రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

కర్టెన్ రైజర్

ఉత్తర ప్రదేశ్‌లో దాదాపు రూ.4300 కోట్ల విలువైన 11 హైవే ప్రాజెక్టులకు శంకుస్థాప‌న‌, ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్న మంత్రి గ‌డ్క‌రీ

- మేటి కనెక్టివిటీతో వేగంగా అభివృద్ధి చెందడానికి మార్గం సుగమం చేయ‌నున్న ప్రాజెక్టులు

Posted On: 31 AUG 2020 2:19PM by PIB Hyderabad

 

కేంద్ర ర‌హ‌దారి రవాణా, జాతీయ రహదారులు, ఎంఎస్‌ఎంఈల శాఖ మంత్రి  శ్రీ నితిన్ గడ్కరీ రేపు ఉత్తర ప్రదేశ్‌లో 11 రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాప‌నలు చేయనున్నారు. వర్చువల్ విధానంలో జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షత వహించనున్నారు. ఆర్‌టీహెచ్ శాఖ స‌హాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వి.కె. సింగ్, యూపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్యతో స‌హా ఆ రాష్ట్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, లు కేంద్రం మరియు రాష్ట్ర ప్ర‌భుత్వాల ఉన్న‌తాధికారులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. కేంద్ర మంత్రి ప్రారంభోత్స‌వం, శంకుస్థాప‌నలు చేయ‌నున్న ఈ ర‌హ‌దారుల మొత్తం నిడివి 363 కి.మీ. మేర ఉండ‌నుంది. ఈ ర‌హ‌దారుల నిర్మాణ వ్య‌యం రూ.4281 కోట్లుగా ఉండ‌నుంది. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ అభివృద్ధికి మార్గం సుగమం చేస్తూ.. ఈ రహదారులు రాష్ట్రంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల‌తో మెరుగైన కనెక్టివిటీ, సౌలభ్యం మరియు ఆర్థిక వృద్ధిని మెరుగు పరుచ‌నున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రజలు మరియు వస్తువుల ర‌వాణా మెరుగుప‌డుతుంది. మ‌రీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలతో ర‌వాణా గణనీయంగా మెరుగ‌వుతుంది. మేటి రోడ్లు సమయం మరియు ఇంధనంలో పొదుపుకు దారితీస్తాయి. అలాగే కాలుష్య కారకాల ఉద్గారాలు కూడా తగ్గుతాయి. ఈ ప్రాజెక్టులో చేప‌ట్టే ప‌నుల‌లో ఇరుకైన రోడ్ల‌ను విస్తార‌ప‌ర‌చ‌డంతో పాటు పట్టణాలను ఎన్‌-రూట్‌లో విడదీసి మెరుగైన రహదారి అనుభూతిని క‌లిగించేందుకు దోహదం చేయ‌నున్నాయి.

                         

***



(Release ID: 1650026) Visitor Counter : 170