ఆర్థిక మంత్రిత్వ శాఖ

జీఎస్‌టీఆర్ -2ఏ స‌మాచారం తెలుసుకునేలా సౌల‌భ్యం

Posted On: 29 AUG 2020 5:12PM by PIB Hyderabad

 

జీఎస్‌టీఆర్ -2ఏ లో రెండు కొత్త పట్టికలు చేర్చబడ్డాయి. విదేశాల నుండి దిగుమతి చేసుకున్న వ‌స్తువుల వివ‌రాలు మరియు సెజ్ యూనిట్లు / సెజ్ డెవలపర్ల నుండి తయారైన సామాగ్రి వివరాలను తెల‌ప‌డానికి వీలుగా
జీఎస్‌టీఆర్ -2ఏ ఫార‌ములో రెండు కొత్త పట్టికలు చేర్చబడ్డాయి. పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు వారి బిల్లు ఎంట్రీల వివ‌రాల‌ను ఐసీఈజీఏటీఈ సిస్టమ్ (కస్టమ్స్) నుండి జీఎస్‌టీ సిస్టమ్ (జీఎస్‌టీఎన్‌) ద్వారా వీక్షించవ‌చ్చు. కార్యాచరణ యొక్క అనుభూతిని ఇవ్వడానికి మరియు పన్ను చెల్లింపుదారుల నుండి అభిప్రాయాన్ని పొందడానికి వీలుగా ప‌రిశీల‌ణాత్మ‌క‌పు ప్రాతిపదికన ప్రస్తుత డేటా అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం, ఆగస్టు 6,2020 వరకు డేటాను సిస్ట‌మ్‌లో వీక్షించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అంతేకాకుండా, కంప్యూటరైజ్ చేయని పోర్టులలో (నాన్-ఈడీఐ పోర్టులు) మరియు కొరియర్ సేవలు / పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా దిగుమతి చేసుకున్న వాటి బిల్లుల యొక్క సమాచారం ఈ సిస్ట‌మ్‌లో ప్రస్తుతం అందుబాటులో లేదని పన్ను చెల్లింపుదారులు గమనించాల‌ని అధికారులు తెలిపారు. త్వరలో దీనిని అందుబాటులోకి తేనున్నారు. ఎంట్రీల బిల్లు వివరాలలో చేసిన సవరణ సమాచారం కూడా త్వరలో అందించబడుతుందని గమనించవచ్చు. జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు స్వీయ-సేవ పోర్టల్ నందు తమ అభిప్రాయాన్ని పంచుకోవాలని అధికారులు అభ్యర్థిస్తున్నారు. (https://selfservice.gstsystem.in/)
 

****



(Release ID: 1649552) Visitor Counter : 250