వ్యవసాయ మంత్రిత్వ శాఖ
04.09.2020నాటికి 1095.38 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు
కాయధాన్యాలు, తృణధాన్యాలు, చిరు ధాన్యాలు మరియు నూనె గింజల పంటలు విత్తడం పూర్తవుతుండగా ఇంకా కొనసాగుతున్న వరి నాట్లు
విశ్వమహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో కూడా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్రాల మరియు పెట్టుడుల రుణాలను ప్రభుత్వం సకాలంలో అందించడం వలన ఇది సాధ్యమయ్యిందన్న కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖామాత్యులు శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
Posted On:
04 SEP 2020 2:13PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ యంత్రాలు మరియు రుణాలను అందించడం వలన కొవిడ్-19 లాక్డౌన్ సమయంలో కూడా రికార్డు స్థాయిలో సాగు సాధ్యమయ్యిందని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖామాత్యులు శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ప్రభుత్వం ప్రధాన పథకాలను సకాలంలో అమలు పరచడం మరియు రైతులు కూడా సకాలంలో వ్యవసాయ కార్యక్రమాలు చేపట్టడం, సాంకేతికతను వినియోగించకొని ప్రభుత్వం పథకాల ద్వారా లబ్ది పొందడం మూలనే ఇది సాధ్యమయ్యిందని ఆయన అన్నారు.
ఖరీఫ్ సీజనుకు సంబంధించిన గణాంకాల వివరాలు పొందుపరచుటను 2 అక్టోబర్ 2020న ముగించనుండగా, ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో సాగు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
· వరి: గత సంవత్సరం 365.92 లక్షల హెక్టార్లలో సాగు కాగా ఈ సంత్సరం 396.18 లక్షల హెక్టార్లలో సాగయ్యింది. గత సంవత్సరం ఇదే సీజనుతో పోలిస్తే 8.27% సాగు విస్తీర్ణం పెరిగింది.
· కాయ ధాన్యాలు: ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సాగు 136.79లక్షల హెక్టార్లుగా ఉండగా గత సంవత్సరం 130.68 లక్షల హెక్టార్లు, అనగా 4.67% పెరిగిన సాగు విస్తీర్ణం.
· తృణధాన్యాలు: గత సంవత్సరం ఖరీఫ్లో 176.25 లక్షల హెక్టార్లు సాగు విస్తీర్ణం ఉండగా ఈ సంవత్సరం 179.36 లక్షల హెక్టార్లు అనగా 1.77% పెరిగిన సాగు విస్తీర్ణం.
· నూనె గింజలు: ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 194.75 లక్షల హెక్టార్లలో సాగవ్వగా గత సంవత్సరం 174.00 లక్షల హెక్టార్లలో సాగుచేయబడ్డాయి. అనగా ఈ సంవత్సరం 11.93% సాగు విస్తీర్ణం పెరిగింది.
· చెఱకు: గత సంవత్సరం 51.71 లక్షల హెక్టార్లలో సాగుచేయగా ఈ సంవత్సరం ఖరీఫ్లో 52.38 లక్షల హెక్టార్లలో సాగు చేయబడింది. ఈ సంవత్సరం 1.30% సాగు విస్తీర్ణంలో పెరుగుదల నమోదయ్యింది.
· ప్రత్తి: గత సంవత్సరం 124.90 లక్షల హెక్టార్లుగా ఉండగా ఈ ఖరీఫ్లో 128.95 లక్షల హెక్టార్లలో సాగు నమోదయ్యింది. అనగా గత సంవత్సరంతో పోలిస్తే 3.24% సాగు విస్తీర్ణం పెరిగింది.
· జనపనార: ఈ సంత్సరం 6.97 లక్షల హెక్టార్లు కాగా గత సంవత్సరం 6.86 లక్షల హెక్టార్లలో జనపనార సాగయ్యింది. 1.68% పెరిగిన సాగు విస్తీర్ణం.
04.09.2020 నాటికి ఖరీఫ్లో సాగు విస్తీర్ణంలో పెరుగుదల
|
క్ర.సంఖ్య
|
పంట
|
సాగు విస్తీర్ణం లక్షల హెక్టార్లలో
|
% విస్తీర్ణం
|
2020-21
|
2019-20
|
2019-20
|
1
|
వరి
|
396.18
|
365.92
|
8.27
|
2
|
కాయ ధాన్యాలు
|
136.79
|
130.68
|
4.67
|
3
|
తృణధాన్యాలు
|
179.36
|
176.25
|
1.77
|
4
|
నూనె గింజలు
|
194.75
|
174.00
|
11.93
|
5
|
చెఱకు
|
52.38
|
51.71
|
1.30
|
6
|
జనపనార
|
6.97
|
6.86
|
1.68
|
7
|
ప్రత్తి
|
128.95
|
124.90
|
3.24
|
Total
|
1095.38
|
1030.32
|
6.32
|
03.09.2020 నాటికి దేశంలో సాధారణ వర్షపాతం 730.8మిమి కాగా ఈ సంవత్సరం 795.0 మిమి వర్షపాతం నమోదైంది. 01.06.2020 నుండి 03.09.2020 వరకు (+)9% ఎక్కువ వర్షపాతం నమోదైంది.
కేంద్ర నీటి కమిషన్ వారి నివేదిక ప్రకారం 03.09.2020 నాటికి 123 రిజర్వాయర్లలో గత సంవత్సరంతో పోలిస్తే 104% నీటి నిల్వలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల సగటు నీటి నిల్వ కంటే 120% నీటి నిల్వ ఉంది.
04.09.2020నాటికి ఖరీఫ్ సాగు వివరాల కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి
(Release ID: 1651296)
Visitor Counter : 285