నౌకారవాణా మంత్రిత్వ శాఖ

ప్రధాన ఓడరేవులన్నీ ఇకనుంచి భారతదేశంలో నిర్మించిన టగ్ బోట్లను మాత్రమే ఉపయోగించుకోవాలి.

భారతీయ నౌకా నిర్మాణ రంగ పునరుజ్జీవనాన్ని పెంచే దిశగా మరియు ఆత్మ నిర్భర్ భారత్ లోని ఆత్మ నిర్భర్ నౌకా నిర్మాణం వైపు ఇది ఒక పెద్ద నిర్ణయం : శ్రీ మాండవీయ

Posted On: 04 SEP 2020 4:00PM by PIB Hyderabad

భారతదేశంలో తయారుచేసే టగ్ బోట్లను మాత్రమే కొనుగోలు చేయాలనీ లేదా అద్దెకు తీసుకోవాలని, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అన్ని ప్రధాన ఓడరేవులను ఆదేశించింది.  ప్రధాన ఓడరేవుల ద్వారా జరుగుతున్న అన్ని కొనుగోలు లావాదేవీలన్నీ, ఇప్పుడు సవరించిన ‘మేక్ ఇన్ ఇండియా’ ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన అవసరం ఉంది.

షిప్పింగ్ మంత్రిత్వ శాఖ భారతీయ నౌకానిర్మాణ పరిశ్రమను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది మరియు 'మేక్ ఇన్ ఇండియా' షిప్ బిల్డింగ్ కోసం కొన్ని ప్రముఖ దేశాలతో చర్చలు జరిపింది.  ఇది ఇలా ఉండగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఓడల నిర్మాణంలో 'మేక్ ఇన్ ఇండియాను' ప్రోత్సహించడంలో ఒక పెద్ద నిర్ణయం అవుతుంది.

Minister CSL Visit 6.JPG

పాత నౌకా నిర్మాణ కేంద్రాలను పునరుద్ధరించడానికీ, దేశంలో ఓడల నిర్మాణాన్ని ప్రోత్సహించడానికీ ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని,  కేంద్ర  షిప్పింగ్  శాఖ సహాయ మంత్రి (ఐ / సి) శ్రీ మన్సుఖ్ మాండవియా అన్నారు.  భారతీయ నౌకా నిర్మాణ రంగ పునరుజ్జీవనాన్ని పెంచే దిశగా మరియు ఆత్మ నిర్భర్ భారత్ లోని ఆత్మ నిర్భర్ నౌకా నిర్మాణం వైపు ఇది ఒక పెద్ద నిర్ణయం.  భారతదేశంలో నౌకా నిర్మాణం, నౌకల మరమ్మత్తు, నౌకల పునర్వినియోగం మరియు ప్రారంభించడానికి తగిన పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.  ఆత్మ నిర్భర్ నౌకా నిర్మాణం రాబోయే కాలంలో బహుళ ప్రసిద్ధి చెందనుంది. 

భారతదేశంలో నౌకానిర్మాణాన్ని ప్రోత్సహించడానికి నౌకా నిర్మాణానికి సంబంధించిన వివిధ రంగాలను సమన్వయపరచి, సవరించిన "మేక్ ఇన్ ఇండియా" ఆదేశాలతో సరిచేయాలి.  ఇందుకోసం ప్రత్యేక లక్షణాలను రూపొందించడానికి, భారతీయ నౌకాశ్రయాల సంఘం మేనేజింగ్ డైరెక్టర్ నేతృత్వంలో, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (సి.ఎస్.ఎల్);  షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.సి.ఐ), ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐ.ఆర్.ఎస్) మరియు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ ప్రతినిధులతో కూడిన ఒక స్థాయి సంఘాన్ని (స్టాండింగ్ స్పెసిఫికేషన్సు కమిటీని)  ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. 

స్టాండింగ్ స్పెసిఫికేషన్సు కమిటీ సుమారు ఐదు విధాల / రకాల టగ్ ‌ల జాబితాను రూపొందించడంతో పాటు, ‘ఆమోదించబడిన ప్రామాణిక టగ్ డిజైన్ మరియు స్పెసిఫికేషన్లను’ (ఏ.ఎస్.టి.డి.ఎస్) ను సిద్ధం చేస్తుంది.  లక్షణాలు, సాధారణ ఏర్పాట్లు, ప్రాథమిక లెక్కలు, ప్రాథమిక నిర్మాణ డ్రాయింగులు, కీలక విధాన పరమైన డ్రాయింగ్‌లు మరియు ఇతర నిర్మాణ ప్రమాణాలు మొదలైన వివరాలతో ఏ.ఎస్.టి.డి.ఎస్. ను సిద్ధం చేస్తారు.    ఈ ప్రమాణాలను స్టాండింగ్ స్పెసిఫికేషన్సు కమిటీ పరిశీలించిన ఈ ప్రమాణాలను, ఐ.ఆర్.ఎస్. ‘సూత్ర ప్రాయంగా’ ధృవీకరిస్తుంది. ఆ తర్వాత భారతీయ నౌకాశ్రయాల సంఘం తన వెబ్ ‌సైట్ ‌లో ప్రచురిస్తుంది. 

మంత్రిత్వ శాఖ ఈ విషయంలో భారీ నౌకాశ్రయాలకు కూడా అవకాశం ఇస్తుంది. తద్వారా నిర్మాణ సమయం కలిసి వస్తుంది.

ఇటీవల, ప్రభుత్వ యాజమాన్యంలోని కొచ్చిన్ నౌకా నిర్మాణ సంస్థ, నార్వే ప్రభుత్వం నుండి రెండు ఆటోమేటెడ్ నౌకల నిర్మాణానికి ఆర్డర్‌ను పొందడంలో విజయవంతమైంది.  ఈ రకమైన మానవరహిత నౌకలలో ఇవి మొదటివి.  షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తీసుకున్న వివిధ నిర్ణయాలు సమీప భవిష్యత్తులో నౌకా నిర్మాణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. 

*****


(Release ID: 1651383) Visitor Counter : 148