పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
అవరోధాలు ఉన్నప్పటికీ, పచ్చని భూమి, స్వచ్ఛమైన గాలి, శుభ్రమైన పర్యావరణ శోభిత నీలాకాశం, పారిశ్రామిక కార్యకలాపాలతో పాటు సాధ్యమవుతాయి: శ్రీ ప్రకాష్ జవదేకర్
వచ్చే పదేళ్లలో కర్బన ఉద్గారాలను 35 శాతం తగ్గించే లక్ష్యాన్ని భారత్ సాధిస్తుందనే విశ్వాసాన్ని శ్రీ జవదేకర్ వ్యక్తం చేశారు.
సుస్థిరత మాత్రమే ప్రకృతి ప్రకోపం నుండి మానవాళిని కాపాడుతుందని కేంద్ర పర్యావరణ మంత్రి స్పష్టీకరణ
ఆత్మనిర్భర్ వీటి నుండి వేరు కావడం లేదు, కానీ ఇది ప్రపంచంతో మరింత మమేకం అవుతోంది
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2020 4:44PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం కర్బన ఉద్గారాలను తగ్గించడానికి చిత్తశుద్ధితో ఉందని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. న్యూ ఢిల్లీలో నిర్వహించిన 15వ సుస్థిర సదస్సు లోని స్వయం సమృద్ధి, సుస్థిర భారత్ కార్యాచరణ ఎజెండా పై జరిగిన ప్రత్యేక సెషన్ లో శ్రీ జవదేకర్ ప్రసంగించారు. వచ్చే దశాబ్ద కాలంలో భారత్ కర్బన ఉద్గారాలను 35 శాతం వరకు తగ్గించాలనే లక్ష్యాన్ని సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశంలో సౌరశక్తి సామర్థ్యం వేగవంతంగా పెరిగిందని, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఒప్పందాన్ని 68 దేశాలు తమ అంగీకారం తెలిపాయని అయన చెప్పారు.
భారతదేశాన్ని స్వావలంబన కోసం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ ప్రభుత్వ కార్యక్రమం గురించి మాట్లాడిన మంత్రి, ఆత్మనిర్భర్త ప్రపంచం నుండి దూరం కావడం లేదు, ఇది ప్రపంచంతో మరింత మమేకం అవుతుంది అని తెలిపారు. ఆవిష్కరణ, పరిశోధన కీలకం అయ్యాయని అంటూ, "ఆవిష్కరణ, పరిశోధనలపై దృష్టి మరింత పెరిగింది, దిగుమతులను తగ్గించడానికి, ఎగుమతులను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని చెప్పారు. రాబోయే దశాబ్దంలో అభివృద్ధి పరంగా దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి పరిశోధన, ఆవిష్కరణలు కీలకం కాబట్టి భారతదేశం ఆవిష్కరణలలో అగ్రగామిగా ఉండాలని, ఆవిష్కరణలను సొంతం చేసుకోవడం ప్రారంభించాలని ఆయన అన్నారు.

పారిశ్రామిక కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ పరిశుభ్రమైన గాలి, నీలి ఆకాశాలతో పచ్చటి భూమిని సాధించాలని, అది సాధ్యమవుతుందని పర్యావరణ మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ భూభాగంలో భారతదేశం 2.5% ఉంటుందని, మంచినీటి వనరులు 4%, ప్రపంచ జనాభాలో భారత జనాభా 20% మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు. అయితే ఇప్పటికీ ప్రపంచ జీవవైవిధ్యంలో భారత్ వాటా 8% ఉంది, ఎందుకంటే భారతీయ సంస్కృతిలో, వృక్షజాలం, జంతుజాలం మానవ జీవితంలో ఒక భాగం అని మంత్రి స్పష్టం చేశారు. మానవజాతిని ప్రకృతి ప్రకోపాల నుండి కాపాడాలంటే, సుస్థిరతకు మాత్రమే సాధ్యమని అన్నారు. సుస్థిరతను ప్రోత్సహించే విషయంలో తమ నిదర్శనాధ్యాయనాలను ప్రదర్శించాలని ఆయన వివిధ దేశాలకు విజ్ఞప్తి చేశారు. గత కొన్నేళ్లుగా పచ్చదనం సాధించిన దిశగా దేశం సాధించిన విజయాన్ని మంత్రి ప్రస్తావిస్తూ , “భారతదేశం వాతావరణ మార్పులపై చర్చలు జరుపుతోంది. ఉజ్జ్వాలా, ఈ-వాహనాలు, బిఎస్- VI ఇంజన్లు, జీవ ఇంధనాలు, స్వచ్ఛమైన గాలి, విపత్తు ను తట్టుకుని నిలపడగలిగే సత్తా సుస్థిర, సంకల్ప సిద్ధిగల భారతదేశానికి మార్గం సుగమం చేస్తుంది. 35% ఉద్గార తగ్గింపును లక్ష్యంగా చేసుకుని, భారత్ 21% కి చేరుకున్నది. 10 సంవత్సరాలలో, అవసరమైన 220 గిగావాట్ పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను సాధిస్తాము, వీటిలో మొత్తం 87 గిగావాట్ సౌర, పవనాలతో వనరులతో సాధించాము” అని ఆయన చెప్పారు. వ్యవస్థాపక సామర్థ్యంలో మన ఇంధన వనరులు కలపగా ఇప్పుడు 37% పునరుత్పాదక ఇంధన వనరులను కలిగి ఉన్నామని ఆయన వివరించారు.

సిఐఐ-ఐటిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఐటిసి లిమిటెడ్ చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్, సలహా మండలి చైర్మన్ సంజీవ్ పూరి మాట్లాడుతూ వ్యాపారంలో సుస్థిర వ్యూహాలు సమ్మిళితమై ఉన్నాయని అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ డైరెక్టర్ జనరల్ శ్రీ చంద్రజిత్ బెనర్జీ, స్వావలంబన మరియు స్థిరమైన భారత దిశగా అడుగులు వేయాలని అన్నారు.
సస్టైనబిలిటీ సమ్మిట్ అనేది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆఫ్ సస్టైనబిలిటీకి చెందిన వార్షిక ప్రధాన కార్యక్రమం, ఇది స్థిరమైన వ్యాపార సంభాషణ, అభ్యాసం, పనితీరును పెంచడానికి 2006 లో ప్రారంభం అయింది. '15 వ సస్టైనబిలిటీ సమ్మిట్ - వచ్చే దశాబ్దంలో కార్యాచరణ ఎజెండా' రాబోయే దశాబ్దం రూపకల్పనపై దృష్టి పెట్టడానికి రూపొందించారు.
***
(రిలీజ్ ఐడి: 1652857)
సందర్శకుల సూచీ సంఖ్య : : 216