నీతి ఆయోగ్
అటల్ నవీకరణ కార్యక్రమం మరియు స్కూన్యూస్ భాగస్వామ్యంలో అట్టడుగుస్ధాయిలో నవీకరణల గురించి అవగాహనా విస్తరణ కార్యక్రమం
అటల్ టింకరింగ్ పరిశోధనాశాలల్లో విద్యార్థుల ఆవిష్కరణలను డిజిటల్ మాధ్యం ద్వారా వ్యాప్తి
Posted On:
07 SEP 2020 2:23PM by PIB Hyderabad
మౌళిక స్థాయిలోలని స్ఫూర్తివంతమైన జీవితానుభవాలను, ఆవిష్కరణలను వ్యాప్తి చేయడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ వారు భారతదేశంలోని అతి పెద్ద విద్యా మాధ్యమ సంస్ధల్లో ఒకటైన స్కూన్యూస్ వారి సంయుక్త భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు అటల్ టింకరింగ్ పరిశోధనాశాలల వారు విద్యారంగంలోని వివిధ భాగస్వాములు, పాఠశాలలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, శిక్షకులు మరియు సలహాదారులకు ప్రపంచంలోని నాణ్యమైన దార్శనికత, విషయం మరియు ఉత్తమ పద్దతులను పరిచయం చేస్తారు.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు అందించిన విషయాలను స్కూన్యూస్ వారు తమ యంత్రాగం సహాయంతో వివిధ కార్యక్రమాల ద్వారా విస్తరింపజేస్తారు. వివిధ అంకుర సంస్ధల విజయ గాథలు, మౌళిక స్థాయిలో స్ఫూరివంతమైన వారి విజయ గాథలను, ఏటిల్-సంబంధిత విషయం వంటివి నెల వారీగా ప్రచురణల ద్వారా అందిస్తారు. వీటిని ఏఐఎం మరియు స్కూన్యూస్ వారు సంయుక్తంగా ప్రచురిస్తారు. ఏటిఎల్ మారథానుకు సంబంధించి వివిధ ప్రత్యేక సంచికలను స్కూన్యూస్ కూడా ప్రచురిస్తుంది.
దేశంలో సుమారు 10 లక్షల మంది ఆవిష్కర్తలకు తగిన ఉద్యోగాల కల్పనే అటల్ ఇన్నోవేషన్ మిషన్ లక్ష్యం. అందుకుగాను ప్రజల్లో స్ఫూర్తి నింపడానికి స్ఫూర్తి గాథలను వారితో పంచుకుంటుంది. అందుకే ఏటిల్ లబ్దిదారులు కష్టనష్టాలను తట్టుకుని విజయాన్ని సాధిస్తున్నారు. ఈ విజయ గాథలను స్కూన్యూస్ వారి భాగస్వామ్యంతో లబ్దిదారులకు అందిస్తున్నారు. భారతదేశంలో ప్రతిభను గుర్తించేందుకు వేదికను ఉపయోగించుకుంటున్నామని ఏఐఎ: సంచాలకులు శ్రీ ఆర్. రమణన్ అన్నారు.
ప్రస్తుత కొవిడ్-19 సమయంలో పాఠశాల విద్యలో ఈ విజయ గాథలను తీసుకురావడానికి అవిరళంగా కృషిచేసిన స్కూన్యూస్ వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
స్యూన్యూస్ సిఇఓ రవి సన్తలాని మాట్లాడుతూ ఏఐఎం వారితో పనిచేయడానికి సంతోషిస్తున్నామని అన్నారు. దేశవ్యప్తంగా ప్రతిభావంతులను గుర్తించి వారి విజయ గాథలను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలలకు, శిక్షకులకు మరియు ఇతర భాగస్వాములకు అందించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. భారతదేశంలో విద్యారంగాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు ఏఐఎం, నీతి ఆయోగ్ వారితో మరింత సుస్థిర భాగస్వామ్యం ద్వారా కృషిచేస్తామన్నారు.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా భారత దేశంలో సంస్థలను మరియు కంపెనీలు పెంచడానికి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా యువ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపడానికి ఈ వేదికలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
***
(Release ID: 1652000)