సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

‘జాతీయ నియామక సంస్థ’ పై ప్రభుత్వ నిర్ణయం గ్రామాలకు, పట్టణాలకు నియామకాలను తీసుకువచ్చే నియామక రంగంలో మార్పులను తీసుకువస్తుంది : డాక్టర్ జితేంద్ర సింగ్

ఇది కేవలం పరిపాలన సంస్కరణ మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక-ఆర్థిక సంస్కరణ కూడా అని నొక్కి చెప్పిన - డాక్టర్ జితేంద్ర సింగ్

నియామకాల విధానంలో నమూనా మార్పు తీసుకురావడానికీ, సరైన ఉద్యోగం పొందడంలో యువత ఆకాంక్షలను నెరవేర్చడానికీ జాతీయ నియామక సంస్థ సహాయపడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన - నిపుణులు.

Posted On: 31 AUG 2020 3:33PM by PIB Hyderabad

నియామక విధానంలో నమూనా మార్పును తీసుకురావడానికీ, సరైన ఉద్యోగాన్ని కనుగొనడంలో యువత ఆకాంక్షలను నెరవేర్చడానికీ, జాతీయ నియామక సంస్థ సహాయపడుతుందని, ఈ అంశంపై కోల్ ‌కతాలోని పత్రికా సమాచార కార్యాలయం నిర్వహించిన వెబి‌నార్‌లో నిపుణులు అభిప్రాయపడ్డారు.  నియామక రంగం మరియు విధాన దృక్పథం లలో జాతీయ నియామక సంస్థ యొక్క సామర్థ్యం మరియు పాత్ర గురించి విద్యావేత్తలతో సహా, పరిశ్రమ రంగం, ప్రభుత్వ రంగాలకు చెందిన నిపుణులు చర్చించారు.

కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (ఐ/సి), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా  ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖ శాఖల సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామాలకు, పట్టణాలకు నియామకాలను తీసుకువచ్చే ఈ నిర్ణయం నియామక రంగంలో ఒక మార్పును తీసుకువస్తుందని, పేర్కొన్నారు.  అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు, యువతకు జీవన సౌలభ్యాన్నీ బాగా పెంపొందించడానికి ఇది ఒక పరివర్తన ప్రయత్నం అని ఆయన వ్యాఖ్యానించారు.  మెరుగైన విద్యార్థుల నియామక ప్రక్రియపై, నియామక రంగంలో ఉత్తమ పద్ధతులపై ఆయన ఉద్ఘాటించారు.  డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ రిక్రూట్‌మెంట్ విధానంలో నమూనా మార్పును తీసుకురావడానికీ, సరైన ఉద్యోగం పొందడంలో యువత ఆకాంక్షలను తీర్చడానికీ, జాతీయ నియామక సంస్థ సహాయపడుతుందని, పేర్కొన్నారు.  ఇది కేవలం పరిపాలన సంస్కరణ మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక-ఆర్థిక సంస్కరణ కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. 

 

'జాతీయ నియామక సంస్థ మరియు దాని పాత్ర' అనే అంశంపై కోల్‌ కతాలోని పత్రికా సమాచార కార్యాలయం వెబినార్ నిర్వహించింది. 

"ఇది కేవలం పరిపాలన సంస్కరణ మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక-ఆర్థిక సంస్కరణ కూడా" అని  కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (ఐ/సి), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా  ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖ శాఖల సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.  

జాతీయ నియామక సంస్థ నిర్ణయంతో ఎస్‌.ఎస్.‌సి. మాజీ చైర్మన్ శ్రీ బ్రజ్ రాజ్ శర్మ ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఉద్యోగ ఎంపిక, నియామకాలు మరియు ఉద్యోగ అవకాశాలు మొత్తంగా చూడాలని అన్నారు. నియామకాల విలువను పెంపొందించడంతో పాటు, ఇది ఉద్యోగార్ధులు, నియామక సంస్థలు లేదా మానవ వనరుల సిబ్బంది ఎవరికైనా పరస్పర విజయాలను చేకూరుస్తుందని, ఆయన పేర్కొన్నారు.  ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‌తో ప్రారంభించడానికి మూడు ఏజెన్సీలు - స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్  కు సంబంధించిన నియామకాలు కలిసి ఉంటాయి.  117 ఆశాజనక జిల్లాల్లో పరీక్షా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు.  ఎక్కువ సంఖ్యలో మహిళా అభ్యర్థులు, దివ్యాంగులు, గ్రామీణ ప్రాంతాల వారు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సహించడానికి వీలుగా, బహుళ పరీక్షలకు హాజరుకావాల్సిన అవసరం లేకుండా, ప్రతి జిల్లాలో ఒకే పరీక్షకు హాజరుకావడంతో సహా,  విద్యార్థులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. 

 

జాతీయ నియామక సంస్థ నిర్ణయం, నియామకాల విలువను పెంపొందించడంతో పాటు, ఇది ఉద్యోగార్ధులు, నియామక సంస్థలు లేదా మానవ వనరుల సిబ్బంది ఎవరికైనా పరస్పరం విజయాలను చేకూరుస్తుందని, ఎస్.ఎస్.సి. మాజీ ఛైర్మన్ శ్రీ బ్రజ్ రాజ్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు,

రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే బోర్డు, మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు  సంయుక్త కార్యదర్శి శ్రీ ప్రేమ్ పాల్ శర్మ మాట్లాడుతూ, ఆశాజనక జిల్లాల్లో పరీక్షా మౌలిక సదుపాయాలలో ఉన్న సవాళ్ళ గురించి,  ప్రస్తావించారు.  ఉపాధి రంగ అవకాశాలలో గ్రామీణ అభ్యర్థులకు అవగాహన మరియు ప్రేరణ కల్పించడం ఈ చొరవ యొక్క సానుకూల అంశమని ఆయన అన్నారు.  ఉమ్మడి అర్హత పరీక్ష అభ్యర్థులు ఒకసారి హాజరుకావడానికి మరియు ఉన్నత స్థాయి పరీక్షల కోసం ఏదైనా లేదా అన్ని నియామక ఏజెన్సీలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. 

ఆశాజనక జిల్లాల్లో పరీక్షా మౌలిక సదుపాయాలలో ఉన్న సవాళ్ళ గురించి, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే బోర్డు, మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు  సంయుక్త కార్యదర్శి శ్రీ ప్రేమ్ పాల్ శర్మ ప్రస్తావించారు.

రైల్వే మంత్రిత్వ శాఖ పారిశ్రామిక సంబంధాల మాజీ సలహాదారుడు శ్రీ ఎ. నిగం మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వం తీసుకున్న జాతీయ విద్యా విధానం 2020 నిర్ణయం నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని పరిశీలించాలని, సూచించారు.   పాఠశాల స్థాయిలో వృత్తి శిక్షణ అనేది ఉద్యోగార్ధులకు మరిన్ని అవకాశాలను కల్పిస్తుంది. ప్రత్యేకమైన ఉద్యోగ వివరణ కోసం దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థి తమకు నచ్చిన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది.  కాబట్టి, ఇతర ప్రభుత్వ నియామకాలు, జాతీయ నియామక సంస్థ ఏర్పాటు నిర్ణయంతో కలిసి చేపట్టవలసి ఉంటుంది.  సరైన ప్రతిభ ఉన్న యువత దేశాభివృద్ధికి చాలా అవసరం కనుక ప్రపంచ రంగంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.  దేశం / సంస్థాగత స్థాయిలో సరైన హెచ్‌.ఆర్. ప్రణాళిక మరియు విశ్లేషణ చొరవ విజయానికి తోడ్పడుతుందని కూడా ఆయన అన్నారు.

 

ఇటీవల ప్రభుత్వం తీసుకున్న జాతీయ విద్యా విధానం 2020 నిర్ణయం నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని పరిశీలించాలని, రైల్వే మంత్రిత్వ శాఖ పారిశ్రామిక సంబంధాల మాజీ సలహాదారుడు శ్రీ ఎ. నిగం అభిప్రాయపడ్డారు; పాఠశాల స్థాయిలో వృత్తి శిక్షణ అనేది ఉద్యోగార్ధులకు మీరింతగా ఉపయోగపడుతుందనీ, ప్రత్యేకమైన ఉద్యోగ వివరణ కోసం దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థి తమకు నచ్చిన ఉద్యోగాన్ని కనుగొనడంలో కూడా సహాయపడుతుందని ఆయన వివరించారు.  

పి.ఐ.బి. రాంచీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ అరిమర్దన్ సింగ్ మాట్లాడుతూ, ఆరోగ్య రంగంలో మాదిరిగా నియామకాల రంగం, విద్యా రంగాల్లో పెట్టుబడులు మరియు సంస్కరణల ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నట్లు, పేర్కొన్నారు.  మెరుగైన హెచ్.‌ఆర్. నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం తోడ్పడుతుందని ఆయన అన్నారు.  ఒక పరీక్ష అంటే, బహుళ భాషలలో సి.ఈ.టి. ప్రస్తుతం ప్రతి పరీక్షలకు వేర్వేరు పాఠ్యాంశాల ప్రకారం వేర్వేరు పద్ధతిలో సిద్ధం కావడానికి అభ్యర్థులు ఎదుర్కొంటున్న భారాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని, ఆయన చెప్పారు. 

 

ఆరోగ్య రంగంలో మాదిరిగా నియామకాల రంగం, విద్యా రంగాల్లో పెట్టుబడులు మరియు సంస్కరణల ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నట్లు, పి.ఐ.బి. రాంచీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ అరిమర్దన్ సింగ్  పేర్కొన్నారు. 

జాతీయ నియామక సంస్థ సానుకూలతల గురించి,  ఏ.ఐ.బి.ఓ.సి. ప్రధాన కార్యదర్శి శ్రీ సౌమ్య దత్తా;  ఎస్.బి.ఐ మాజీ డి.జి.ఎం. మరియు సర్కిల్ అభివృద్ధి అధికారి, ఈశాన్య ప్రాంతం హెచ్.ఆర్ ఇన్-ఛార్జ్, శ్రీ ఆశిష్ బిస్వాస్, మాట్లాడుతూ,  ప్రాథమిక స్థాయిలో ఒక పరీక్ష ద్వారా బ్యాంకింగ్ రంగం యొక్క ప్రత్యేకమైన ఉద్యోగ ప్రొఫైల్ సహాయపడుతుందనీ, ఆ తర్వాత నిర్దిష్ట ఉద్యోగ వివరణ మరియు ప్రొఫైల్ కోసం సరైన అభ్యర్థిని ఉంచడానికి రెండవ స్థాయి, మూడవ స్థాయి పరీక్షలు సహాయపడతాయనీ, పేర్కొన్నారు.  వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు సరైన సమయంలో సరైన అభ్యర్థిని ఎన్నుకోవటానికి ఎన్.‌ఆర్.‌ఏ.  పాత్ర ఎంతో అవసరమని, వారి ప్రతిభకు, సామర్థ్యానికి తగినట్లుగా ఉద్యోగం పొందడంలో యువత డిమాండ్‌ను పరిష్కరించడంలో సహాయపడుతుందని శ్రీ బిస్వాస్ వివరించారు. 

జాతీయ నియామక సంస్థ యొక్క సమర్థత మరియు సామర్థ్యం సరైన సమయంలో మరియు సరైన సంస్థలో తమ ఎంపిక ప్రకారం ఉద్యోగాన్ని ఎన్నుకోవడంలో చురుకుగా ఉండాల్సిన ఉద్యోగార్ధులపై ఆధారపడి ఉంటుందని, పర్బో బర్ధమాన్ జిల్లా న్యాయమూర్తుల న్యాయస్థానం, న్యాయవాది శ్రీ సన్యుక్ బెనర్జీ పేర్కొన్నారు.   జాతీయ నియామక ఏజన్సీ లో అభ్యర్థుల పనితీరు వారు ఎంచుకున్న ఉద్యోగం పొందడానికి వారు చేసిన కృషికి ఒక కొలమానంగా ఉంటుందని ఆయన అన్నారు.  మహిళా అభ్యర్థులు మరియు దేశంలోని గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు చొరవ ప్రయోజనాల గురించీ, అభ్యర్థుల నియామక అవకాశాలను మరింత అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం ఎలా సహాయపడుతుందీ అనే విషయం గురించీ,  ఆయన చర్చించారు.   

ఢిల్లీ హైకోర్టు న్యాయవాది అబ్దుర్ రెహ్మాన్ మల్లిక్ మాట్లాడుతూ, ఈ దేశంలోని యువ జనాభాకు ఉద్యోగ అవకాశాలతో నియామక రంగంలో సంస్కరణలు భారత రాజ్యాంగం యొక్క సారాంశమైన - మానవ గౌరవంతో జీవించే హక్కు మరియు ఆ ప్రయత్నంలో స్వాగతించే చొరవ కు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. 

కోల్ ‌కతాలోని పత్రికా సమాచార కార్యాలయం నిర్వహించిన వెబి‌నార్ లో పాల్గొన్న - పర్బో బర్ధమాన్ జిల్లా న్యాయమూర్తుల న్యాయస్థానం, న్యాయవాది శ్రీ సన్యుక్ బెనర్జీ

కోల్ ‌కతాలోని పత్రికా సమాచార కార్యాలయం నిర్వహించిన వెబి‌నార్ లో పాల్గొన్న - ఢిల్లీ హైకోర్టు న్యాయవాది అబ్దుర్ రెహ్మాన్ మల్లిక్

మొత్తం వెబి‌నార్ ‌ను కోల్ ‌కతాలోని పి.ఐ.బి. డిప్యూటీ డైరెక్టర్ (ఎం & సి) శ్రీ సామ్రాట్ బందోపాధ్యాయ ల ప్రణాళిక మరియు సమన్వయంతో రూపొందించారు.  ఈ కార్యక్రమంలో - దూరదర్శన్ కోల్‌కతాకు చెందిన ఎ.డి.జి. (ఎం & సి), శ్రీమతి ఎం.ఎస్. జానే నామ్చు తో పాటు కోల్ కత్తా, ఆకాశవాణి; పి.ఐ.బి. రాంచీ; పి.ఐ.బి. పాట్నా లకు చెందిన అధికారులతో పాటు ఇతర ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రముఖ జర్నలిస్టులు పాల్గొన్నారు.

 

<><><>(Release ID: 1650229) Visitor Counter : 185