వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ప్రజా పంపిణీలో సంస్కరణల పథకాలపై 'ఆహారం&ప్రజా పంపిణీ' విభాగం ఆధ్వర్యంలో సాధికార కమిటీ సమావేశం ఎఫ్‌పీఎస్‌ ఆటోమేషన్, ఓఎన్‌ఓఆర్‌సీ ప్రణాళిక పురోగతిపై సమీక్ష

Posted On: 28 AUG 2020 7:35PM by PIB Hyderabad

ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై 'ఆహారం&ప్రజా పంపిణీ' విభాగం కార్యదర్శి ఆధ్వర్యంలో సాధికార కమిటీ సమావేశం జరిగింది. సభ్యులుగా ఉడాయ్‌ సీఈవో, ఎన్‌ఐసీ డీజీ, నాలుగు రాష్ట్రాల కార్యదర్శులు; కేంద్ర ఎలక్ట్రానిక్స్‌&సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ, ఎఫ్‌సీఐ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 'ఒకే దేశం, ఒకే రేషన్‌ కార్డు' (ఓఎన్‌ఓఆర్‌సీ) ప్రణాళిక కింద, 'ప్రజా పంపిణీ పథకం సమగ్ర నిర్వహణ' (ఐఎంపీడీఎస్‌)ను సమీక్షించడానికి, ప్రణాళిక పొడిగింపును ఆమోదించడానికి సమావేశం నిర్వహించారు. ఐఎంపీడీఎస్ కింద చేసిన పనిని కొనసాగిస్తూనే బలోపేతం చేసేలా, వచ్చే ఏడాది మార్చి తర్వాత కూడా కొనసాగించడంపై సమావేశంలో చర్చించారు.

    ఎఫ్‌పీఎస్‌ ఆటోమేషన్‌, ఓఎన్‌ఓఆర్‌సీ ప్రణాళిక పురోగతి, ఆధార్‌ అనుసంధానం, వలస కూలీలు సొంతంగా పేరు నమోదు చేసుకుని 'ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు' ప్రయోజనం పొందేలా మొబైల్‌ అప్లికేషన్‌ రూపకల్పనపైనా సమావేశంలో చర్చించారు. 'ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు' ప్రణాళిక కింద వలస కూలీలకు సాయం అందించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హెల్ప్‌లైన్‌ నంబర్‌ను కూడా ప్రారంభించాలని యోచిస్తున్నారు.    

    ప్రతిపాదిత ఐఎంపీడీఎస్‌ పొడిగింపు కాలంలో, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిధుల అవసరాలను కూడా కేంద్రం తీరుస్తుంది.

***


(Release ID: 1649387)