హోం మంత్రిత్వ శాఖ

కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్‌ నియంత్రణ చర్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఆరోగ్యం&కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సమీక్ష

Posted On: 29 AUG 2020 8:17PM by PIB Hyderabad

కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్‌, అండమాన్‌&నికోబార్‌ దీవులు, దాద్రా&నగర్‌ హవేలీ, డామన్‌&డయ్యులో కొవిడ్‌ నియంత్రణ చర్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఆరోగ్యం&కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి  సంయుక్తంగా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమావేశంలో రెండు శాఖలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

    కొవిడ్‌ పరీక్షల కోసం తీసుకుంటున్న చర్యలు, పాజిటివ్‌ కేసుల నిర్వహణ, ఐసోలేషన్‌, అందుబాటులో ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది వివరాలను కేంద్ర పాలిత ప్రాంత అధికారులు హోంశాఖ కార్యదర్శికి వివరించారు.

    పాలనాధికారులు, వైద్య నిపుణులు, పారా మెడికల్‌ సిబ్బంది, కొవిడ్‌ నియంత్రణలో పాల్గొంటున్న వర్గాలన్నీ సమన్వయంతో పనిచేసేలా చూడాలని అధికారులకు రెండు శాఖల కార్యదర్శులు సూచించారు.

    కొవిడ్‌ పరీక్షల సదుపాయాలు పెంచాలని, పాజిటివ్‌ కేసులను ప్రారంభంలోనే గుర్తించేలా పర్యవేక్షణ ఉండాలని, రోగులతో సంబంధం ఉన్నవారిని సమర్ధంగా గుర్తించాలని, ప్రతి ఇంటిపై పర్యవేక్షణ పెంచాలని, ఐసోలేషన్‌లో ఉన్నవారిపై గట్టి నిఘా ఉంచాలని, కంటైన్‌మెంట్‌ జోన్లలో స్పష్టమైన సరిహద్దులు, అమలు ఉండాలని, ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంచాలని, కరోనా నివారణ అవగాహన, వ్యక్తిగత గత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన తేవాలని చెప్పారు. సామాజిక దూరం, శానిటైజేషన్‌, మాస్కులు ధరించడం వంటి చర్యలు తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఆరోగ్యం&కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమ్మడిగా కేంద్ర పాలిత ప్రాంతాల సీనియర్‌ అధికారులకు సూచించారు.

***



(Release ID: 1649660) Visitor Counter : 189