కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

నోయిడాలోని ఈ ఎస్ ఐ సి ఆసుపత్రి మరియు ఔషధాలయాల(డిస్పెన్సరీ)లో సేవల విషయంలో వచ్చిన ఆరోపణలపై వచ్చిన వార్తలకు ఈ ఎస్ ఐ సి వివరణ

ఈ ఎస్ ఐ సి డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది తమ విధి నిర్వహణ బాధ్యతలకు మించి సేవలు అందిస్తున్నారు

ఏప్రిల్, 2020 నుంచి నోయిడా ఈ ఎస్ ఐ సి ఆసుపత్రి సిబ్బంది దాదాపు 68,000 మంది రోగులకు సేవలు అందించారు

Posted On: 08 SEP 2020 1:31PM by PIB Hyderabad

ఇదే సమయంలో సెక్టార్ -12,  సెక్టార్-57, నోయిడా ప్రత్యేక ఆర్ధిక మండల (ఎన్ ఈ పి జడ్) ప్రాంతంలో, గ్రేటర్ నోయిడాలో  ఉన్న నాలుగు డిస్పెన్సరీలలో లక్షకు పైగా  ఇన్ పేషేంట్లకు మరియు వారి లబ్ధిదారులకు చికిత్స చేశారు

నోయిడాలోని ఈ ఎస్ ఐ సి ఆసుపత్రిలో  మరియు డిస్పెన్సరీలలో ఇన్ పేషేంట్లకు మరియు వారి లబ్ధిదారులకు సరైన చికిత్స లభించడం లేదని కొన్ని దినపత్రికలలో వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ ఎస్ ఐ సి వివరణ ఇచ్చింది.  ఆసుపత్రి,  డిస్పెన్సరీల సిబ్బంది తమ విధులకు అంకితమై ఇన్ పేషేంట్లకు మరియు వారి లబ్ధిదారులకు అన్ని రకాల చికిత్సలను అందిస్తున్నారని తెలిపారు.   విశ్వ మహమ్మారి కోవిడ్ -19 ప్రబలిన సమయంలో ఈ ఎస్ ఐ సి సిబ్బంది పనితీరుకు సంబంధించిన ఆధారాలను చూపారు. వైద్య సేవలు అందించడంలో  సిబ్బంది పనితీరు బాగున్నట్లు అవి సూచిస్తున్నాయి.  

అంతేకాక 2020 ఏప్రిల్ నుంచి తమ నోయిడా ఆసుపత్రి దాదాపు 68000 రోగులకు సేవలు అందించిందని కూడా ఈ ఎస్ ఐ సి తెలిపింది.  ఇదే సమయంలో సెక్టార్ -12,  సెక్టార్-57, నోయిడా ప్రత్యేక ఆర్ధిక మండల (ఎన్ ఈ పి జడ్) ప్రాంతంలో,  గ్రేటర్ నోయిడాలో  ఉన్న నాలుగు డిస్పెన్సరీలలో లక్షకు పైగా  ఇన్ పేషేంట్లకు మరియు వారి లబ్ధిదారులకు చికిత్స చేసినట్లు కూడా ఈ ఎస్ ఐ సి వెల్లడించింది. అంతేకాక 2020 జూన్ నుంచి కోవిడ్ -19 రోగులకు కూడా ఈ ఎస్ ఐ సి ఆసుపత్రి చికిత్స అందిస్తోందని,  ఇందుకోసం 100 పడకలను ప్రత్యేకించినట్లు తెలిపారు.   ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫార్మసీ నుంచి ఆసుపత్రిని సందర్శించే రోగులకు మందులు పంపిణీ చేస్తున్నారు.  

నోయిడాలో బీమా సౌకర్యం ఉన్నవారికి నోయిడాలోని ఈ ఎస్ ఐ సి సబ్ రీజనల్ ఆఫీసు ద్వారా నగదు ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారు.  తద్వారా  కోవిడ్ మహమ్మారి ప్రబలిన ఈ కష్టకాలంలో సభ్యులు ఇబ్బంది పడకుండా ఆదుకుంటున్నారు.  
2020 ఏప్రిల్ నుంచి నగదు ప్రయోజనం కింద మొత్తం 25829 మందికి రూ. 8.5 కోట్ల మొత్తాన్ని చెల్లించడం జరిగింది.  

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఎస్ ఐ సి ఆసుపత్రులు కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటం చేస్తున్నాయి.  ఈ ఎస్ ఐ సంస్థ కృషికి ప్రశంసలు లభించాయని,  సంస్థ వైద్య సేవల మౌలిక సదుపాయాలను సాధారణ ప్రజానీకంతో సహా  కోవిడ్ -19 సోకిన  వారందరి కోసం కూడా తెరవడం జరిగింది.  ఇప్పటి వరకు సంస్థకు చెందిన 23 ఆసుపత్రులు 2600 ఐసోలేషన్ పడకలు మరియు 1350 క్వారెంటైన్ పడకలతో కోవిడ్ -19 ప్రత్యేక ఆసుపత్రులుగా పనిచేస్తున్నాయి.  పైన చెప్పినవి కాకుండా దేశవ్యాప్తంగా  ఈ ఎస్ ఐ సంస్థకు చెందిన ఇతర ఆసుపత్రులలో దాదాపు 961 కోవిడ్ ఐసోలేషన్ పడకలు లభ్యమవుతున్నాయి.  ఆ విధంగా వివిధ ఈ ఎస్ ఐ సి  ఆసుపత్రులలో మొత్తం ఐసోలేషన్ పడకల సంఖ్య  3597.  అంతేకాక  ఈ ఆసుపత్రులలో  213 వెంటిలేటర్లతో  555 ఐ సి యు పడకలు కూడా అందుబాటులో ఉన్నాయి.  

ఈ మహమ్మారిని ఎదురుకోవడానికి మొత్తం దేశమంతా పోరాడుతున్న ఈ కష్ట సమయంలో  వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది నిజమైన యోధుల వలె దివారాత్రాలు కృషిచేస్తూ,  తమ విధి నిర్వహణ బాధ్యతలకు మించి సేవచేస్తూ కోవిడ్ -19 మహమ్మారి తెచ్చిన  విపత్తు ప్రభావం నుంచి రోగుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారని తెలిపారు.  

మీడియా పాత్రను తక్కువచేసి చూపడం కాదని,  అయితే ఈ పరీక్షా సమయంలో వారు సహకారం అందించాలని  మరియు ఓర్పు వహించాలని ఈ ఎస్ ఐ సి కోరుతోంది.  

***



(Release ID: 1652416) Visitor Counter : 174