మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 47 మంది అవార్డు గ్రహీతలకు భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ వర్చ్యువల్ గా ఉపాధ్యాయులకు జాతీయ అవార్డును ప్రదానం చేశారు



కోవిడ్ కాలంలో డిజిటల్ విద్య ద్వారా ఉపాధ్యాయుల పాత్రను భారత రాష్ట్రపతి అభినందించారు

భవిష్యత్ అవసరాలకు పిల్లలను సిద్ధం చేయడానికి జాతీయ విద్యా విధానం - శ్రీ రామ్ నాథ్ కోవింద్

ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు, వారి శీలము, స్ఫూర్తి, శక్తియుక్తులు దేశభవితను తీర్చిదిద్దుతాయి - కేంద్ర విద్యా మంత్రి

Posted On: 05 SEP 2020 2:57PM by PIB Hyderabad

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు (సెప్టెంబర్ 5, 2020) తొలిసారి వర్చ్యువల్ గా జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ దేశవ్యాప్తంగా 47 మంది ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో అవార్డు గ్రహీతలను అభినందించారు, పాఠశాల విద్యను గుణాత్మకంగా మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. జాతీయ అవార్డుల విజేతలలో 40 శాతం మంది మహిళలు ఉన్నారని, మహిళలు విద్యావంతులుగా పోషించిన పాత్రను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్’, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం కార్యదర్శి శ్రీమతి అనితా కార్వాల్, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ కు రాష్ట్రపతి శ్రీ కోవింద్ ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ రాధాకృష్ణన్ దార్శనికుడు, మంచి రాజనీతిజ్ఞుడే కాకుండా అసాధారణమైన ఉపాధ్యాయుడు అని రాష్ట్రపతి కొనియాడారు. ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు ఒక మచ్చు తునక అని, మొత్తం విద్యావంతుల సమాజానికి గౌరవం ఇవ్వడానికి ఇదో మంచి అవకాశమని రాష్ట్రపతి అన్నారు. విద్యార్థుల జీవితాలలో మన ఉపాధ్యాయుల నిబద్ధత, అత్యున్నత సహకారానికి గౌరవం ఇచ్చే అవకాశాన్ని కూడా ఈ సందర్భం కలిపిస్తుందని ఆయన తెలిపారు. పిల్లల గుణగణాలు, జ్ఞానాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయులు పాఠశాలలకు పునాదుల్లాంటి వారని, నిజమైన జాతి నిర్మాతలని అని ఆయన అభిప్రాయపడ్డారు.

కోవిడ్ మహమ్మారి సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో డిజిటల్ టెక్నాలజీ ప్రాముఖ్యతను రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పిల్లలకు పాఠ్యాంశాల బోధనా అందించడంలో మన ఉపాధ్యాయులు ఈ సాంకేతిక పరిజ్ఞానం సహాయాన్ని తీసుకుంటున్నారని అన్నారు. ఈ కొత్త టెక్నాలజీ ఆధారిత బోధనకు మారడంలో ఉపాధ్యాయుల నైపుణ్యాలను ప్రశంసించిన ఆయన, ఉపాధ్యాయులందరూ డిజిటల్ టెక్నాలజీ రంగంలో వారి నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయడం, అప్‌డేట్ చేయడంచాలా ముఖ్యం అని శ్రీ రామనాథ్ కోవింద్ అన్నారు. తద్వారా విద్యా బోధన  మరింత ప్రభావవంతంగా ఉంటుంది, విద్యార్థులను కొత్త పద్ధతులతో సంభాషించేలా చేస్తుంది అని తెలిపారు.  ఆన్‌లైన్ విద్యా విధానం తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి కొత్త అభ్యాస రంగాలపై ఆసక్తిని రేకెత్తించడానికి పిల్లలను ప్రోత్సహించడం తప్పనిసరి చేసిందని రాష్ట్రపతి అన్నారు. డిజిటల్ డివైడ్‌ను ప్రస్తావిస్తూ, గిరిజన, దూర ప్రాంతాల పిల్లలకు కూడా ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన  ఉద్ఘాటించారు.

జాతీయ విద్యా విధానం గురించి మాట్లాడిన రాష్ట్రపతి శ్రీ కోవింద్, కొత్తగా ప్రవేశపెట్టిన విధానం మన పిల్లలను భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేసే ప్రయత్నం అని అన్నారు. వివిధ వాటాదారుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాత రూపొందించబడిందన్నారు. ఈ విధానాన్ని విజయవంతం చేయడానికి, సత్పలితాలు ఇచ్చేలా ఉపయోగపడడానికి ఉపాధ్యాయులదే ఇప్పుడు కీలక పాత్ర అని  ఆయన తెలిపారు. కొత్త జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి ఉపాధ్యాయులను సమర్థులుగా చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్రపతి శ్రీ కోవింద్ అన్నారు.

రాష్ట్రపతి పూర్తి ప్రసంగపాఠంగురించి ఈ లింక్ క్లిక్ చేయండి:

https://static.pib.gov.in/WriteReadData/userfiles/hindi%20msg.pdf

శ్రీ పోఖ్రియాల్ ప్రసంగిస్తూ, తన దార్శనికతను పంచుకున్న రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలోచనలు చాల గర్వించదగ్గవని అన్నారు. మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును పొందిన ఉపాధ్యాయులను శ్రీ పోఖ్రియాల్ ప్రశంసించారు. పిల్లల భవిష్యత్తును, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దినందున ఉపాధ్యాయులను సమాజంలో అత్యంత గౌరవనీయమైన సభ్యుడిగా పరిగణిస్తారని మంత్రి చెప్పారు. ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని, వారి శీలం, స్ఫూర్తి, శక్తియుక్తులు  దేశ గమనానికి ఆధారభూతమని అన్నారు. తరతరాలకు స్ఫూర్తినిచ్చేందుకు, జాతీయ, ప్రపంచ స్థాయిల్లో సమానత్వం, సామాజిక న్యాయం, శ్రేష్ఠత లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయులు తమకున్న మేధో సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మారుతున్న సామాజిక అవసరాలు, అభ్యాసకుల వ్యక్తిగత అవసరాల గురించి తెలుసుకోవడం, బోధన-అభ్యాస ప్రక్రియలో గత అనుభవాలు, విద్యా ప్రాధాన్యతలు, జాతీయ అభివృద్ధి లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడం ఉపాధ్యాయుడి ప్రధాన బాధ్యత అని మంత్రి తెలిపారు.

 

 

 

కోవిడ్-19 సమయంలో శ్రీ పోఖ్రియాల్ ఉపాధ్యాయుల పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సవాళ్లు అపారమైనవి, ఎందుకంటే వారు ముఖాముఖి బోధనను ప్రత్యామ్నాయ బోధ, అభ్యాస వ్యూహాలతో భర్తీ చేయాల్సి వచ్చింది. పరిస్థితి మొదట్లో కొంత కక్షసాధ్యమే అనిపించినప్పటికీ , కాని మన ఉపాధ్యాయులు అడ్డంకులను అధిగమించి, చక్కటి వ్యవస్థీకృత పద్ధతిలో చేసిన విద్యా విధానాలతో ముందుకు సాగారు. ఆన్‌లైన్, టీవీ, మొబైల్, రేడియో, పాఠ్యపుస్తకాలు వంటి ప్రత్యామ్నాయ అభ్యాస మాధ్యమాల ద్వారా అధికారిక బోధన భర్తీ అయింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు డిజిటల్ అనువర్తనాలు దీక్ష, స్వయం, స్వయం ప్రభా, ఫోసీ, ఎన్ఆర్ఓఈఆర్ వైపు మారారు... అని శ్రీ పోఖ్రియాల్ తెలిపారు.

విద్యా వ్యవస్థలోనే కాదు, ఉపాధ్యాయుల జీవితంలో కూడా సమూల పరివర్తనకు ఎన్‌ఇపి -2020 సాక్షీభూతంగా నిలుస్తుందని  మంత్రి చెప్పారు. ఎన్ఈపి లో మన  ఉపాధ్యాయులకు సంబంధించిన కొన్ని నిబంధనలు చేసాము, ఇది ఉపాధ్యాయుల అర్హత, నియామకం నుండి వారి పనితీరులో మెరుగుదల వరకు సానుకూల ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. .

శ్రీ ధోత్రే రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ విద్యా రంగంపై ఆలోచనాత్మకంగా చేసిన ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని విశ్వవిద్యాలయాలలో రాష్ట్రపతి అనేక సంస్కరణలను ప్రారంభించారని, విభిన్న ప్రతిభావంతులుగా ఉన్నవారు, అనాధల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. సంపద సృష్టిలో మహిళల అధిక భాగస్వామ్యానికి తోడ్పడుతున్నారని ఆయన అన్నారు. ఏ సమాజానికైనా ఉపాధ్యాయులే మూల స్థంభాలని శ్రీ ధోత్రే తెలిపారు. అందువల్ల ఉపాధ్యాయులను మనం అత్యంత ఉత్తమ రీతిలో గౌరవించాలని అన్నారు.

ఈ ఏడాది అభ్యర్థులు, జ్యూరీ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రెసెంటేషన్ ఇచ్చారు. ఈ మేరకు జ్యూరీ 47 మంది అవార్డులకు ఎంపిక చేసింది. అవార్డు గ్రహీతలు తమకున్న నిబద్దతతో పాఠశాల విద్య నాణ్యతను అభివృద్ధి చేయడమే కాకుండా, విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. 

 

అవార్డు గ్రహీతల వివరాలు ఈ లింక్ లో ఉంటాయి... 

For more details of the Awardee Teachers, kindly click the link.

 

*****


(Release ID: 1651665) Visitor Counter : 379