రైల్వే మంత్రిత్వ శాఖ
భారతీయ రైల్వే 2030 నాటికి తన 33 బిలియన్ యూనిట్లకు పైగా ఇంధన అవసరాలను తీర్చేందుకు సిద్ధం.
ప్రస్తుత వార్షిక అవసరం సుమారు 21 బిలియన్ యూనిట్లు.
భారతీయ రైల్వే చే సౌర విద్యుత్ అభివృద్ధి దారుల సమావేశం ఏర్పాటు.
రైల్వేలకు చెందిన ఆక్రమణలు లేని ఖాళీ స్థలాలలో సౌరవిద్యుత్ ప్లాంటుల ఏర్పాటుకు సౌరవిద్యుత్ డవలపర్లకు అన్ని విధాలుగా మద్దతునివ్వనున్న భారతీయ రైల్వే .
రైల్వే ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన సౌరవిద్యుత్ అభివృద్ధిదారులు. 2030 నాటికి భారతీయ రైల్వేని కార్బన్ ఉద్గారాల విడుదల లేని వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రైల్వేతో భాగస్వామ్యం .వహించేందుకు తమ ఆకాంక్షలను తెలిపిన సౌర విద్యుత్ అభివృద్ధిదారులు.
2023 నాటికి నూరుశాతం విద్యుదీకరణను సాధించేందుకు లక్ష్యం నిర్దేశించుకున్న రైల్వే శాఖ.
భారతీయ రైల్వే తనకుగల ఖాళీ స్థలాలను ఉపయోగించుకుని 20 గిగా వాట్ల సామర్ధ్యంగల సౌరవిద్యుత్ ప్లాంట్లను స్థాపించేందుకు భారతీయ రైల్వే వద్ద మెగా ప్రణాళిక.
ఆత్మనిర్భర్ పథంలో భారతీయ రైల్వే.
Posted On:
27 AUG 2020 3:43PM by PIB Hyderabad
భారతీయ రైల్వే తన పూర్తి విద్యుత్ అవసరాలకు అనుగుణంగా, నూరు శాతం స్వయం సమృద్ది సాధించాలనే లక్ష్యంతోపాటు , జాతీయ సౌరవిద్యుత్ లక్ష్యాల సాధనకు తనవంతు సహకారం అందించేందుకు,రైల్వే , వాణిజ్యం,పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ అధ్యక్షతన కీలక స్టేక్ హోల్డర్లతో విస్తృతస్థాయి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది.
భారతీయ రైల్వే తన ట్రాక్షన్ విద్యుత్ అవసరాలకు సౌరవిద్యుత్‌ను వినియోగించుకునేందుకు తద్వారా పూర్తిగా కాలుష్య రహిత హరిత రవాణా వ్యవస్థగా మారేందుకు కట్టుబడి ఉంది.
ఈ సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాలు కిందివిధంగా ఉన్నాయి.
1. రైల్వే ట్రాక్ వెంబడి సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి వినూత్న పరిష్కారాలు
2. 2030 నాటికి కార్బన్ ఉద్గారాలు ఏమాత్రం లేని వ్యవస్థగా రైల్వేని తీర్చిదిద్దేందుకు 20 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని సాధించేందుకు వీలున్న విద్యుత్ ప్రొక్యూర్‌మెంట్ మార్గాలు,
3. భారతీయ రైల్వే చే భారీ సౌరవిద్యుత్‌ప్లాంట్ల ఏర్పాటులో గల సవాళ్లు
దేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి నాయకత్వం వహించడంలో భారతీయ రైల్వే కృషిని సౌర విద్యుత్ అభివృద్దిదారులు ప్రశంసించారు. 2030 నాటికి ఏమాత్రం కార్బన్ ఉద్గారాలు లేని హరిత రవాణా వ్యవస్థ గా మారేందుకు రైల్వే సాగిస్తున్న ప్రయాణానికి తమ పూర్తి మద్దతును వారు వ్యక్తం చేశారు.
రైల్వే తీసుకుంటున్న చర్యలు, ఇటీవల గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశాలకు అనుగుణంగా, రైల్వే స్టేషన్లను సౌరవిద్యుదీకరించడం, రైల్వే ఖాళీస్థలాలను పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు వినియోగించేందుకు ఉద్దేశించినదిగాఉంది.
ఇది సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన జాతీయ సౌర మిషన్ కు అనుగుణంగా ఉంది.
ఈ విధానాలకు సంబంధించి తదుపరి చర్యలలో భాగంగా, రైల్వే మంత్రిత్వశాఖ రైల్వేలోని , ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 1.7 మెగా వాట్ల పైలట్ ప్రాజెక్టు , 25 కెవి ట్రాక్షన్ వ్యవస్థను బినా లో విజయవంతంగా అమలులోకి తెచ్చారు. దీనికితోడు, 3 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటును నాన్ ట్రక్షన్ అవసరాలకురాయ్‌బరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ (ఎం.సి.ఎఫ్)లో ప్రారంభించారు. మరో రెండు ప్రాజెక్టులలో ఒకటి రెండు మెగావాట్లతొ దివానా వద్ద, మరోకటి 50 మెగా వాట్లతో భిలాయ్ వద్ద రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ యుటిలిటి (ఎస్‌టియు), సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటి (సిటియు)లు పురోగతిలో ఉన్నాయి.
రైల్వేలో సౌరవిద్యుత్ వినియోగం వల్ల, 2030 నాటికి రైల్వే రవాణా వ్యవస్థను కార్బన్ ఉద్గార రహిత రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ మిషన్‌ను చేరుకోవడం మరింత వేగవంతం అవుతుంది. ఈ లక్ష్యసాధనకు భారతీయ రైల్వే , తన ఖాళీ స్థలాలలో 20 గిగా వాట్ల సౌరవిద్యుత్ స్థాపిత సామర్ధ్యంగల భారీ ప్లాంట్లను 2030 నాటికి ఏర్పాటు చేసేందుకు బృహత్ ప్రణాళికను రూపొందించింది. రైల్వేశాఖ 2023 నాటికి నూరుశాతం విద్యుదీకరణ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. 2030 నాటికి రైల్వే విద్యుత్ వినియోగం 33 బిలియన్ యూనిట్లకు చేరుకోనుంది. ప్రస్తుత విద్యుత్ అవసరం 21బిలియన్ యూనిట్లు.
ఇందుకు భారతీయ రైల్వే కార్బన్ రహిత వ్యవస్థ సాధనకు బహుముఖ విధానాన్నిఅనుసరిస్తున్నది. ఇది సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా సాధ్యం కానుంది. ఆ రకంగా రైల్వే దేశంలో ఇంధన విషయంలో స్వావలంబన సాధించే రవాణా సంస్థగా రూపుదిద్దుకోనుంది. ఇది భారతీయ రైల్వేను హరిత రవాణా వ్యవస్థగా చేయడమే కాకుండా ఆత్మనిర్భర్‌గా చేయడానికి సహకరిస్తుంది.
ఇందుకు సంబంధించి, రైల్వే ఇప్పటికే రైల్వే ట్రాక్ వెంట ఖాళీ స్థలాలో 3 గిగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు , రైల్వే ఎనర్జీ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఆర్.ఇ.ఎం.సి.ఎల్) , భారతీయ రైల్వేకి చెందన ప్రభుత్వరంగ సంస్థ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది. ఈ సౌర విద్యుత్ ప్లాంట్లు రైల్వేకి తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా రైల్వేట్రాక్ వెంట గోడ నిర్మంచి రైల్వే భూమిని కాపాడుతాయి.
రైల్వే ఖాళీ స్థలాలలో సౌరవిద్యుత్‌ప్లాంట్లు ఏర్పాటుచేసేందుకు సౌరవిద్యుత్ డవలపర్లకు అన్నిరకాలుగా అండగా ఉండేందుకు భారతీయ రైల్వే సానుకూలంగా ఉన్నట్టు రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ తెలిపారు. రైల్వే ట్రాక్ వెంట గోడను నిర్మించి దాని నిర్వహణను డవలపర్లు చూస్తారని దీనివల్ల రైల్వేట్రాక్ వెంట అక్రమంగా ప్రవేశించడానికి వీలుండదని ఆయన చెప్పారు.
ఆధునిక, దేశీయ సాంకేతికపరిజ్ఞానంతొ భారతీయ రైల్వేను ఇంధన స్వావలంబిత వ్యవస్థగా తీర్చిదిద్దడం, భారతీయ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడడంతోపాటు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన నిర్దేశిత లక్ష్యసాధనకు ఉపకరిస్తుంది.
***
(Release ID: 1649021)
Visitor Counter : 195