వ్యవసాయ మంత్రిత్వ శాఖ

1082.22 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఖరీఫ్ పంటల సాగు

- గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 7.15 శాతం మేర ‌పెరిగిన వి‌స్తీర్ణం

Posted On: 28 AUG 2020 3:45PM by PIB Hyderabad

ప్ర‌స్తుత ఖరీఫ్ సీజ‌న్‌ సాగు విస్తీర్ణంలో సంతృప్తికరమైన పురోగతి క‌నిపిస్తోంది. ఈ సీజ‌న్‌లో పంట‌ల సాగు ప‌రిస్థితి కింద వివరించ‌బ‌డింది:

ఖరీఫ్ పంటల విస్తరణ విస్తీర్ణం: ఈ నెల 28వ తేదీ నాటికి (28.08.20) దేశంలో  మొత్తం 1082.22 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఖరీఫ్ పంటలు విత్త‌బ‌డినాయి. గత ఏడాది ఇదే కాలంలో 1009.98 లక్ష‌ల‌ హెక్టార్ల విస్తీర్ణంలో మాత్ర‌మే నాట్ల‌ను వేశారు. దీంతో సాగు విస్తీర్ణం ప్ర‌స్తుత సీజ‌న్‌లో 7.15 శాతం పెరిగిన‌ట్ట‌యింది. ఆయా పంటల‌ వారీగా సాగు విస్తీర్ణం వివ‌రాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

వ‌రి: గత ఏడాది ఇదే కాలంలో 354.41 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ‌రి పంట సాగు చేయ‌గా.. ఈ సీజ‌న్‌లో వ‌రి సాగు దాదాపు 389.81 లక్షల హెక్టార్ల‌కు పెరిగింది. దీనిని బ‌ట్టి విశ్లేషించి చూస్తే.. ఈ పంట సాగు వి‌స్తీర్ణం 35.40 ల‌క్ష‌ల హెక్టార్ల మేర‌ పెరిగిన‌ట్ట‌యింది.

పప్పుధాన్యాలు: గత ఏడాది ఇదే కాలంలో 128.65 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పప్పుధాన్యాలు సాగు చేయ‌గా.. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 134.57 లక్షల హెక్టార్ల‌లో ప‌ప్పుధాన్యాల సాగు జ‌రిగింది. అంటే.. ఈ పంట‌ల సాగు విస్తీర్ణం గ‌త ఏడాదితో పోలిస్తే 5.91 ల‌క్ష‌ల హెక్టార్లలో పెరిగింది.

ముతక తృణ ధాన్యాలు: గత సంవత్సరం ఇదే కాలంలో 172.49 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ముతక తృణ ధాన్యాలు సాగు చేయ‌గా.. ఈ ఏడాది 176.89 లక్షల హెక్టార్ల మేర విస్తీర్ణంలో సాగు చేశారు. అనగా.. గ‌త ఏడాదితో పోలిస్తే 4.40 ల‌క్ష‌ల హెక్టార్ల విస్తీర్ణంలో అధికంగా ఈ పంట‌లు సాగు చేయ‌బ‌డినాయి. ‌

నూనె గింజలు: గత ఏడాది ఇదే కాలంలో 170.99 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో నూనె గింజ‌ల పంట‌లు సాగ‌వ‌గా.. ఈ సీజ‌న్‌లో నూనె గింజ‌ల పంట‌ల‌ విస్తీర్ణం 193.29 లక్షల హెక్టార్లకు పెరిగింది. అంటే.. దాదాపు 22.30 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో నూనె గింజ‌ల పంట‌లు అధికంగా సాగు చేయ‌బ‌డినాయి.

చెరకు: గత ఏడాది ఇదే కాలంలో చెర‌కు పంట 51.68 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగ‌వ‌గా.. ఈ సీజ‌న్‌లో ఇది 52.29 లక్షల హెక్టార్ల‌కు చేరింది. అనగా.. గ‌త ఏడాదితో పోలిస్తే ఈ పంట సాగు విస్తీర్ణం 0.61 ల‌క్ష‌ల హెక్టార్ల మేర పెరిగింది.

జనపనార & మేస్తా: గత ఏడాది ఇదే కాలంలో 6.86 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో జ‌నప‌నార‌ మ‌రియు మేస్తా సాగ‌వ‌గా.. ఇది ప్ర‌స్తుత సీజ‌న్‌లో ఇది 6.97 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి చేరింది. అంటే.. దేశంలో ఈ పంటల‌ విస్తీర్ణం 0.11 ల‌క్ష‌ల హెక్టార్ల‌ మేర పెరిగింది.

పత్తి: గత ఏడాది ఇదే కాలంలో 124.90 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప‌త్తి సాగ‌వ‌గా ఈ ఏడాది ఖ‌రీఫ్‌లో ఇది 128.41 లక్షల హెక్టార్ల‌కు చేరింది. అనగా 3.50 ల‌క్షల‌ హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పంట ‌సాగు పెరిగిన‌ట్ట‌యింది.

కేంద్ర జ‌ల‌ కమిషన్ నివేద‌క‌ ప్రకారం, దేశంలోని 123 జలాశయాలలో ప్రత్యక్ష నీటి నిల్వ ల‌భ్య‌త గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే 102 శాతంగా ఉంది.
 
వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

***

 


(Release ID: 1649272) Visitor Counter : 298