వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పంపిణీ గొలుసు పునర్నిర్మాణంపై ఆస్ట్రేలియా-భారత్-జపాన్ ఆర్థిక మంత్రుల ఉమ్మడి ప్రకటన
Posted On:
01 SEP 2020 4:56PM by PIB Hyderabad
సరఫరా గొలుసు పునర్నిర్మాణంపై, సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించిన ఆస్ట్రేలియా-భారత్-జపాన్ మంత్రుల సమావేశంలో నిర్ణయించిన ఉమ్మడి ప్రకటన:
1. ఆస్ట్రేలియా వాణిజ్యం, పర్యాటకం, పెట్టుబడుల శాఖ మంత్రి సైమన్ బర్మింగ్‌హామ్, భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, జపాన్ ఆర్థిక, వర్తకం, పరిశ్రమల శాఖ మంత్రి కాజియామా హిరోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చల్లో పాల్గొన్నారు.
2. స్వేచ్ఛ, పక్షపాతం లేని, పారదర్శక, ఊహించదగిన, స్థిర వాణిజ్యం, పెట్టుబడుల వాతావరణాన్ని కల్పించడంలో, మార్కెట్లను స్వేచ్ఛగా అందరికీ తెరిచివుంచేందుకు నాయకత్వం వహించడంలో నిబద్ధతను మంత్రులు పునరుద్ఘాటించారు.
3. కొవిడ్ సంక్షోభం, ఆర్థిక, సాంకేతికల్లో ప్రపంచస్థాయి మార్పుల నేపథ్యంలో, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పంపిణీ గొలుసు పునర్నిర్మాణాన్ని బలోపేతం చేయాల్సిన అవసరంపై మంత్రులు ప్రధానంగా చర్చించారు.
4. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పంపిణీ గొలుసు పునర్నిర్మాణంపై ప్రాంతీయ సహకారం అవసరం నేపథ్యంలో, పరస్పర సహకారం ద్వారా లక్ష్యాలను సాధించేందుకు కొత్త కార్యక్రమాలు చేపట్టాలన్న అభిప్రాయాలను మంత్రులు వ్యక్తం చేశారు. ఈ ఏడాది తర్వాత, కొత్త కార్యక్రమాలు ప్రారంభించేందుకు అవసరమైన పనిని ప్రారంభించాలని తమ దేశ అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనలో వ్యాపారం, విద్యాసంస్థల ముఖ్య పాత్రను మంత్రులు గుర్తించారు.
5. తమ అభిప్రాయాల నేపథ్యంలో, కొత్త కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని మిగిలిన దేశాలకు మంత్రులు ముగ్గురు పిలుపునిచ్చారు.
***
(Release ID: 1650523)
Visitor Counter : 243