ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రాజస్థాన్ లో రెండు కొత్త వైద్య కళాశాలలను, మూడు సూపర్ స్పెషాలిటీ బ్లాకులను జాతికి అంకితం చేసిన డాక్టర్ హార్ష్ వర్ధన్

"వాజపేయిజీ కట్టుబడి ఉన్న ఆశయాలు " నెరవేరుస్తున్న సహకార ఫెడరలిజాన్ని ప్రశంసించిన డాక్టర్ హార్ష్ వర్ధన్

Posted On: 26 AUG 2020 3:45PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లోట్ రెండు కొత్త వైద్య కళాశాలలను, మూడు సూపర్ స్పెషాలిటీ బ్లాకులను ప్రారంభించారు. రాజస్థాన్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే పాల్గొన్నారు. 

భిల్వారాలోని రాజమాత విజయ రాజే సింధియా (ఆర్‌విఆర్‌ఎస్) మెడికల్ కాలేజీ, భరత్‌పూర్ మెడికల్ కాలేజీలను జిల్లా ఆసుపత్రుల నుండి మెడికల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయగా, సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్ (ఎస్‌ఎస్‌బి) ను కోట ప్రభుత్వ వైద్య కళాశాల; సర్దార్ పటేల్ మెడికల్ కాలేజ్, బికానెర్; రవీంద్ర నాథ్ ఠాగూర్ మెడికల్ కాలేజీ, ఉదయపూర్ లో చేర్చారు. ఈ ప్రాజెక్టులకు మొత్తం పెట్టుబడి  రూ. 828 కోట్లు కాగా అందులో రూ. ఒక్కో మెడికల్ కాలేజీకి రూ. 150 కోట్లు పెట్టుబడి పెట్టారు. కళాశాలల్లో 150 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సామర్థ్యం ఉంది. భరత్‌పూర్ మెడికల్ కాలేజీలో 34 ఐసియు పడకలతో సహా 525 పడకలు ఉండగా, ఆర్‌విఆర్‌ఎస్ మెడికల్ కాలేజీలో 12 ఐసియు పడకలతో సహా 458 పడకలు ఉంటాయి.

డాక్టర్ హర్షన్ వర్ధన్ మాట్లాడుతూ “ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ నాయకత్వంలో ప్రభుత్వం పరిపాలనలో కీలకమైన అంశంగా వైద్య విద్యలో సంస్కరణలకు ప్రాధాన్యత ఇచ్చింది. పార్లమెంటు చట్టం ద్వారా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త జాతీయ వైద్య కమిషన్ ద్వారా భర్తీ చేయబడుతోంది, ఇది వైద్య విద్య నాణ్యతను సరిదిద్దడంలో, అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా తీసుకురావడానికి గొప్ప ప్రయాణం చేయబోతోంది” అని అన్నారు. ప్రభుత్వ విజయాలను వివరిస్తూ, “గత ఐదేళ్లలో 158 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించారు. జిల్లా ఆసుపత్రులతో జతచేసిన వైద్య కళాశాలల స్థాపన కేంద్ర పథకంలో భాగంగా ప్రారంభించిన 42 కళాశాలలు వీటిలో ఉన్నాయి. ఈ పథకం కింద 157 కొత్త కళాశాలలను ప్లాన్ చేశారు, వాటిలో 2019-20లో 75 ఆమోదించారు. దేశంలోని తక్కువ జిల్లాల్లో జిల్లా ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ” అని డాక్టర్ హార్ష్ వర్ధన్ తెలిపారు. 

గత ఐదేళ్లలో ఎంబిబిఎస్‌లో సుమారు 26,000 సీట్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 30,000 సీట్లు జోడించగలిగాము. ఇంత పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీల స్థాపన, దేశంలో మెడికల్ సీట్ల పెరుగుదల ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, సంస్కరణల ఫలితం అని అయన తెలిపారు. ఈ చర్యలు ఇప్పటివరకు చేరని ప్రాంతాలకు కూడా  వైద్య విద్య విస్తరణకు అవకాశం ఇచ్చిందని ఆయన తెలిపారు. 

దేశంలో వైద్య విద్య నాణ్యతను మెరుగుపరిచే చర్యగా, అన్ని వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నీట్ అనే సాధారణ ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. నిబంధనలలో తగిన మార్పుల ద్వారా రాష్ట్ర స్థాయిలో సాధారణ కౌన్సెలింగ్ కూడా ప్రవేశపెట్టారని, ఈ చర్యలు వైద్య ప్రవేశాలలో పూర్తి పారదర్శకతను తెచ్చిపెట్టాయని అన్నారు. వైద్య విద్య లో సమూలంగా ప్రమాణాలు పెంచే దిశగా ఈ చర్యలు ఉపయోగపడుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. 

"ఆరోగ్య విద్య ఇతర రంగాలలో కూడా ఇలాంటి సంస్కరణలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ‘నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ బిల్లు’ పేరుతో అనుబంధ, ఆరోగ్య నిపుణులందరికీ రెగ్యులేటరీ బాడీ కోసం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. ఈ చట్టం ఆమోదించాక , 50 కి పైగా వివిధ అనుబంధ, ఆరోగ్య సంరక్షణ వృత్తుల నియంత్రణ అభివృద్ధి కోసం దీర్ఘకాలంగా ఉన్న శూన్యతను నింపగలుగుతాము ”అని డాక్టర్ హర్ష్ వర్ధన్ అన్నారు.

దేశవ్యాప్తంగా మరో 22 ఎయిమ్స్ ల ఏర్పాటులో శర వేగంగా పురోగతి సాధించామని, వీటిలో ఆరు పూర్తిగా పనిచేస్తున్నాయి, పద్నాలుగులో ఎంబిబిఎస్ తరగతులు ప్రారంభమయ్యాయని డాక్టర్ హార్ష్ వర్ధన్ అన్నారు. 

శ్రీ అశ్విని కుమార్ చౌబే నేటి కార్యక్రమం ద్వారా భారతదేశాన్ని "సర్వే సంతు నిరామయ" అనే ప్రధానమంత్రి లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్తుందని సంతోషం వ్యక్తం చేశారు. “ఈ పథకం మూడు దశల కింద, రాష్ట్రానికి మొత్తం 23 వైద్య కళాశాలలు మంజూరు అయ్యాయి - మొదటి దశలో ఏడు , రెండవ దశలో ఒకటి, మూడవ దశలో 15 మంజూరయ్యాయి. వీటిలో, మొదటి దశలోని ఆరు వైద్య కళాశాలలు పనిచేస్తున్నాయి.” అని శ్రీ అశ్విని కుమార్ తెలిపారు. 

రాజస్థాన్‌లో ఆరోగ్య మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చురుకైన పాత్ర పోషించినందుకు శ్రీ అశోక్ గెహ్లాట్ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ సంక్షోభంపై రాజస్థాన్ ప్రజలకు సహాయపడటానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం గురించి ప్రస్తావించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ రఘు శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

 

 

****


(Release ID: 1648782) Visitor Counter : 223