ప్రధాన మంత్రి కార్యాలయం
మత్స్య సంపద యోజనను సెప్టెంబర్ 10 న ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ఈ -గోపాల యాప్ ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి , రైతులకు నేరుగా ఉపయోపడే సమాచారాన్ని అందించే, సమగ్ర బ్రీడ్ మెరుగుదల, మార్కెట్ ప్లేస్ పోర్టల్‌గా ఇది ఉపయోగపడుతుంది
బీహార్‌లో మత్య్యరంగం, పశుగణాభివృద్ధికి సంబంధించి పలు కార్యకలాపాలను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
Posted On:
09 SEP 2020 1:41PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ను డిజిటల్ విధానంలో సెప్టెంబర్ 10 న ప్రారంభించనున్నారు. అలాగే , రైతులకు నేరుగా ఉపయోగపడే సమాచారాన్ని అందించిచే, బ్రీడ్ మెరుగుదల మార్కెట్ ప్లేస్ పోర్టల్ ఈ -గోపాల యాప్‌ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. బీహార్‌లో మత్స్య, పశుగణాభివృద్ధి రంగానికి సంబంధించి పలు కార్యకలాపాలను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు.
బీహార్ గవర్నర్, బీహార్ ముఖ్యమంత్రి తోపాటు మత్స్యశాఖ , పశుగణాభివృద్ధి , పాడి పరిశ్రమ శాఖ కేంద్ర మంత్రి, సహాయ మంత్రి కూడా పాల్గొననున్నారు.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన:
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎం ఎస్ వై) దేశంలో మత్స్య రంగ సుస్థిరా భివృద్ధికి నిర్దేశించిన ఫ్లాగ్‌షిప్‌కార్యక్రమం.
ఆత్మనిర్భర్ ప్యాకేజ్‌కింద 2020-21 నుంచి 2024-25 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఐదు సంవత్సరాల కాలానికి 20,050 కోట్ల రూపాయల పెట్టుబడి అంచనాతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
మత్స్యరంగంలో 20,050 కోట్ల రూపాయలను పిఎంఎంఎస్ వై కింద పెట్టుబడి పెటట్టడం ఇప్పటివరకు ఇదే ప్రధమం. ఇందులో సుమారు 12,340 కోట్ల రూపాయలు మెరైన్, ఇన్‌ల్యాండ్ ఫిషరీస్, ఆక్వా కల్చర్, కార్యకలాపాలకు సంబంధించి లబ్ధిదారుల నిర్దేశిత కార్యకలాపాలకు ఉద్దేశించారు. అలాగే 7,710 కోట్ల రూపాయల పెట్టుబడి మత్స్యరంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించినది.
2024-25 సంవత్సరానికి మత్స్య సంపదను మరో 70 లక్షల టన్నులకు పెంచేందుకు పిఎంఎంఎస్ వైని నిర్దేశించారు. అలాగే మత్స్య ఎగుమతుల నుంచి రాబడిని 2024-25 సంవత్సరానికి రూ 1,00,000 కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. మత్స్యకారులు , మత్స్యరైతుల రాబడిని రెట్టింపుచేయడం, పంట అనంతర నష్టాలను 20-25 శాతం నుంచి 10శాతానికి తగ్గించడం, మత్స్య, అనుబంధ రంగాలలో సుమారు 55 లక్షల అదనపు ప్రత్యక్ష, పరోక్ష లాభదాయక ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ పథకం లక్ష్యం.
మత్స్య ఉత్పత్తి, ఉత్పాదకత , నాణ్యత, సాంకేతికత, పంట అనంతర మౌలిక సదుపాయాలు, యాజమాన్యం, ఆధునీకరణ, వాల్యూచెయిన్‌ను బలోపేతం చేయడం, నాణ్యతా గుర్తింపు, అద్భుతమైన మత్స్య యాజమాన్య ఫ్రేమ్‌వర్కు, మత్స్య సంక్షేమం వంటి కీలక అంశాలలో ఏవైనా గ్యాప్‌లు ఉంటే వాటిని సరిదిద్దేందుకు పిఎంఎంఎస్‌వైని నిర్దేశించారు. నీలి విప్లవ పథకం సాధించిన ఫలితాలను పటిష్టం చేసే లక్ష్యంతో పిఎంఎంఎస్‌వై పలు కొత్త చర్యలను చేపడుతోంది. అందులోభాగంగా చేపలుపట్టే పడవల కు బీమాసదుపాయం, ,చేపలు పట్టే పడవలను అప్ గ్రేడ్ చేసేందుకు , కొత్త వాటికి మద్దతు, బయోటాయిలెట్లు, ఉప్పునీటి ప్రాంతంలో, ఆల్కలైన్ ప్రాంతాలలో ఆక్వా కల్చర్, సాగర మిత్రలు, ఎఫ్.ఎఫ్.పి.ఒలు సిఎస్‌లు, న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్లు, ఫిషరీస్,ఆక్వాకల్చర్ స్టార్టప్‌లు, ఇంక్యుబేటర్లు, సమీకృత ఆక్వా పార్కులు, కోస్తా ప్రాంతంలో సమీకృత చేపలుపట్టే గ్రామాల అభివృద్ధి, ఆక్వాటిక్ లేబరెటరీల నెట్ వర్క్, విస్తరణ సేవలు, ట్రేసబిలిటి, సర్టిఫికేషన్,గుర్తింపు, ఆర్.ఎ.ఎస్, బయో ఫ్లాక్, కేజ్ కల్చర్, ఈ- ట్రేడింగ్ మార్కెటింగ్, మత్స్య యాజమాన్య ప్లాంటులు తదితర చర్యలను చేపట్టనున్నారు.
పిఎంఎంఎస్ వై పథకం ప్రధానంగా క్లస్టర్ లేదా ఏరియా ఆధారిత విధానంపై దృష్టిపెడుతుంది. అలాగే ఫిషరీస్ క్లస్టర్లను బ్యాక్ వర్డ్, ఫార్వర్డ్ లింకేజ్ ల ద్వారా ఏర్పాటు చేస్తుంది. ఉపాధి కల్పన కార్యకలాపాలపై అంటే సీవుడ్, ఆర్నమెంటల్ చేపల సాగు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. నాణ్యమైన బ్రూడ్, సీడ్, ఫీడ్ కు సంబంధించి చర్యలు తీసుకుంటారు. వైవిధ్యతపై న, కీలక మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ నెట్‌వర్కుపై త్యేక దృష్టి పెట్టడతారు.
ప్రస్తుతానికి పిఎంఎంఎస్ కింద , డిపార్టమెంట్ ఆఫ్ ఫిషరీస్ రూ 1763 కోట్ల రూపాయల విలువగల ప్రతిపాదనలను 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధఙంచి తొలి దశ కింద ఆమోదించారు. పిఎంఎంఎస్‌వై కింద ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలకు ప్రాధాన్యతనివ్వడం జరిగింది
బీహార్ లో పిఎంఎంఎస్ వై ని1390 కోట్ల రూపాయల పెట్టుబడితో చేపడుతున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 535 కోట్ల రూపాయలు. అదనపు చేపల ఉత్పత్తి లక్ష్యం 3 లక్షల టన్నులకు పెంచడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21లో భారత ప్రభుత్వం 107.00 కోట్లరూపాయల మేరకు బీహార్ ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటిలో రీ సర్కులేటరీ ఆక్వా కల్చర్ సిస్టమ్ (ఆర్ ఎ ఎస్) ఏర్పాటు, ఆక్వా కల్చర్ కు బయొఫ్లాక్ పాండ్‌ల ఏర్పాటు, ఆక్వాకల్చర్‌కు కొత్త పాండ్‌ల నిర్మాణొం, ఆర్నమెంటల్‌ఫిష్ కల్చర్ యూనిట్ల ఏర్పాటు, రిజర్వాయర్లలో,వెట్‌ల్యాండ్‌లలో కేజ్‌ల ఏర్పాటు, ఐస్‌ప్లాంట్‌ల నిర్మాణం, రిఫ్రిజిరేటర్ వాహనాలు, ఐస్ బాక్సులతో మోటారు సైకిళ్లు, ఐస్ బాక్సుతో త్రిచక్ర వాహనాలు, చేపల దాణా ప్లాంట్‌లు, విస్తరణ, మద్దతు సేవలు ( మత్స్య సేవా కేంద్ర) బ్రూడ్‌బ్యాంక్ ఏ ర్పాటు వంటివి ఉన్నాయి.
మత్స్య రంగానికి సంబంధించి ప్రధానమంత్రి ప్రారంభించే ఇతర కార్యకలాపాలు:
సీతామర్హిలో ఫిష్ బ్రూడ్‌బ్యాంక్లా, అలాగే కిషన్‌గంజ్‌లో ఆక్వాటిక్ వ్యాధుల రెఫరల్ లేబరెటరీ ఏర్పాటును ప్రధానమంత్రి ప్రకటించనున్నారు. ఇందుకు పిఎంఎంఎస్‌వై కింద సహాయాన్ని అందించనున్నారు. ఈ సదుపాయాలు చేపల ఉత్పత్తి , ఉత్పాదకత పెంచడానికి, నాణ్యమైన, అందుబాటు ధరలో చేప సీడ్, మత్స్యరైతులకు సకాలంలో అందుబాటులోకితేవడానికి, చేపలకు వచ్చే రకరకాల వ్యాధులను గుర్తించడానికి , నీరు, భూమికి సంబంధించిన పరీక్షలునిర్వహించడానికి ఈ సదుపాయాలు ఉపయోగపడతాయి.
మధేపురాలో ఒక ఫిష్ ఫీడ్‌మిల్ యూనిట్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అలాగే పాట్నాలో నీలివిప్లవం కింద ఫిష్ ఆన్ వీల్స్ కార్యక్రమానికి చెందిన రెండు యూనిట్లను ఆయన ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి లబ్ధిదారులతోముచ్చటిస్తారు.
సమగ్ర చేప ఉత్పత్తుల సాంకేతిక కేంద్రాన్ని బీహార్‌లోని పూసాలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తారు.ఈ కేంద్రంలో చేప సీడ్ ఉత్పత్తి కి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం , చేపలకు సంబంధించి డెమానిస్ట్రేషన్ యూనిట్ టెక్నాలజీ, రెఫరల్ లేబరెటరీ, డయాగ్నస్టిక్ టెస్టింగ్ ఉంటాయి. ఇది చేపల ఉత్పత్తి పెంచడానికి , మత్స్య రైతుల సామర్ధ్యాన్ని పెంపొందించడానికి ఉపకరిస్తుంది.
ఈ-గోపాల యాప్
ఈ -గోపాల యాప్ , సమగ్ర బ్రీడ్ మెరుగుదల మార్కెట్ ప్లేస్, సమాచార పోర్టల్. ఇది నేరుగా రైతులకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం పాడిపశువుల నిర్వహణకు సంబంధించి దేశంలో ఎలాంటి డిజిటల్ ప్లాట్‌ఫాం లేదు. అన్ని విధాలుగా వ్యాధులు లేని జెర్మ్‌ప్లాజమ్ (సెమెన్, ఎంబ్రియో తదితరాలు) అమ్మకం, కొనుగోలు, నాణ్యమైన బ్రీడింగ్ సేవలు (కృత్రిమ గర్భధారణ, పశువైద్య ప్రాథమిక చికిత్స, వాక్సినేషన్, చికిత్సతదితరాలు), పశువులకు పౌష్ఠికాహారానికి సంబంధించి రైతులకు సూచనలు, తగిన ఆయుర్వేద మందులు వాడడం ద్వారా పశువులకు వచ్చే వ్యాధులకు చికిత్స అందించడం, ఎథనో వెటనరీ మందులు వంటి వాటి గురించి ఇది తెలియజేస్తుంది. వివిధ ప్రభుత్వ పథకాల గురించి రైతులకు సమాచారం అందించడం, ఇందుకు సంబంధించి ప్రచారం నిర్వహించడం, వాక్సినేషన్ తేదీలు, పశువుల గర్భధారణ చికిత్సలు, తదితరాల గురించి , ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి, ఆ ప్రాంతంలో జరుగుతున్న ప్రచారం గురించి ఎప్పటికప్పడు అలర్ట్‌లు పంపడానికి దీనివల్ల వీలు కలుగుతుంది. ఈ -గోపాల యాప్ రైతులు పైన పేర్కొన్న వివిధ అంశాలలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలను సూచిస్తుంది.
పశుగణాభివృద్ధి రంగానికి సంబంధించి ఇతర ప్రారంభోత్సవాలు:
రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద బీహార్‌లోని పూర్ణియాలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన సెమన్ స్టేషన్‌ను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. 75 ఎకరాల విస్తీర్ణంలో 84.72 కోట్ల రూపాయల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేవారు. ఇందుకు అవసరమైన భూమిని బీహార్ రాష్ట్రప్రభుత్వం సమకూర్చింది. ప్రభుత్వ రంగంలోని భారీ సెమన్ స్టేషన్లలో ఇది ఒకటి. ఏటా 50 లక్షల సెమన్‌డోస్‌ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఇది కలిగి ఉంది. ఈ సెమన్ కేంద్రం బీహార్‌కు చెందిన దేశవాళీ జాతుల పరిరక్షణకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. అలాగే తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు అవసరమైన సెమన్ డోస్‌ల డిమాండ్ ను తీర్చడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంద
రాష్ట్రీయ గోకుల్ మిషన్‌కింద పాట్నాలోని వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం లో ఏర్పాటుచేసిన ఐవిఎఫ్ ల్యాబ్‌ను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. మొత్తం 30 ఇటిటి, ఐవిఎప్ లేబరెటరీలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. వీటిని నూరుశాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ తో ఏర్పాటు చేస్తారు. ఈ ల్యాబ్‌లు దేశీ్య బ్రీడ్‌లకు చెందిన మేలుజాతి రకాలను ప్రచారం చేయడానికి ,తద్వారా పాల ఉత్పత్తిని , ఉత్పాదకతను ఎన్నో రెట్లు పెంచడానికి ఉపయోగపడతాయి.
బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా బరౌని మిల్క్ యూనియన్ చేత రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ఏర్పాటు చేసిన కృత్రి మగర్భధారణ వీర్య వృద్ధి కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఇక్కడ ఆడ, మగ దూడలను పుట్టించడానికైనా సెమన్ ఉంటుంది. ఈ సెక్సు నిర్ధారిత వీర్యం ఉపయోగించి, కృత్రిమ మేథ ద్వారా 90 శాతం ఖచ్చితత్వంతో కేవలం ఆడ దూడలను మాత్రమే పుట్టించడానికి వీలుకలుగుతుంది. ఇది దేశంలో పాలదిగుబడిని రెట్టింపు చేయడానికి ఉపకరిస్తుంది. ఐవిఎఫ్ టెక్నాలజీని రైతుల ముంగిట ప్రదర్శించే కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు.ఇది అధికదిగుబడినిచ్చే జంతువులను గణనీయంగా పెంచేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇది ప్రచారం చేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అవి సంవత్సరంలో 20 దూడలకు జన్మనివ్వగలవు.
***
(Release ID: 1652788)
Visitor Counter : 641
Read this release in:
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada