బొగ్గు మంత్రిత్వ శాఖ

బొగ్గు అమ్మకం కోసం ప్ర‌తిపాదిత బొగ్గు గనుల జాబితాకు సవర‌ణ‌

- వేలానికి మొత్తం 38 బొగ్గు గనులు

Posted On: 03 SEP 2020 11:41AM by PIB Hyderabad

వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు గనుల వేలం ప్రక్రియను జూన్ 18, 2020 ప్రారంభించారు. దేశీయ‌ బొగ్గు రంగంలో వాణిజ్య మైనింగ్‌కు ప్ర‌తిపాదిత బొగ్గు గనుల జాబితాకు బొగ్గు మంత్రిత్వ శాఖ తాజాగా ఈ క్రింది సవరణలు చేసింది:

- ఎంఎండీఆర్ చ‌ట్టం-1957 కింద‌ మొద‌టి విడ‌త‌ వేలానికి డోలెసర, జారకేలా, జ‌ర్పాలం-టాంగార్ఘాట్ బొగ్గు గనులను అద‌నంగా చేర్చడమైంది.
- ఎంఎండీఆర్ చ‌ట్టం-1957 చ‌ట్టం కింద మొద‌టి విడ‌త వేలం నుంచి మోర్గా సౌత్ కోల్ మైన్‌ల‌ను ఉప‌సంహ‌రించ‌డ‌మైంది.
- సీఎం (ఎస్పీ) చట్టం, 2015 ప్రకారం 11 వ విడ‌త వేలం నుండి ఫతేపూర్ ఈస్ట్, మదన్పూర్ (నార్త్), మోర్గా -2, మరియు సయాంగ్ కోల్ గనులను ఉపసంహరించ‌డ‌మైంది. దీంతో సీఎం (ఎస్పీ) చట్టం-2015, 11వ విడ‌త వేలం, ఎంఎండీఆర్ చట్టం-1957 కింద మొద‌టి విడత వేలంలో క‌లిపి మొత్తంగా 38 బొగ్గు గనులను వాణిజ్య మైనింగ్ విధానంలో వేలానికి ఉంచిన‌ట్ట‌యింది.
సీఎం (ఎస్పీ) చట్టం, 2015 కింద 11 వ విడ‌త వేలం, ఎంఎండీఆర్ చట్టం 1957 కింద క‌లుపుకోని మొత్తం 41 బొగ్గు గనుల కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ వేలం ప్రక్రియ మొద‌లుపెట్టింది. వేలానికి ఉంచిన గ‌నుల పూర్తి వివ‌రాల‌తో నవీకరించబడిన జాబితా మరియు ఆయా గనుల టెండర్ పత్రాలను ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా పొంద‌వచ్చు:
https://www.mstcecommerce.com/auctionhome/coalblock/index.jsp.

ఎంఎస్‌టీసీ లిమిటెడ్ వెబ్‌సైట్‌లో టెండర్ ప్రక్రియకు సంబంధించిన సమయావ‌ధులు కూడా సూచించ‌డ‌మైంది.

 

****


(Release ID: 1651040) Visitor Counter : 225