మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన జవహర్ ‌లాల్ నెహ్రూ వైద్య కళాశాల (జె.ఎన్.‌ఎం.సి) పరీక్షా కేంద్రాన్ని ఆన్ లైన్ ద్వారా ప్రారంభించిన - కేంద్ర విద్యాశాఖ మంత్రి.

Posted On: 27 AUG 2020 9:03PM by PIB Hyderabad

అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన జవహర్ ‌లాల్ నెహ్రూ వైద్య కళాశాల (జె.ఎన్.‌ఎం.సి) పరీక్షా కేంద్రాన్ని, కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' వీడియో కాన్ఫరెన్సు మాధ్యమం ద్వారా ప్రారంభించారు.  రెండు కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో ఈ పరీక్షా కేంద్రాన్ని నిర్మించారు. 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, కోవిడ్-19 కారణంగా ప్రపంచం మొత్తం అసాధారణమైన ఇబ్బందులను, ముఖ్యంగా విద్య మరియు అభ్యాస రంగాలలో ఎదుర్కొంటున్నప్పటికీ, ; మన అధ్యయన కేంద్రాలు, విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కోకూడదని ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేర్కొన్నారు.  స్వాతంత్య్ర పోరాటంలో అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏ.ఎమ్.యు) కీలక పాత్ర పోషించిందనీ, ఇప్పటికీ, ఈ విశ్వవిద్యాలయం, దేశభక్తి యొక్క బలమైన భావాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు.  ఈ విశ్వవిద్యాలయ విద్యా నైపుణ్యం దీనిని అమూల్యమైన జాతీయ ఆస్తిగా రూపొందించిందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారితో దేశం యావత్తూ బాధపడుతున్న సమయంలో ఈ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య కళాశాల కొత్త ఆశలను రేకెత్తించిందని, కేంద్ర మంత్రి ప్రశంసించారు.  కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, నిరంతర సానుకూల దృక్పధంతో, సర్వతోముఖాభివృద్ధి సాధించినందుకు ఏ.ఎం.యు వైస్ ఛాన్సలర్ ‌ను ఆయన అభినందించారు.

ఈ విశ్వవిద్యాలయం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అభివృద్ధి చెందుతుందనీ, మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందనీ, జ్ఞానం, విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక ఆవిష్కరణలతో ప్రపంచ స్థాయిలో ఒక ఆదర్శ విశ్వవిద్యాలయంగా రూపొందుతుందనీ, మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.  ప్రస్తుత క్లిష్ట సమయాల్లో కూడా యువత జ్ఞాన సముపార్జనకే కట్టుబడి ఉండాలన్న ఆశయాన్ని ప్రోత్సహిస్తున్న విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులను మంత్రి కరోనా యోధులుగా అభివర్ణించారు.  

ఈ పరీక్షా కేంద్రం ప్రారంభోత్సవంతో, జె.ఎన్.‌ఎం.సి యొక్క దీర్ఘకాల సమస్య పరిష్కారమైందని శ్రీ పోఖ్రియాల్ ప్రత్యేకంగా పేర్కొన్నారు.  ఈ కళాశాలకు చెందిన వైద్య విద్యార్థులు ఉన్నత శిఖారాలను అధిరోహిస్తారనీ, దేశం గర్వపడే విధంగా అభివృద్ధి చెందుతారనీ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.  దేశంలో ప్రపంచ స్థాయి విద్యను నిర్ధారించే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానం (ఎన్.ఈ.పి) కు అనుగుణంగా భారతదేశాన్ని అంతర్జాతీయ నాలెడ్జ్ సూపర్ పవర్ ‌గా మార్చాలనే మన ఆశయాన్ని నెరవేర్చగల సామర్థ్యం జె.ఎన్.‌ఎం.సి. మరియు ఎ.ఎమ్.‌యు. లకు ఉందని ఆయన పేర్కొన్నారు. 

*****



(Release ID: 1649409) Visitor Counter : 162