సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
స.హ.చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు
జమ్మూ కాశ్మీర్‌లో స.హ.చట్టం పూర్తి స్థాయిలో అమలవుతుంది
పూర్తిగా పనిచేస్తోంది: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
11 SEP 2020 5:50PM by PIB Hyderabad
జమ్మూ కాశ్మీర్‌లో సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పూర్తి స్థాయిలో అమలవుతుందని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి (డీఓఎన్ఈఆర్), ప్రధాన మంత్రి కార్యాలయం, ప్రజా మనోవేదనలు, పెన్షన్లు, సిబ్బంది, అణుశక్తి మరియు అంతరిక్షం శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సమాచార హక్కు చట్టం యొక్క పనితీరు గురించి ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఐసీగా పని చేస్తున్న సీనియర్ మోస్ట్ ఇన్‌ఫర్మెషన్ కమిషనర్ శ్రీ డి.పి.సిన్హాతో సమావేశం అనంతరం కేంద్ర మంత్రి సింగ్ మాట్లాడుతూ స.హ.చట్టం అమలు వంటి గొప్ప కార్యక్రమంను పౌరసమాజం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
తద్వారా కేంద్ర సమాచార కమిషన్ అవసరం లేని ఇతర ప్రశ్నలతో పని ఒత్తిడిని ఎదుర్కొనాల్సిన అవసరం లేకుండా పోతుందని అన్నారు. ఈ రోజుల్లో.. దాదాపు సమస్త సమాచారం పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉందని నొక్కి చెప్పారు. నివారించదగిన ఆర్టీఐలను అలరించకూడదని సమాచార అధికారులకు ఆయన సూచించారు. ఈ ఏడాది మే 15న కోవిడ్ మహమ్మారి మధ్యలో ఉన్న నేపథ్యంలోనూ కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ & కాశ్మీర్ ప్రాంత ఆర్టీఐలను వర్చువల్ విధానంలో స్వీకరించడం, విచారణ చేయడం, తీర్పులను వెలువరించడం చేశారని.. ఇది కమిషన్ మరియు దాని కార్యకర్తల ఘనత అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతదేశంలోని ఏ పౌరుడైనా జమ్మూ & లద్దాఖ్ విషయాలకు సంబంధించిన ఆర్టీఐని దాఖలు చేయవచ్చని మంత్రి తెలియజేశారు. 2019 పునర్వ్యవస్థీకరణ చట్టం ముందు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పౌరులకు మాత్రమే ఈ తరహా సౌకర్యం అందుబాటులో ఉండేదని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 తరువాత.. జమ్మూ కాశ్మీర్ సమాచార హక్కు చట్టం 2009 మరియు అక్కడున్న నిబంధనలు రద్దు చేయబడ్డాయి. అక్కడ సమాచార హక్కు చట్టం 2005లో ఉన్న నియమాలు 31.10.19 నుండి అమలులోకి తేవడం జరిగింది. ఈ చర్యను జమ్మూ కాశ్మీర్ ప్రజలు మరియు యుటీ పాలనయంత్రాంగం విస్తృతంగా ప్రశంసించారన్నారు. 2014 లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, పారదర్శకత మరియు పౌర-కేంద్రీకృత పరిపాలన విధానం హాల్‌మార్క్‌గా మారిందని మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సమాచార కమిషన్ల స్వాతంత్ర్యం మరియు వనరులను బలోపేతం చేయడానికి గాను గత ఆరేళ్లలో ప్రతిచేతన నిర్ణయం తీసుకున్నామని ఆయా ఖాళీలను వీలైనంత వేగంగా భర్తీచేస్తామని అన్నారు. లాక్‌డౌన్ మరియు పాక్షిక లాక్‌డౌన్ సమయంలో సీఐసీ విచారణను సులభతరం చేయడానికి తీసుకున్న వివిధ చర్యలలో వీడియో కాన్ఫరెన్సింగ్, ఆడియో కాన్ఫరెన్సింగ్, రిటర్న్ దాఖలు సులభతరం, డిప్యూటీ రిజిస్ట్రార్ల సంప్రదింపు వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం, ఈ-పోస్ట్ ద్వారా నోటీసులు జారీ చేయడం వంటి వాటిని గురించి శ్రీ సిన్హా ప్రధానంగా వివరించారు. అవసరమైన చోట, ఆన్‌లైన్ నమోదు మరియు తాజా కేసుల పరిశీలన మొదలైన వాటిని గురించి తెలిపారు. కమిషన్ పౌర సమాజ ప్రతినిధులతో మరియు భారత నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌తో సహా ఇంటరాక్టివ్ మరియు అవుట్‌రీచ్ కార్యకలాపాల్ని సమర్థవంతంగా కొనసాగించిందని ఆయన మంత్రికి తెలియజేశారు.
<><><><><>
(Release ID: 1653500)
Visitor Counter : 143