విద్యుత్తు మంత్రిత్వ శాఖ

పోసోకోలో మహిళా ఉద్యోగులు పోషించిన అసాధారణ పాత్రను గుర్తిస్తూ, ఒక వేడుకగా - పోసోకో నారీ శక్తి వీడియోను విడుదల చేసింది

Posted On: 28 AUG 2020 2:55PM by PIB Hyderabad
పోసోకో (పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్), కేంద్ర విద్యుత్ శాఖ కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్‌యు). దీనిలో మహిళా ఉద్యోగులు పోషించిన అసాధారణ పాత్రను గుర్తిస్తూ, ఒక వేడుకగా - పోసోకో నారీ శక్తి వీడియోను విడుదల చేసింది. ఆ సంస్థ కార్పొరేట్ కేంద్ర కార్యాలయం డైరెక్టర్ హెచ్ఆర్ మీనాక్షి దావర్ వీడియోని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోసోకో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.ఎస్.బాబా, సిస్టం ఆపరేషన్ డైరెక్టర్ ఎస్.ఆర్.నరసింహన్, మార్కెట్ ఆపరేషన్ డైరెక్టర్ ఎస్.ఎస్.బార్పాండా, డైరెక్టర్-ఫైనాన్స్ ఆర్.కె .శ్రీవాస్తవ, సలహాదారుడు ఎస్.కె. సోనీ, పోసోకో అధికారులు, ట్రైనీలు పాల్గొన్నారు. 
మీనాక్షి దావర్ మాట్లాడుతూ, “నేడు మహిళలు మిశ్రమ లింగ జట్లపై మరింత స్పష్టమైన ప్రభావాన్ని ఎలా పొందాలో గుర్తించే సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ లక్ష్యాలను సాధించడానికి పోసోకో మహిళలకు ఉత్తమ అవకాశాలను అందిస్తుంది. సాంప్రదాయిక కల్పనలను సవాలు చేయడానికి, జట్లను ప్రేరేపించడానికి వారిని ప్రోత్సహిస్తారు; వారి ఆలోచనలను కార్యాచరణ లక్ష్యాలు, ఫలితాలలోకి మార్చడానికి వారిని ప్రోత్సహిస్తారు” అని తెలిపారు. "పోసోకోలోని మహిళలు తమ పని, వారి నాయకత్వం ద్వారా వారు సంస్థపై భారీ ప్రభావాన్ని చూపగలరని రుజువుచేసారు. పోసోకోలోని మహిళలందరి సంస్థ నిబద్ధత, సహకారాన్ని నేను అభినందిస్తున్నాను”అని ఆమె తెలిపారు. 
 

మీనాక్షి దేవర్ మానవ సంబంధాల రంగంలో కనబర్చిన ప్రతిభను గుర్తించి అనేక సంస్థలు అనేక అవార్డులను అందజేశాయి. 

ఎస్.ఆర్.ఎల్.డి.సి సీనియర్ జనరల్ మేనేజర్ టి. కళానిధి మాట్లాడుతూ, పోసోకో జ్ఞాన ఆధారిత సంస్థని, అటువంటి సంస్థలో ఒక అభిరుచితో కూడిన ఆలోచనలు గల ఇంజనీర్ల బృందానికి నాయకత్వం వహించడానికి, విభిన్న పాత్రలను చేపట్టడానికి, వివిధ సవాళ్లను ఎదుర్కొనేందుకు నన్ను అనుమతించిన యాజమాన్యానికి కృతజ్ఞతలు" అని చెప్పారు. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సి. రీతి నాయర్ కూడా ప్రసంగించారు. 

వీడియో ను https://posoco.in/video-gallery/ లింక్ ద్వారా వీక్షించవచ్చు. 

                                                                                                                           ****



(Release ID: 1649274) Visitor Counter : 169