AM by PIB Hyderabad
                
                
                
                
                
                
                1949 సెప్టెంబర్ 14న హిందీ భాషను అధికారిక భాషగా భారత్ స్వీకరించిన సందర్భంగా, ఆ చారిత్రాత్మక సందర్భానికి దారితీసిన పరిశోధన డాక్యుమెంటరీలను 'హిందీ దివస్' సందంర్భంగా చలనచిత్ర విభాగం ప్రదర్శించనుంది. హిందీని అధికారిక భాషగా స్వీకరించిన సందర్భాన్ని పునఃసృష్టిస్తూ చిన్నారుల ద్వారా నిర్వహించిన నమూనా రాజ్యాంగ సమావేశం; వివిధ రాష్ట్రాల్లో హిందీ అభివృద్ధి, ఆదరణపై చిత్రాలను ప్రదర్శించనుంది.  www.filmsdivision.org/Documentary, https://www.youtube.com/user/FilmsDivisionలో ఐదు హిందీ చిత్రాలను వారమంతా ఉచితంగా వీక్షించడానికి అందుబాటులో ఉంచుతుంది.

భారత రాజ్యాంగ అధికారిక భాషగా హిందీని స్వీకరించాలంటూ ప్రసిద్ధ హిందీ రచయిత బెహార్ రాజేంద్ర సింహా గొప్ప పోరాటం చేశారు. హజారీ ప్రసాద్ ద్వివేది, మైథిలి శరణ్ గుప్తా, కాకా కలేల్కర్ వంటివారితో కలిసి పోరాడారు. ఆ పోరాటం ఫలితంగా, 1949 సెప్టెంబర్ 14న, సింహా 50వ పుట్టినరోజు రోజున, హిందీని అధికారిక భాషల్లో ఒకటిగా భారత్ స్వీకరించింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజైన 1950 జనవరి 26 నుంచి ఇది కూడా అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగంలోని 343 ఆర్టికల్ ప్రకారం, దేవనాగరి లిపిలో ఉన్న హిందీని అధికారిక భాషగా స్వీకరించారు. ప్రస్తుతం, ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషగా హిందీ ఉంది. 520 మిలియన్లకు పైగా ప్రజల మొదటి భాష హిందీ.
రాజ్యాంగ సమావేశానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను, హిందీని అధికారిక భాషగా తీసుకునే నిర్ణయాన్ని పునఃసృష్టించే చిత్రాలను రేపటి నుంచి ప్రదర్శించనున్నారు. హిందీని జాతీయ భాషగా స్వీకరించే చారిత్రక కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ చిన్నారులు ప్రదర్శించే నమూనా రాజ్యాంగ సమావేశం (సంవిధాన్ కీ సాక్షి) (44 నిమి/కలర్/హిందీ/1992); హిందీ ప్రాముఖ్యతను తెలిపే వివిధ రాష్ట్రాల యాత్రానుభవం (భారత్ కీ వాణి) (52 నిమి/కలర్/హిందీ/1991); యావత్ భారతాన్ని ఒకటిగా నిలబెట్టిన భాష హిందీ అని వివరించే (హమారీ భాష) (4 నిమి/కలర్/హిందీ/2011); భారత్‌లో హిందీ అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితిని వివరించే (హిందీ కీ వికాస్ యాత్ర) (10 నిమి/కలర్/హిందీ/2000)ను ప్రదర్శించనున్నారు.
 
 
Follow us on social media:  @PIBMumbai
@PIBMumbai    /PIBMumbai
 /PIBMumbai    /pibmumbai
 /pibmumbai   pibmumbai[at]gmail[dot]com
pibmumbai[at]gmail[dot]com
 
******
 
                
                
                
                
                
                (Release ID: 1653800)
                Visitor Counter : 301