పర్యటక మంత్రిత్వ శాఖ
"ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రమోషన్ - పోస్ట్ కోవిడ్-19" అనే అంశంపై మేథోమథన సదస్సు నిర్వహించిన కేంద్ర పర్యాటక మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్
- కోవిడ్-19 శకం తరువాత భారత్ మళ్లీ ప్రియమైన పర్యాటక కేంద్రంగా అవతరిస్తుందన్న
శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్
Posted On:
08 SEP 2020 5:45PM by PIB Hyderabad
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ రోజు న్యూఢిల్లీలో మేథోమథన సదస్సు నిర్వహించారు. "ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రమోషన్ - పోస్ట్ కోవిడ్-19" అనే అంశంపైన ఈ సదస్సు జరిగింది. ఇందులో 30 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు, ట్రావెల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో పర్యటక విభాగం డీజీ శ్రీమతి మీనాక్షి శర్మ, ఐటీడీసీ చైర్మెన్ అండ్ మెనేజింగ్ డైరెక్టర్ జి.కమలవర్ధన్ రావు, టూరిజం ఏడీజీ శ్రీమతి రూపిందర్ బ్రార్, టూరిజం సంయుక్త కార్యదర్శి శ్రీ రాకేశ్ కుమార్ వర్మతో పాటుగా పర్యటక శాఖ ఇతర అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి సమయంలో
భాగస్వామ్య పక్షాలవారితో ఇది మొదటి భౌతిక సమావేశం. ఇది ప్రభుత్వం జారీ చేసిన ఎస్ఓపీ
సూచించిన అన్ని జాగ్రత్తలు, సామాజిక దూరం నిబంధనల మేరకు ఈ మేథోమథన సదస్సు నిర్వహించబడింది.
పర్యాటక అవకాశాల గురించి ఆలోచించండి..
పర్యాటక మంత్రి ఈ సదస్సును ప్రారంభించారు. భారతదేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వారి విలువైన సూచనలివ్వమని మంత్రి అభ్యర్థించారు. మనమందరం భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని, దేశంలో కోవిడ్ -19 తరువాత పర్యాటక అవకాశాల గురించి ఆలోచించడం మన బాధ్యత అని ఆయన అన్నారు. పర్యాటక సంబంధిత కార్యకలాపాలకు సంబంధించి వివిధ సమస్యలతో పాటు పరిష్కారాల గురించి చర్చించే వేదిక ఇది అని ఆయన అన్నారు. పరిస్థితి సాధారణమైన తర్వాత భారతదేశం పర్యాటక రంగంలో వేగాన్ని పెంచుతుందని మంత్రి శ్రీ పటేల్ అన్నారు. పర్యాటకులు వారి ప్రయాణ అనుభవాలను మెరుగుపర్చడానికి మెరుగైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందించగల పోస్ట్ కోవిడ్-19 ప్రపంచానికి మనమందరం సిద్ధంగా ఉండాలి అని పర్యటక మంత్రి కోరారు.
పర్యాటక అవకాశాల గురించి ఆలోచిద్దాం..
ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారని మరియు అన్ని జాగ్రత్తలతో భారత పర్యటక సౌందర్యాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు; ఈ మహమ్మారి వ్యాప్తి సమయంలో వారు మమ్మల్ని విశ్వసించేలా తగిన వాతావరణాన్ని మనం సృష్టించాలని అన్నారు. ఈ సదస్సులో వేర్వేరు ప్రభావశీలులు, ట్రావెల్ మీడియా ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకున్నారు. పర్యాటక రంగం సురక్షితమైన, స్నేహపూర్వక, ప్రాప్యత, బాధ్యతాయుతమైన మరియు పర్యాటకులందరికీ ముఖ్యంగా మహిళలకు మేటి సరసమైనదిగా మార్చడానికిగాను విలువైన సలహాలను అందించారు. దేశీయ పర్యాటకంతో పాటు భారతదేశంలో తక్కువ జనాదరణ ఉంటోన్న సైట్లపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. అంతగా అవగాహన లేని
ఈ గొప్ప పర్యాటక ప్రదేశాలలో సమాచారం, సౌకర్యాలు కల్పించడం ద్వారా ఆయా ప్రాంతాలలో పర్యటకాన్ని ప్రోత్సహించాలని వారు అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఒక పార్టిసిపెంట్ ఈ మాట్లాడుతూ భద్రతా చర్యల క్యాంపింగ్‌తో మరిన్ని సైట్‌లను తెరవాలని సూచించారు, తద్వారా భారతదేశంలో అడ్వెంచర్ టూరిజంను ప్రోత్సహించగలము అని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో పాల్గొన్నవారి నుంచి అనుభవపూర్వక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి సంబంధించిన పలు సూచనలు వచ్చాయి; వివిధ గమ్యస్థానాలను అన్వేషించడానికి ఇతర పర్యాటకులను కూడా ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. ప్రజల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రజల మధ్య సమాచార భాగస్వామ్య వ్యవస్థ చాలా బలంగా ఉండాలని అభిప్రాయం ఈ సదస్సులో
చర్చల సందర్భంగా వెలుగులోకి వచ్చింది.
భారత్ తిరిగి ఇష్టమైన పర్యాటక కేంద్రంగా అవతరిస్తుంది..
సెషన్ ముగింపులో పర్యాటక మంత్రి ఈ సదస్సులో చురుకుగా పాల్గొన్న వారందరికీ తన ధన్యవాదాలు తెలిపారు. ఈ విధాన రూపకల్పనలో అన్ని భాగస్వామ్య పక్షాల వారు పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము. మీ అభిప్రాయాన్ని మాకు అందించమని మీ అందరినీ ఆహ్వానించామని అన్నారు. భాగస్వామ్య పక్షాల వారి సూచనలను మేము గుర్తించామని, ఇవి మా భవిష్యత్ విధాన ప్రణాళికలో పొందుపరచబడతాయని ఆయన అన్నారు. కోవిడ్-19 శకం తరువాత భారత్ తిరిగి ఇష్టమైన పర్యాటక కేంద్రంగా అవతరిస్తుందని శ్రీ పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి వరకు మన దేశీయ పర్యాటక రంగంపై మనం తగిన దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు విదేశీ గమ్యస్థానాలను సందర్శించాల్సిన భారతీయులు దేశీయ గమ్యస్థానాలను మాత్రమే సందర్శిస్తారు అని మంత్రి తెలిపారు. ఇది మన పర్యాటక పరిశ్రమకు తగిన బలాన్ని ఇస్తుందని అన్నారు.
*****
(Release ID: 1652479)
Visitor Counter : 135