రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
మలేరియా నియంత్రణ కోసం 114.2 మెట్రిక్ టన్నుల డీడీటీని జాంబియాకు సరఫరా చేసిన హెచ్‌ఐఎల్ (ఇండియా) లిమిటెడ్
Posted On:
08 SEP 2020 12:48PM by PIB Hyderabad
కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఐఎల్ (ఇండియా) లిమిటెడ్, 114.2 మెట్రిక్ టన్నుల 'డీడీటీ 75% డబ్ల్యూపీ'ని జాంబియాకు సరఫరా చేసింది.
జాంబియా ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన 307 మెట్రిక్ టన్నుల ఆర్డర్‌లో ఇది ఆఖరి దశ పంపిణీ అని హెచ్‌ఐఎల్ సీఎండీ శ్రీ ఎస్‌పీ మొహంతి చెప్పారు. హెచ్‌ఐఎల్ ఇటీవలే 20.6 మెట్రిక్ టన్నుల డీడీటీని దక్షిణాఫ్రికాకు అందించింది. జింబాబ్వేకు 129 మెట్రిక్ టన్నులు పంపే పనిలోవుంది.
ప్రపంచంలో హెచ్‌ఐఎల్ మాత్రమే డీడీటీని ఉత్పత్తి చేస్తోంది. మలేరియా నివారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి డీడీటీని అందించేందుకు ఈ సంస్థను 1954లో స్థాపించారు. 2019-20లో దేశంలోని 20 రాష్ట్రాలకు డీడీటీ అందించింది. ఎన్నో ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతులు చేస్తోంది.
ప్రపంచవ్యాప్త ప్రజారోగ్య సమస్యల్లో మలేరియా ఒకటి. మలేరియా దోమల నిర్మూలనలో డీడీటీ సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, జాంబియా, నమీబియా, మొజాంబిక్ వంటి ఆఫ్రికా దేశాలు డీడీటీని విస్తృతంగా వినియోగిస్తాయి. దక్షిణ ఆఫ్రికా ప్రాంతంతో సంబంధాల బలోపేతం కోసం నాణ్యమైన డీడీటీని ఆయా దేశాలకు భారత్ అందిస్తోంది.
(Release ID: 1652323)
Visitor Counter : 137