ఆర్థిక మంత్రిత్వ శాఖ
'సుస్థిరమైన ఆర్ధిక సహకారం'పై యూఎన్‌డీపీతో డీఈఏ సంప్రదింపులు
Posted On:
28 AUG 2020 10:45PM by PIB Hyderabad
'సుస్థిరమైన ఆర్ధిక సహకారం'(స్టైనబుల్ ఫైనాన్స్ కొలాబొరేటివ్) అనే అంశంపై ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) వారి సహకారంతో భారత ప్రభుత్వపు ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీఈఓ) ఆగస్టు 26, 2020న సంప్రదింపుల కార్యక్రమాన్ని ప్రారంభించింది. వర్చువల్ ప్లాట్‌ఫామ్‌పై ఆగస్టు 26, 27, 28 తేదీలలో ఈ సంప్రదింపుల కార్యక్రమం జరిగింది. ఇందులో 'సస్టైనబుల్ ఫైనాన్స్' యొక్క కొన్ని ముఖ్య అంశాలను చర్చకు తీసుకున్నారు. భారతదేశంలో 'సస్టైనబుల్ ఫైనాన్స్ ఆర్కిటెక్చర్' యొక్క విస్తృత పరిధి చుట్టూ కేంద్రీకృతమై అనేక నేపథ్యలపై చర్చలు జరిగాయి. ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్, బ్లెండెడ్ ఫైనాన్స్ సాధనల పాత్ర, సుస్థిర అభివృద్ధికి గ్రీన్ ఫైనాన్స్ సాధనాలు, పర్యావరణపరంగా స్థిరమైన కార్యకలాపాల వర్గీకరణ అవసరం, కార్పొరేట్‌ల సుస్థిరతకు సంబంధించిన అంశాల బహిర్గతం మరియు కొత్త మరియు వినూత్న ఫైనాన్సింగ్‌ను అమలు చేయడానికి అడ్డంకులు వంటి కీలకమైన అంశాలపై ఈ కార్యక్రమంలో సంప్రదింపులు, చర్చలు జరిగాయి. ఆర్ధిక రంగంపై వాతావరణ మార్పు మరియు ఇతర పర్యావరణ మరియు సామాజిక సమస్యల వల్ల కలిగే రిస్క్‌లపై కూడా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 220 మంది ప్రతినిధులు, భారత ఆర్థిక రంగ నియంత్రణదారులు, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు, ద్వైపాక్షిక భాగస్వామి ఏజెన్సీలు, యూఎన్ సంస్థలు, ఆర్థిక సంస్థలు, ప్రభావం మరియు వాణిజ్య పెట్టుబడిదారులు, కార్పొరేట్లు, పరిశ్రమ సంఘాలు, సివిల్ సొసైటీ సంస్థలు మరియు విద్యా సంస్థలు ఈ సంప్రదింపుల కార్యక్రమంలో పాల్గొన్నాయి. భారతదేశం కోసం సస్టైనబుల్ ఫైనాన్స్ ఫ్రేమ్‌వర్క్ / రోడ్ మ్యాప్‌ను అభివృద్ధి చేయడంలో తగు విధంగా సహాయ పడేలా విలువైన అంతర్దృష్టులు మరియు స్పష్టమైన సిఫార్సులను ఈ వినూత్న కార్యక్రమం అందించింది.
****
(Release ID: 1649468)
Visitor Counter : 183