సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్ తరువాత దేశంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంలో భారత వర్తకుల సంఘం (ఐ ఎం సి) పాత్ర కీలకమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవచించిన ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం నెరవేరడానికి అది కూడా ముఖ్యమైంది: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 07 SEP 2020 6:49PM by PIB Hyderabad

కోవిడ్ తరువాత దేశంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంలో భారత వర్తకుల సంఘం (ఐ ఎం సి)  పాత్ర కీలకమని మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవచించిన ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం నెరవేర్చుకోవడంలో అది కూడా ముఖ్యమైందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోమవారం ఇక్కడ చెప్పారు.  

భారత వర్తకుల సంఘం (ఐ ఎం సి)  114వ సంస్థాపన దినోత్సవం సందర్భంగా ఆన్ లైన్ లో ముఖ్యఅతిధిగా ప్రసంగిస్తూ తనకు భారత వర్తకుల సంఘంతో దీర్ఘకాల సంబంధం ఉందని,   ముంబాయి చర్చిగేట్ ప్రాంతంలో ఉన్న సంఘం ప్రధాన కార్యాలయానికి తరచుగా వెళ్లే వాడినని తెలిపారు.   దేశంలోనే అతి పురాతన వర్తక సంఘం కావడం వల్ల దానిలో మహాత్మా గాంధీ కూడా సభ్యుడుగా ఉండే వాడని, ఐఎంసికి ఘనమైన చరిత,  గొప్ప వారసత్వం ఉందని అంతేకాక భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, ఆకాంక్షలు  ఉన్నాయని  అన్నారు.  

ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పం నెరవేరాలంటే స్వావలంబన సాధించడం కీలకమని మరియు ఐ ఎం సి వంటి ప్రముఖ వర్తక సంస్థలు ఇందుకు పూనుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  

కోవిడ్ తరువాత మొత్తం ప్రపంచం సమయానికి తగ్గట్లు ఎదిగేందుకు ప్రయత్నించే తరుణంలో అది ఇండియాకు ఒక విధంగా సవాలు మరొక విధంగా అవకాశమని ఆయన అన్నారు.  'స్థానికతకు పెద్దపీట వేయాలనే'  మాటకు అర్ధం స్థానికంగా లభించే వస్తువులను వినియోగించడమే కాక స్థానికంగా లభించని వాటిని ఉత్పత్తి చేయాలనే ప్రేరణ కలిగి ఉండటం లక్ష్యం కావాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  

ఆత్మ నిర్భర్ భారత్ కు  ఆధునికతతో, ప్రగతితో మరియు అభివృద్ధితో ఎలాంటి విరోధం లేదని అయితే శాంతియుతంగా, ప్రగతిశీల ధోరణితో వర్ధిల్లడం అని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  

దుఃఖితుల పట్ల దయతో వ్యవహరించి వారి సంరక్షణకు పాటుపడుతూ స్థానిక వస్తువులను ప్రోత్సహించాలని,  విడి భాగాలను జోడించే స్థాయి నుంచి ఉత్పత్తి స్థాయికి ఎదగడమే ఆత్మ నిర్భర్ భారత్ అసలు స్వభావమని,  అంటే అభివృద్ధి ఫలాలు చేజారకుండా గౌరవంగా స్వయంసమృద్ధి  సాధించడం.  

కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి,  అన్ని రంగాలకు సహాయ పడే  రూ. 20 లక్షల కోట్ల  ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీని ఆవిష్కరించారని, అది దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 10% మని మంత్రి తెలిపారు.  స్థానికతే మూజువాణి అని, మన మంత్రం కావాలని నరేంద్ర మోదీ చెప్పిన మాట ఇండియాలో ప్రజా ఉద్యమంగా మారుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.  

ఎం ఎస్ ఎం ఈ లను ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశీయ సంస్థలకు ఎక్కువ అవకాశాలు కల్పించి వ్యాపారం పెంచేందుకు రూ. 200 కోట్లు లేక అంతకన్నా తక్కువ కాంట్రాక్టుల(సేకరణ)  కోసం గ్లోబల్ టెండర్లను పిలవడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం  ప్రకటన జారీ చేసినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్బంగా తెలిపారు.  ఆత్మ నిర్భరత అంటే వీలయినంత వరకు దిగుమతులను తగ్గించి వాటిని మన దేశంలో మన కోసమే కాక ప్రపంచ దేశాల కోసం ఉత్పత్తి చేయడం.  

మనదేశంలో ఉన్న వెదురు వనరులను గురించి ఉదహరిస్తూ వాటిని  సమగ్రంగా ఉపయోగించుకోవడంతో పాటు అగర్బత్తీల దిగుమతి తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు.  మోదీ ప్రభుత్వం శతాబ్దాల కిందటి  అటవీ చట్టాన్ని సవరించింది.  వెదురు పుల్లల దిగుమతి పై సుంకం 25% పెంచింది.  దీనివల్ల దేశీయ వెదురు పరిశ్రమ,  అగర్బత్తీల పరిశ్రమ పెద్ద ఎత్తున వృద్ధి చెందుతాయి.  

2014లో జమ్మూ - కాశ్మీర్ రాష్ట్రంతో సహా  భారతాన్ని ముంచెత్తిన భారీ వరదల సమయంలో  ఐ ఎం సి చేసిన సహాయక చర్యలను డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తుచేసుకున్నారు.  ఇప్పుడు ఈ సంక్షోభంలో కూడా మీరు కీలకమైన పాత్రను పోషించగలరనే నమ్మకం నాకుంది అని ఆయన అన్నారు.

ఐ ఎం సి అధ్యక్షుడు రాజీవ్ పొద్దార్  స్వాగతోపన్యాసం చేశారు. ఐ ఎం సి  ఉపాధ్యక్షుడు జుజార్ కొరకివాలా వందన సమర్పణ చేశారు.

***



(Release ID: 1652475) Visitor Counter : 149