భారత ఎన్నికల సంఘం
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్ర వివరాల ప్రకటనకు మార్గదర్శకాలు విడుదల
Posted On:
11 SEP 2020 6:09PM by PIB Hyderabad
అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్రను ప్రకటించడం గురించి 10.10.2018 మరియు 6.03.2020 తేదీల్లో జరిగిన వాదనల క్రమంలో భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు సమావేశాన్ని నిర్వహించింది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే సమయంలో పార్టీలు మరియు అభ్యర్థుల తమ నేర చరిత్రను ప్రకటించే విషయంలో మార్గదర్శకాలను ఎన్నికల కమిషన్ నిర్ణయించనుంది. భారత ప్రజాస్వామ్యం మరియు ఎన్నికలు మరింత పారదర్శకంగా ఉండాలనే ఈ విషయంపై కమిషన్ తన ప్రయత్నం చేస్తున్నది.
నేర చరితల ప్రకటనకు సమరించిన మార్గదర్శకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఎ) నేర చరితల ప్రకటనకు సవరించిన మార్గదర్శకాలు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు, అభ్యర్థులను నియమించే విషయంలో అభ్యర్థులకు నేరచరిత ఉంటే ఆ వివరాలను వార్తా పత్రికల్లో ప్రచురించడం మరియు ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రసారం ఈ క్రింది విధంగా చేయాలి
i. మొదటి ప్రసారం: నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీకి ముందు నాలుగు రోజుల్లోగా.
ii.రెండవ ప్రసారం: నామినేషన్ ఉపసంహరణకు 5వ రోజు నుంచి 8వ రోజు లోపల.
iii.మూడవ ప్రసారం: ఎన్నికల ప్రచారం ఆఖరు రోజుకు 9వ రోజు వరకు i.e అనగా పోలింగుకు రెండు రోజుల ముందు వరకు)
ఈ కాలక్రమం ఓటర్లు అభ్యర్థులను ఎంచుకోవడంలో మరింత సమాచారాన్ని అందజేస్తుంది.
బి) పోటీ చేయకుండానే గెలిచే అభ్యర్థులు మరియు వారిని నియమించు రాజకీయ పార్టీలు ఆయా అభ్యర్థుల నేర చరిత్రను ప్రకటించే విషయంలో, రాజకీయ పార్టీలు ఆయా అభ్యర్థుల నేర చరిత్ర వివరాలు ఉన్నట్లైతే ఇతర పార్టీల వారికి తెలిసేందు కొరకు ప్రకటించ వలసిందేనని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు కమిషన్ ఈ విషయంలో తీసుకున్న అన్ని నిర్ణయాల సారాంశాలను సంబంధిత వ్యక్తుల లబ్ది కోసం ప్రచురించవలసిందేనని తెలిపింది. ఈ విషయానికి సంబంధించిన అభ్యర్థుల వివరాలను అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు స్వయంగా ప్రకటించ వలసి ఉంటుంది. ఈ సవరించిన ఈ నిబంధనలు వెంటనే అమల్లోనికి వస్తాయి.
***
(Release ID: 1653503)
Visitor Counter : 192