నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

ఏరీస్ 6వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఆన్ లైన్ మాధ్యమం ద్వారా తిలకించిన - విద్యుత్ మంత్రి.

ఏరీస్ వెబ్ ‌సైట్ మరియు టెలిఫోన్ డైరెక్టరీ లను ఆవిష్కరించిన - విద్యుత్ మంత్రి.

పునరుత్పాదక విద్యుత్తు ప్రయోజనాల గురించి అవగాహన వ్యాప్తిచేయాలని ఏరీస్ కు పిలుపునిచ్చిన - శ్రీ ఆర్ కె సింగ్.

డిమాండును పెంచడం మరియు ఉత్పత్తి సౌకర్యాలను పెంపొందించడం ద్వారా పునరుత్పాదక విద్యుత్తు నిల్వ ధరలు తగ్గుతాయి: శ్రీ సింగ్.

నిల్వను ప్రోత్సహించే 24 గంటల పునరుత్పాదక విద్యుత్తు కోసం ఆర్.పి.ఓ. కలిగి ఉండాలని ప్రతిపాదించిన - శ్రీ ఆర్ కె సింగ్.

Posted On: 28 AUG 2020 3:15PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్తు, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి, రాష్ట్రాల పునరుత్పాదక విద్యుత్తు సంస్థల సంఘం ఎక్స్-అఫీషియో పేట్రన్  శ్రీ ఆర్.కె. సింగ్ 2020 ఆగష్టు, 27వ తేదీన ఏరీస్ 6వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఆన్ ‌లైన్ మాధ్యమం ద్వారా తిలకించారు.  ఏరీస్ వెబ్‌సైట్  www.areas.org.in మరియు ఏరీస్ టెలిఫోన్ 

డైరెక్టరీ లను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. 

పునరుత్పాదక విద్యుత్తు యొక్క భవిష్యత్తు గురించి శ్రీ సింగ్ మాట్లాడుతూ, “పునరుత్పాదక శక్తి ఈ రోజు ఆర్థికంగా లాభదాయకంగా ఉంది.  నిల్వ అనేది మాత్రమే ఒక అనుబంధ అంశంగా ఉంది.   నిల్వ ధరలు కాలక్రమేణా తగ్గుతాయి.  డిమాండును పెంచడం మరియు ఉత్పత్తి సదుపాయాలను పెంపొందించడం ద్వారా మనం నిల్వ ధరలను తగ్గించాలి.  అది జరిగితే, పునరుత్పాదకతల్లో మార్పు వేగవంతమౌతుంది.  అప్పుడు, మరిన్ని భవిష్యత్ ప్రాజెక్టులు వాటితో నిల్వ కలిగి ఉంటాయి. నిల్వను ప్రోత్సహించే 24 గంటల పునరుత్పాదక విద్యుత్తు కోసం ఆర్.పి.ఓ. కలిగి ఉండాలని నేను ప్రతిపాదిస్తున్నాను." అని పేర్కొన్నారు.   పునరుత్పాదక శక్తి ద్వారా విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హోర్డింగులు, రేడియో / టీవీ ప్రకటనలతో సహా ఒక ప్రచార ప్రణాళికను ప్రారంభించడం వంటి కార్యకలాపాలను ఏరీస్ చేపట్టాలని కూడా ఆయన సూచించారు.  ఇది వారి  విద్యుత్తు ఖర్చులను తగ్గిస్తుందనీ, పర్యావరణానికి మంచిదనీ ప్రజలకు అవగాహన కల్పించాలి.  ఈ మంత్రిత్వ శాఖ ఏరీస్ కు అదనపు కార్పస్ ఫండ్‌ను అందించగలదు.  పునరుత్పాదక ఇంధన రంగ సమస్యలపై చర్చించడానికీ, సాధ్యమైన వినూత్న పరిష్కారాలతో ముందుకు రావడానికీ, ఏరీస్ త్రైమాసికంలో కనీసం ఒకసారైనా మేధో మధన కార్యక్రమాలు నిర్వహించాలి.

ఒకరి అనుభవాల నుండి ఒకరు పరస్పరం సంభాషించడానికీ, నేర్చుకోవడానికీ, సాంకేతికతలు మరియు పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి వారి ఉత్తమ పద్ధతులు మరియు జ్ఞానాన్ని పంచుకోవడానికీ, ఎమ్.ఎన్.ఆర్.ఈ. చొరవపై  రాష్ట్రాల పునరుత్పాదక విద్యుత్తు సంస్థల సంఘం  (ఏరీస్) ఏర్పడింది.  సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం 1860 కింద ఏరీస్ ను 2014 ఆగష్టు, 27వ తేదీన నమోదు చేయడం జరిగింది.  కేంద్ర విద్యుత్తు, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి, రాష్ట్రాల పునరుత్పాదక విద్యుత్తు సంస్థల సంఘం ఎక్స్-అఫీషియో పేట్రన్ గా, ఎమ్.ఎన్.ఆర్.ఈ. కార్యదర్శి ఈ సంఘం ఎక్స్-అఫీషియో అధ్యక్షునిగా, వ్యవహరిస్తున్నారు.   అన్ని ఎస్‌.ఎన్.‌ఏ. లు (స్టేట్ నోడల్ ఏజెన్సీలు) ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. 

ఎస్.ఎన్.ఏ. ల మధ్య పరస్పర చర్య, అనుభవం, పరిజ్ఞానం యొక్క భాగస్వామ్యం ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకుని, ప్రాంతాలను తిరిగి ఉత్తేజపరిచేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది.  గత రెండు నెలల్లో ఆన్ ‌లైన్ మాధ్యమం ద్వారా నాలుగు సమావేశాలు / కార్యశాలలు నిర్వహించబడ్డాయి.  ఏరీస్ సరైన పనితీరు కోసం, 2020 జులై, 30వ తేదీన జరిగిన సమావేశంలో ఉపాధ్యక్షుడు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏరీస్ జనరల్ బాడీ ఎంపిక చేసింది.  

*****(Release ID: 1649337) Visitor Counter : 155