రైల్వే మంత్రిత్వ శాఖ

4 సెప్టెంబర్ 2020 నాటికి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ పథకం క్రింద 8,09,000 పనిదినాలు కల్పించిన భారతీయ రైల్వే

బిహార్, ఝూర్ఖండ్, మధ్య ప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పనిదినాలు కల్పించిన రైల్వే

రాష్ట్రాల్లోని వలస కూలీలకు ఈ పథకం క్రింద కల్పిస్తున్న అవకాశాలను పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ

ఈ పథకాన్ని అమలు పరచడం కోసం గత్తేదార్లకు 4 సెప్టెంబర్ 2020 నాటికి రు.1,631.80 కోట్లు మంజూరు

దేశంలోని 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో అమలుచేయబడుతున్న గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ పథకం
ఈ రాష్ట్రాల్లో సుమారు 164 రైల్వే ప్రాజెక్టుల అమలు

Posted On: 08 SEP 2020 2:47PM by PIB Hyderabad

బిహార్, ఝూర్ఖండ్, మధ్య ప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ పథకం క్రింద 8,09,046 పనిదినాలు కల్పించిన  భారతీయ రైల్వే. వలస కార్మికుల కోసం ఆయా రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాల కల్పన కోసం ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును  కేంద్ర  రైల్వేలు మరియు వాణిజ్య మరియు పరిశ్రమల శాఖామాత్యులు శ్రీ పీయూష్ గోయల్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో  సుమారు 164 రైల్వే ప్రాజెక్టులను అమలు పరుస్తున్నారు. ఇందుకోసం 4 సెప్టెంబర్ 2020 నాటికి 12,276 మంది కూలీలు పనిచేయగా వారికి చెల్లింపుల కోసం రు.1,631.80 కోట్ల నిధులను విడుదల చేసారు.

ప్రాజెక్టుల్లో ఈ పథకం క్రింద వివిధ రకాల పనులను గుర్తించిం అమలు పరుస్తోంది. అవి (i)లెవల్ క్రాసింగులను కలిపే రోడ్డులను నిర్మించడం వాటి సంరక్షణ   (ii) రైల్వే పట్టాల వెంట నీరు నిలవ ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని శుభ్రపరచడం వంటి కార్యక్రమాలు చేయడం. (iii) రైల్వే స్టేషన్లను కలిపే అప్రోచ్ రోడ్లను నిర్మాణం మరియు వాటి సంరక్షణ, (iv) ఇప్పటికే ఉన్న రైలు కట్టలను బాగుచేయడం లేదా వెడల్పు చేయడం (v) రైల్వే స్థలాల సరిహద్దుల వెంట మొక్కల పెంపకం మరియు (vi)  ప్రస్తుతం ఉన్నకట్టలు, వంతెలనల సంరక్షణ.

కొవిడ్-19 కారణంగా భారీగా స్వస్థలాలకు చేరిన వలస కూలీల ఉపాధి మరియు గ్రామీణ ఉపాధి కార్యక్రమం గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ పథకాన్ని గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 20 జూన్ 2020న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం క్రింద గ్రామాల్లో మన్నికైన భవనాల నిర్మాణం కోసం రు. 50,000 కోట్లు ప్రకటించారు  ప్రధాన  మంత్రి.

బిహార్, ఝూర్ఖండ్, మధ్య ప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని 116  జిల్లాల్లో  వలస కార్మికుల కోసం 25 వర్గాల క్రింద 125రోజుల పనిదినాలను కల్పించడం జరుగుతుంది. ఈ పథకం క్రింద ప్రభుత్వ పనులను కూడా చేర్చి వాటి చెల్లింపుల కోసం రు.50,000 కోట్లు కేటాయించడమైనది.

గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్, రోడ్దు రవాణా మరియు రహదారులు, గనులు, త్రాగునీరు మరియు పరిశుభ్రత, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం మరియు సహజ వాయులు, పనరుద్ధరణీయ శక్తి, సరిహద్దు రోడ్లు, టెలికం మరియు వ్యవసాయ వంటి వివిధ 12 మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల వారు ఈ పథకం క్రింద  25 రకాల ప్రభుత్వ మరియు ప్రభుత్వ సంబంధిత పనులును వలస కూలీలకు జీవనాధారం కోసం ఉపాధి అవకాశాలను కల్పించారు.

***



(Release ID: 1652410) Visitor Counter : 168