ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పరీక్షలకు సంబంధించిన తాజాగా అడ్వైజరీని జారీ చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ

సులభతరమైన పరీక్షా విధానంతో పాటు, మొదటి సారిగా ఆన్-డిమాండ్ పరీక్షలు

Posted On: 05 SEP 2020 11:35AM by PIB Hyderabad

భారత్ లో రోజువారీ పరీక్షా సామర్థ్యాలలో అపూర్వమైన పెరుగుదల ఉంది. వరుసగా రెండు రోజులూ రోజుకు 11.70 లక్షలకు పైగా పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 4 కోట్ల 77 లక్షల పరీక్షలు జరిగాయి. అన్ని రాష్ట్రాలు / యుటిలను కవర్ చేస్తూ 1647 పరీక్షా ప్రయోగశాలలు ఇప్పుడు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్‌డేట్ చేసిన టెస్టింగ్ అడ్వైజరీని జారీ చేసింది. 

కోవిడ్-19 పై జాతీయ టాస్క్ ఫోర్స్ సిఫారసులపై, కొత్త అడ్వైజరీ...  పరీక్షా విధానాన్ని మరింత సరళీకృతం చేసింది, ప్రజలకు మెరుగైన పరీక్షను సులభతరం చేయడానికి రాష్ట్ర అధికారులకు మరింత స్వేచ్ఛను, వెసులుబాటును ఇచ్చింది.

మొట్టమొదటిసారిగా, మరింత సరళీకృత పద్ధతులతో పాటు, నవీకరించిన మార్గదర్శకాలు అధిక స్థాయి పరీక్షలు జరపడానికి వీలుగా ‘ఆన్-డిమాండ్’ పరీక్ష కోసం అందిస్తాయి.

ఇచ్చిన వివిధ సెట్టింగులలో పరీక్షల ఎంపిక (ప్రాధాన్యత క్రమంలో) గురించి అడ్వైజరీ వివరిస్తుంది.

 

    ఎ .కంటైన్మెంట్ జోన్లలో దైనందిన  నిఘా, ప్రవేశ పాయింట్ల వద్ద స్క్రీనింగ్:

పరీక్ష ఎంపిక (ప్రాధాన్యత క్రమంలో):

 1. రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (ఆర్ఏటి) [జోడించిన అల్గోరిథం ప్రకారం]
 2. ఆర్టీ-పీసీఆర్ కానీ ట్రూనాట్ కానీ సీబీనాట్ కానీ 

1. ఆరోగ్య సంరక్షణ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో సహా అన్ని రోగలక్షణ (ఐఎల్ఐ లక్షణాలు) కేసులు.

2. ప్రయోగశాలలో ధృవీకరణ అయిన అన్ని లక్షణరహిత(అసీంటమటిక్) ప్రత్యక్ష, అత్యంత రిస్క్ ఉన్న కాంటాక్టులు (కుటుంబం, కార్యాలయంలో, 65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, రోగనిరోధక శక్తి లేనివారు, అనారోగ్యులతో కలిసి ఉన్నవారు మొదలైనవారు)ని 5 వ రోజు 10 వ రోజు మధ్య ఒకసారి పరీక్షించాలి. 

3. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న లక్షణరహిత వ్యక్తులు  (65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, రోగులతో ఉన్నవారు) 

బి. కంటైన్మెంట్ కాని జోన్లలో దైనందిన నిఘా:

     పరీక్ష ఎంపిక (ప్రాధాన్యత క్రమంలో): 

i . ఆర్టీ-పీసీఆర్ కానీ ట్రూనాట్ కానీ సీబీనాట్ కాని

ii. రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (ఆర్ఏటి)*    

4. గడచిన 14 రోజుల్లో అంతర్జాతీయ ప్రయాణం చేసిన చరిత్ర ఉండి, వ్యాధి లక్షణాలు ఉన్న అందరు వ్యక్తులు

5. ల్యాబ్ ధృవీకరించి, వ్యాధి లక్షణాలు ఉన్న అన్ని (ఐఎల్ఐ లక్షణాలు) కాంటాక్టులు 

6. వ్యాధి నివారణ కార్యకలాపాలలో పాల్గొనే, వ్యాధి లక్షలు (ఐఎల్ఐ లక్షణాలు) ఉన్న ఆరోగ్య రక్షణ వర్కర్లు/ఫ్రంట్ లైన్ వర్కర్లు 

7. 7 రోజుల్లోపు అనారోగ్యం పాలైన, తిరిగి వచ్చిన, వలస కార్మికులతో సహా వ్యాధి లక్షణాలు ఉన్న అన్ని ఐఎల్ఐ కేసులు 

8. *వ్యాధి లక్షణాలు కనబడని అత్యంత హాని గల కాంటాక్టులు (కుటుంబం, కార్యాలయాలలో వారు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, సహ-రోగులు, మొదలైన వారు... ) [ప్రాధాన్యత క్రమంలో మొదటిగా ఆర్ఏటి పరీక్షనే సిఫార్సు చేస్తున్నారు]

సి. ఆస్పత్రుల వ్యవస్థలో :

పరీక్ష ఎంపిక (ప్రాధాన్యత క్రమంలో):

i . ఆర్టీ-పీసీఆర్ కానీ ట్రూనాట్ కానీ సీబీనాట్ కాని

ii. రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (ఆర్ఏటి)

     9. తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (ఎస్ఏఆర్ఐ) ఉన్న రోగులందరూ: 

    10. హెల్త్ కేర్ వ్యవస్థలో ఉన్న వ్యాధి లక్షణ (ఐఎల్ఐ లక్షణాలు) రోగులంతా 

    11. ఆసుపత్రిలో చేరిన లేదా రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు, ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న రోగులు, మార్పిడి రోగులు, దీర్ఘకాలిక సహ-అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు, 65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు వంటి ఆసుపత్రిలో చేరిన లేదా వెంటనే ఆసుపత్రిలో చేరే లక్షణం లేని అధిక-ప్రమాద రోగులు.

      12. శస్త్రచికిత్స / శస్త్రచికిత్స చేయని ఇన్వాసివ్ విధానాలకు లోనయ్యే, వ్యాధి లక్షణం లేని రోగులు (ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్షించకూడదు).

     13. కాన్పు కోసం ఆస్పత్రుల్లో చేరిన గర్భిణీలు ప్రసూతి సమయం దగ్గర పడుతున్నవారు, పురిటినొప్పులు పడుతున్నవారు 

గుర్తించాల్సిన అంశాలు: 

    • పరీక్ష లేదనే నెపంతో ఎటువంటి అత్యవసర చికిత్సను (కాన్పులతో సహా) జాప్యం చేయకూడదు. సమాంతరంగా పైన 1-13 అంశాల్లో పేర్కొన్న ప్రకారం నమూనాలను పరీక్షలకు పంపే ఏర్పాట్లు చేయాలి. 
    • పరీక్ష సౌకర్యం లేదని గర్భిణీలను వేరే చోటకు పంపే ప్రయత్నం చేయరాదు. నమూనాలను సేకరించి పరీక్షల సౌకర్యం ఉన్న వాటికి ఆ నమూనాలను పంపే ఏర్పాటు చేయాలి 
    • కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిన బాలింతలు తన శిశువు పాలనలో 14 రోజుల పాటు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, చేతులు సబ్బుతో శుభ్రం చేసువుకోవడం వంటి చర్యలు చేపట్టేలా చూడాలి.                                                    

14. తీవ్రమైన శ్వాసకోశ / సెప్సిస్ లాంటి అనారోగ్యంతో రోగలక్షణాలు ఉన్న అన్ని నవజాత శిశువులు.(నవజాత శిశువుల్లో తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం సూచించే లక్షణాలు దగ్గుతో ఉన్న లేకున్నా, జ్వరంతోఉన్నా లేకున్నా, శ్వాసకోశ బాధ లేదా అప్నియా. జ్వరం, ఆహారం తీసుకుపోవడం, మూర్ఛలు,విరేచనాలు వంటి శ్వాసకోశ లక్షణాలు కాని సమస్యలు) 

15. ఫీజిషన్లు సూచన మేరకు విభిన్న అనారోగ్యాలతో అనియత లక్షణాలు ఉన్న రోగులు [స్ట్రోక్, ఎన్సెఫాలిటిస్, హిమోప్టిసిస్, పల్మనరీ ఎంబాలిజం, తీవ్రమైన కరోనరీ లక్షణాలు, గుల్లెయిన్ బారే సిండ్రోమ్, బహుళ అవయవ పనిచేయకపోవడం సిండ్రోమ్, ప్రగతిశీల జీర్ణశయాంతర లక్షణాలు, కవాసకి వ్యాధి (పీడియాట్రిక్ వయో గ్రూప్)].

అడ్వైజరీ లో "టెస్టింగ్ ఆన్ డిమాండ్" అనే క్రొత్త విభాగం చేర్చబడింది, ఇది అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ తో పని లేనిది, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలకు సరళీకృత పద్ధతులపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది.

కొత్త సెక్షన్ లో ఉన్న అంశాలు: 

డి. టెస్టింగ్ ఆన్ డిమాండ్ (సరళీకృత పద్ధతులను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి):

    i. ప్రవేశించే సమయంలో కోవిడ్-19 నెగటివ్ పరీక్షను తప్పనిసరి చేసే దేశాలకు/ రాష్ట్రాలకు ప్రయాణించే వ్యక్తులందరూ

    ii. తమకు తాముగా పరీక్షాలు కోరుకొనేవారందరు 

ప్రజారోగ్య అధికారులకు తెలియజేయడం ద్వారా, టెస్టింగ్ లాబొరేటరీలు నిర్వహించే ట్రాకింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ విధానాలను నిర్ధారించాలి.

 

పరీక్షల నిడివి :

 • తిరిగి టెస్ట్ చేసే పని లేకుండా ఒక సారి చేసిన ఆర్టి-పీసీఆర్/ట్రూనాట్/సీబీనాట్/రాట్ పరీక్షే పాజిటివ్ టెస్ట్ నిర్ధారణగా భావించాలి. 
 • కోవిడ్-19 నుండి వైద్య పరంగా కోలుకున్న తర్వాత ఆ ప్రాంగణం నుండి డిశ్చార్జ్ అయ్యే ముందు మళ్ళీ పరీక్ష చేయాల్సిన అవసరం లేదు (ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ మార్గదర్శకాలను పరిశీలించండి) 
 • నెగటివ్ రాట్ పరీక్ష తర్వాత వ్యాధి లక్షణాలు కనబడితే, రాట్ లేదా ఆర్టీ-పీసీఆర్ పరీక్ష మళ్ళీ చేయాలి. (రాట్ ను వివరించే అల్గోరిథం- అనుబంధం 1 లో ఉంది).  

గుర్తించాల్సిన అంశాలు: 

 • డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఐఎల్ఐ నిర్వచనం:  జ్వరంతో కూడిన తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో ఉన్న వ్యక్తి 

38◦C పైగా ఉష్ణోగ్రత, 10 రోజులుగా నిరంతరం దగ్గు ఉండడం.

 • డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఎస్ఏఆర్ఐ నిర్వచనం: జ్వరంతో కూడిన తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్, 38◦C పైగా ఉష్ణోగ్రత, 10 రోజులుగా నిరంతరం దగ్గు ఉండడం ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉన్న వ్యక్తి 
 • అనుమానం ఉన్న/నిర్ధారణ అయిన కోవిడ్-19 రోగుల దగ్గర కాంటాక్ట్ లో ఉన్న హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లందరికి సరైన పీపీఈ లు అందుబాటులో ఉంచాలి. 
 • చికిత్స ప్రక్రియకు ముందు వ్యాధి సంక్రమణ అవకాశాలను తగ్గించడానికి ఎలెక్టివ్ సర్జరీ చేయించుకునే ముందు 14 రోజుల పాటు ఇంట్లో క్వారంటైన్ కి సిఫార్సు చేయబడింది. 

 

కోవిడ్-19 సంబంధిత సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు & అడ్వైజరీలకు అన్ని ప్రామాణికమైన, నవీకరించిన సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా సందర్శించండి: https://www.mohfw.gov.in/ and @MoHFW_INDIA.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in మరియు ఇతర ప్రశ్నలను దీనికి పంపండి:  ncov2019[at]gov[dot]in and @CovidIndiaSeva .

కోవిడ్-19 పై ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నెం.: + 91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) వద్ద కాల్ చేయండి. కోవిడ్-19కి సంబంధించి అన్నిరాష్ట్రాలు/యుటిల హెల్ప్‌లైన్ నంబర్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి: https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

 

****(Release ID: 1651562) Visitor Counter : 312