జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్' అమలు విష‌య‌మై గోవా ముఖ్యమంత్రితో వీసీ ద్వారా సంయుక్త సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి

- 2020-21 నాటికి గోవాలో 100% గృహాలకు కుళాయి కనెక్షన్ల అంద‌జేత

Posted On: 27 AUG 2020 7:45PM by PIB Hyderabad

గోవాలో 'జల్ జీవన్ మిషన్' అమలు తీరుపై చర్చించేందుకు గాను కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్‌తో ఒక స‌మావేశం నిర్వ‌హించారు. దేశంలోని ప్రతి గ్రామీణ గృహాలకు తాగునీరు అందించే దిశ‌గా కేంద్రం ఆయా రాష్ట్రాల వారి భాగస్వామ్యంతో  జల్ జీవన్ మిషన్‌ను (జేజేఎం) అమలు చేస్తోంది. మిషన్ యొక్క లక్ష్యం సార్వత్రిక కవరేజ్.. అనగా గ్రామంలోని ప్రతి కుటుంబానికి వారి గృహాలలో నీటి పంపు కనెక్షన్ అందించ‌డం. జల్ జీవన్ మిషన్ యొక్క ప్ర‌ధాన  ఉద్దేశం ఏమిటంటే, ప్రతి గ్రామీణ గృహంలో గ్రామీణ వర్గాల జీవన ప్రమాణాల మెరుగుదలకు దారి తీసేలా సరసమైన సేవా డెలివరీ ఛార్జీల వద్ద రెగ్యులర్‌గా మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన తగిన పరిమాణంలో తాగునీటి సరఫరా ఉండేలా చూడటం. గ్రామీణ నీటి సరఫరా వ్యూహం, నీటి భద్రత మరియు నీటి మౌలిక సదుపాయాల అమలులో రాష్ట్రాలకు సహాయం చేయడానికి, త‌గిన అధికారం ఇవ్వడానికి మరియు ప‌నుల సులభతరం చేయడానికి గాను జల్ శక్తి మంత్రిత్వ శాఖ క్రమంగా మిష‌న్ పురోగతిని సమీక్షిస్తోంది.
ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌లను అందిస్తాం
2020-21 నాటికి గోవా అన్ని గృహాలకు 100% ట్యాప్ కనెక్షన్లను ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలోని 2.6 లక్షల గృహాలలో, 2.29 లక్షల ఇండ్ల‌కు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. 2019-20లో రాష్ట్రం 1025 గృహల‌కు ట్యాప్ కనెక్షన్లను అందించింది. 2020-21లో ఇప్పటి వరకు 4,500 గృహాలకు కుళాయి కనెక్షన్లు అందించారు. గోవా రాష్ట్రంలో మిషన్ ప‌నుల పురోగతిపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో సవివరంగా చర్చించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన గృహాలకు ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌లను అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మిషన్ లక్ష్యాన్ని సాధించడానికి ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని ర‌కాల‌ సహాయం అందించడానికి కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తాగునీరు అందించడం ప్రభుత్వానికి జాతీయ ప్రాధాన్యతని మంత్రి పేర్కొన్నారు. జేజేఎంను వేగంగా అమలు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తగిన పరిమాణంలో తాగునీరు లభిస్తుందని, దీర్ఘకాలిక ప్రాతిపదికన వారి ఇళ్లలో క్రమం తప్పకుండా నిర్దేశించిన నాణ్యత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫ‌లితంగా అక్క‌డ నివ‌సించే తల్లులు, సోదరీమణులు మరియు ఆడ బిడ్డ‌ల‌కు మంచి అర్హతగల ‘జీవన సౌలభ్యం’తో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని భరోసా ఇవ్వడం జ‌రుగుతుంద‌ని అన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల గృహాలను కుళాయి కనెక్షన్లను అందించాల‌ని కేంద్ర మంత్రి అభ్యర్థించారు. ఇందుకు క్యాంపెయిన్ మోడ్‌లో ప‌ని చేయాల‌ని ఆయ‌న కోరారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలు, ఆశాజనక జిల్లాలు, ఎస్సీ / ఎస్టీ ఆధిపత్యపు గ్రామాలు / ఆవాసాలు & సంస‌ద్ ఆదర్శ్ గ్రామ యోజనలోని గ్రామాలలో సంతృప్త గ్రామాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీ షెకావత్ కోరారు.
తాగునీటి వ‌న‌రుల‌ను బ‌లోపేతం చేయండి..
సుస్థిర‌మైన తాగు నీటి స‌ర‌ఫ‌రా విధానం కోసం ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న తాగునీటి వ‌న‌రుల‌ను బ‌లోపేతం చేయాల‌ని కేంద్ర మంత్రి శ్రీ షెకావత్ గోవా రాష్ట్ర ముఖ్య‌మంత్రిని కోరారు. ఇందుకు ఎంజీఎన్‌ఆర్ఈజీఎస్, జేజేఎం, ఎస్‌బీఎం (జీ), పీఆర్‌ఐలకు 15 వ ఎఫ్‌సి గ్రాంట్లు, జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి, కంపా, సీఎస్ఆర్ ఫండ్, లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్ మొదలైన ప‌థాకాల నిధుల మేళ‌వింపుతో చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. ప్రతి గ్రామంలో వనరుల బలోపేతం చేయ‌డంతో పాటుగా మరియు గ్రేవాట‌ర్ నిర్వహణావసరాన్ని మంత్రి నొక్కి ‌చెప్పారు. గ్రామాల్లో నీటి సరఫరాను కొలవడానికి మరియు త‌గిన స‌ర‌ఫ‌రా పర్యవేక్షించడానికి సెన్సార్ ఆధారిత ఐఓటీ పరిష్కారాలను పైలట్ ప్రాతిపదికన ప్రారంభించాల‌ని తెలిపారు. రాష్ట్రంలో నీటి సరఫరా యొక్క అధిక ఆపరేషన్ మరియు నిర్వహణ వ్యయంపై మంత్రి తన ఆందోళనలను వ్య‌క్తం చేశారు. ప్రజల కోసం నీటి పరీక్షా ప్రయోగశాలలను తెరవాలని, అందువల్ల ప్రజలు త‌మ నీటిని సరసమైన రేటుకు పరీక్షించవచ్చని కోరారు. క్రమం తప్పకుండా నీటి సరఫరాకు భరోసా ఇవ్వడం ద్వారా మరియు మేటి ప్రతిస్పంద‌న క‌లిగిన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థతో ప్రజా వినియోగ నీటి సేవా పంపిణీలో గోవా రాష్ట్రం నమూనా రాష్ట్రంగా మారగలదన్న విష‌యాన్ని మంత్రి ఈ సంద‌ర్భంలో ప్రాధానంగా ప్ర‌స్త‌వించారు.


 

*****


(Release ID: 1649086) Visitor Counter : 135