వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఎసిఎంఎ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి శ్రీపియూష్‌గోయల్
అభివృద్ధి సాధనకు ఎసిఎంఎ పరస్పర సహకారం,సమన్వయం,అంకిత భావాన్నిపాటిస్తూ పోటీతత్వంతో ఉండాల్సిందిగా సూచించిన మంత్రి
మార్కెట్ అనంతరం వ్యాపారం ఆటోమెబైల్ పరిశ్రమకు మరిన్ని అవకాశాలను కల్పించనుంది.
प्रविष्टि तिथि:
05 SEP 2020 6:33PM by PIB Hyderabad
పరస్పర సహకారం, నిబద్ధతతో, మిగిలిన ప్రపంచంతో పోటీపడుతూ విశ్వాసంతో ఎదగాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, రైల్వే శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఆటోమోటివ్ విడిభాగాల తయారీదారులకు పిలుపునిచ్చారు. ఆటోమోటివ్ విడిభాగాల ఉత్పత్తిదారుల అసోసియేషన్ (ఎసిఎంఎ) 60 వ వార్షికసమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ పిలుపునిచ్చారు.గత కొద్ది సంవత్సరాలుగా తయారీ దారులు వృద్ధి చెందారని, అంతర్జాతీయ పోటీకి తమను తాము సిద్దం చేసుకున్నారని అన్నారు. ఆటోమోటివ్ విడిభాగాల పరిశ్రమ భవిష్యత్ కు తగినట్టుగా సిద్ధంగా ఉందని, కోవిడ్ అనంతర ప్రపంచంలో విజేతగా ఎదగనున్నదని ఆయన చెప్పారు.“ సంక్షోభ సమయంలోనే మన సంస్థలలో అత్యుతత్తమమైనవి వెలికివస్తాయి. వాణిజ్యప్రోత్సాహం, సాంకేతిక పరిజ్ఞాన ఉన్నతీకరణ, నాణ్యతాపెంపు, సమాచారాన్ని సేకరించి అందించేందుకు తగిన చర్యలు వంటి వాటి విషయంలో ఎసిఎంఎ ముందుండ వచ్చు”నని ఆయన అన్నారు.
.
ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్‌ను దేశం మొత్తం అనుసరిస్తున్నట్టు గోయల్ తెలిపారు.
బలం,విశ్వాసంతో మరింత ముందుకు వెళ్లేందుకు మిగతా ప్రపంచంతో మమేకం కావాలన్నప్రధానమంత్రి పిలుపును అందరూ స్వీకరించారని అన్నారు. అంతర్జాతీయ సరఫరా చెయిన్‌లలో నమ్మకమైన భాగస్వాములకు మంచి డిమాండ్ ఉన్నదని ఆయన చెప్పారు. “ మనం మన అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరిద్దాం. మన వ్యాపారాన్ని విస్తరించేందుకు అద్భుతమైన అవకాశాలున్నాయి.అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను పోటీ ధరలకు అందించడం ద్వారా మనం విశ్వసనీయమైన భాగస్వామి కాగలం ” అని మంత్రి అన్నారు.
భారతీయ ఆర్థిక వ్యవస్థలోని సానుకూల ధోరణుల గురించి మాట్లాడుతూ ఆయన , “ రైల్వేల విషయంలో గత నెలలో మనం సరకు రవాణాను గత ఏడాది కంటే నాలుగు శాతం పెంచగలిగాం. ప్రస్తుత నెలలో ఇది మరింత మెరుగుగా ఉంది. ట్రాక్టర్ అమ్మకాలు పెరిగాయి. ద్విచక్ర వాహనాలు, త్రి చక్రవాహనాల అమ్మకాలు కూడా మంచి స్థితిలో ఉన్నాయి. నిరాశను వదిలి సానుకూల దృక్పథంతో విశ్వాసంతో ముందుకు పోయే సమయం ఇది.”అన్నారు.
మనం ఖర్చులు తగ్గించుకుని ఉత్పాదకతను పెంచుకోవాలి. ఖర్చువిషయంలో ప్రతి ఒక్క విషయాన్ని గమనించాలి. స్మార్ పరిష్కారాలకు ప్రాధాన్యతలు ఇవ్వాలన్నారు.మార్కెట్ అనంతర వ్యాపారాలు అంటే విడిభాగాల వ్యాపారంలో ఎసిఎంఎ కు మంచి అవకాశాలున్నాయని ఆయన అన్నారు. నాణ్యతను పాటిస్తూ పెద్ద ఎత్తున ఉత్పత్తిని సాగించడం ద్వారా పరిశ్రమ ఎగుమతులకు పోటీకి సిద్దం కాగలుగుతుందని ఆయన అన్నారు. ఆటో పరిశ్రముకు వినూత్న ఫైనాన్సింగ్ సదుపాయానికి ఆయన పిలుపునిచ్చారు.
***
(रिलीज़ आईडी: 1651752)
आगंतुक पटल : 126