సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

జి.డి.పి.లో ఎం.ఎస్.ఎం.ఇ. ల వాటాను 30శాతంనుంచి 50శాతానికి పెంచడమే లక్ష్యం

ఎగుమతుల వాటాను 49శాతంనుంచి 60శాతానికి పెంచుతామన్న గడ్కరీ

ఐదేళ్లలో ఎం.ఎస్.ఎం.ఇ. రంగంలో మరో 5కోట్ల

ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటన

మధ్యతరహా, చిన్నతరహా సంస్థల్లో పరిశోధన, సృజనాత్మకత లక్ష్యంగా ఎ.ఎన్.ఐ.సి.-ఎ.ఆర్.ఐ.ఎస్.ఇ. చాలెంజీల ఆవిష్కారం.

Posted On: 09 SEP 2020 5:19PM by PIB Hyderabad

స్థూల స్వదేశీ ఉత్పత్తి (జి.డి.పి.)లో సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థల (ఎం.ఎస్.ఎం..) వాటాను 30శాతంనుంచి 50శాతానికి పెంచడమే తమ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, ఎం.ఎస్.ఎం.. శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. జి.డి.పి.లో ఎగుమతుల వాటాను 49శాతంనుంచి 60శాతానికి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఆత్మ నిర్భర భారత్, మధ్యతరహా, చిన్న సంస్థల్లో పరిశోధన, సృజనాత్మకత లక్ష్యంగా అటల్ న్యూ ఇండియా చాలెంజెస్ అన్న అంశంపై నీతీ ఆయోగ్  నిర్వహించిన వర్చువల్ సమావేశంలో గడ్కరీ ప్రసంగించారు. ప్రస్తుతం 11కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల రంగంలో అదనంగా 5కోట్ల ఉద్యోగాలను ఐదేళ్లలో కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని గడ్కరీ ప్రకటించారు.

  ఆత్మనిర్భర భారత్, .ఆర్..ఎస్.., అటల్ న్యూ ఇండియా చాలెంజ్ పేరిట నీతీ ఆయోగ్ చూపించిన చొరవను నితిన్ గడ్కరీ ప్రశంసించారు. వివిధ రంగాల్లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం కనుగొని ఆయా అంశాలకు విలువలను జోడించేందుకు వీలుగా దేశంలో కొత్త సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. అదనంగా పేరుకుపోయిన  బియ్యం నిల్వల సమస్యను పరిష్కరించేందుకు,.. బియ్యాన్ని మిథనాల్ ఉత్పత్తిలో వినియోగించవచ్చని, తద్వారా బియ్యం నిల్వలో ఎదురయ్యే సమస్యను పరిష్కరించుకోవడమేకాక, మరో వైపు, దేశానికి స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించేందుకు వీలుంటుందని అన్నారు. సృజనాత్మకత, కొత్త పరిష్కారాన్ని కనుగొనడం వంటి అంశాల్లో చొరవ తీసుకోవడాన్ని మరింతగా ప్రోత్సహించాలని, మంచి ప్రయత్నంలో ఏవైనా కొన్ని పొరపాట్లు జరిగినా, అందుకు బాధ్యులైన వారికి తగిన రక్షణ కల్పించాలని గడ్కరీ అభిప్రాయపడ్డారు

  దేశంలోని 115 ఆశావహ జిల్లాలతోపాటుగా వెనుకబడిన ప్రాంతాలను, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి పరిధిలోకి తీసుకువచ్చినపుడే, దేశ ప్రగతి మరింత వేగవంతమవుతుందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఎంతో వెనుకబడి ఉన్న ప్రాంతాల అభివృద్ధి, అభ్యున్నతి అత్యంత ఆవశ్యకమని ప్రధానమంత్రి ఇదివరకే స్పష్టం చేశారన్నారు. ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా పనిచేయవలసిన అవసరం ఉందని, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజలతోపాటుగా, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారంకోసం విజ్ఞాన శాస్త్రాన్ని వినియోగించుకోవాలన్నది ప్రధాని ఆకాంక్ష అని గడ్కరీ తెలిపారు.

   సృజనాత్మక ఆవిష్కరణలకు సువిశాల దృక్పథంతో మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉందని, అపుడు సిసలైన ప్రతిభావంతులకే ఎదిగే అవకాశం లభిస్తుందని లభిస్తుందని, ఉత్పత్తి వ్యయం కూడా తగ్గడానికి వీలుంటుందని గడ్కరీ అన్నారువ్యవసాయానికి, ఎస్.టి. ఎస్.సి.లకు, సంబంధించిన పథకాల అమలుతీరుపై నిశితమైన తనిఖీ చేయడం ద్వారా పథకాల లక్ష్యాలను మరింత మెరుగ్గా సాధించవచ్చన్నారు.

  ఆత్మనిర్భర భారత్, మధ్యతరహా, చిన్న తరహా సంస్థల్లో పరిశోధన లక్ష్యంగా అటల్ న్యూ ఇండియా చాలెంజెస్ కార్యక్రమం క్రియాశీలకంగా జరుగుతోందని, ఇతర మంత్రిత్వ శాఖలు, సంబంధిత పరశ్రమల సమన్వయంతో కార్యక్రమం సాగుతోందని గడ్కరీ అన్నారు. పరిశోధన, సృజనాత్మకతలకు, వివిధ రంగాల్లో ఎదురయ్యే సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు కనుగొనేందుకు కార్యక్రమం ఎంతో ప్రేరణ కలిగిస్తుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు.

 

******



(Release ID: 1652864) Visitor Counter : 198