శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
వ్యవసాయ యంత్రాలకు సంబంధించి పరిశోధన, అభివృద్ది, దిగుమతి ప్రత్యామ్నాయలపై ఎం.ఎస్.ఎం. ఇ ల కు వెబినార్
డాక్టర్ హర్ష్ హిరాని: “సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ ఐ తొలితరం ఇ-ట్రాక్టర్లను 2020 లో జారీ చేయనుంది. ఇది ప్రస్తుతం డీజిల్‌ను ఎక్కువగా వినియోగించే ట్రాక్టర్ల వాడకపు అలవాటును పెద్ద ఎత్తున మార్చగల శక్తి గలది”
“ కృత్రిమ మేథ ,సమర్ధ ఎలక్ట్రానిక్ వ్యవస్థ, ముందు ముందు వ్యవసాయరంగాన్ని నడపనున్నాయి. సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ ఇప్పటికే ఈ దిశగా పరిశోధదన అభివృద్ధికార్యక్రమాలు నిర్వహిస్తోంది”
Posted On:
25 AUG 2020 6:48PM by PIB Hyderabad
2020 ఆగస్టు 25న జరిగిన వెబినార్‌లో దుర్గాపూర్ కు చెందిన సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ ఐ డైరక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) హరీష్ హిరాని, లూధియానా కు చెందిన ఎంఎంఎంఇ-డిఐ, పంజాబ్ రాష్ట్ర వ్యవసాయ ఉపకరణాల సంస్థ చైర్మన్ శ్రీ బల్దేవ్ సింగ్‌లు వ్యవసాయ యాంత్రీకరణలో దిగుమతులకు ప్రత్యామ్నాయాలపై పరిశోధన, అభివృద్ధికి దృష్టి కేంద్రీకరించడంపై ప్రధానగా చర్చించారు.
దుర్గాపూర్ సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ ఐ డైరక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) హరీష్ హిరాని , సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ అభివృద్ధి చేసిన వ్యవసాయ యంత్రాలపై న, వ్యవసాయ, పంట అనంతర సాంకేతిక పరిజ్ఞానాలపైన ప్రజెంటేషన్ ఇచ్చారు. శాస్త్రవిజ్ఞానం, ఆర్థికశాస్త్రం, సమాజం సమష్టిగా దేశ ఆర్ధిక స్థితిగతులను మార్చడంలో అద్భుతాలు సృష్టించగలవని అన్నారు. సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ఐ లు సంయుక్తంగా హరితవిప్లవ కాలంలో స్వరాజ్ ట్రాక్టర్ రూపకల్పన చేసిన దశనుంచి, మారుతున్న వ్యవసాయ అలవాట్లకు అనుగుణంగా చిన్న కృషి శక్తి ట్రాక్టర్ రూపకల్పన వరకు సాంకేతికత అభివృద్ధి ప్రస్తానాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కూరగాయల కోసం ప్రెసిషన్ ప్లాంటర్, పండ్లతొటలకు ఆఫ్‌సెట్ రొటవాటర్, నియంత్రిత వాతావరణంలో పునరుత్పాదక ఇంధన ఆధారిత శీతలీకరణ గిడ్డంగి, ఆకుల సేకరణ వ్యవస్థ, ఆటోమేటిక్ బయోమాస్ అచ్చుల ప్లాంటు వంటి వాటిని ఆయన ఈ సందర్భంగా చూపించారు.
రైతుల రాబడిని పెంచడానికి, వారి ఉత్పత్తులకు తగిన విలువ దక్కడానికి సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ఐ పంట అనంతర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. వీటిని ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లలో ఏర్పాటు చేసింది. పంట కోత అనంతర ప్రాసెసింగ్ సాంకేతిక పరిజ్ఙానం ఈశాన్యరాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై గట్టి ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతేకాదు ఇవి స్థానికులకు ప్రత్యేకించి మహిళలకు ప్రధానస్రవంతి ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనేందుకు ఉపకరిస్తున్నాయి.
ట్రాక్టర సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మక చర్యగా సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ 2020 సెప్టెంబర్‌లో తొలి తరం ఈ -ట్రాక్టర్లను సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ఐ విడుదల చేయనుంది. ఇది ప్రస్తుతం డీజిల్‌ను ఎక్కువగా వినియోగించే ట్రాక్టర్ల విధానానంలో మార్పు తీసుకురానుంది. ఎం.ఎస్.ఎం.ఇలు తమ వినూత్న ఆలోచనలు, దార్శనికత, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు రావాలని, తద్వారా సిఎస్ఐఆర్, -సిఎంఇఆర్ ఐ సహకరిస్తుందని, ఇది ఈ దార్శనిక సాంకేతిక పరిజ్ఞానానికి మరింత విలువ జోడిస్తుందని చెప్పారు.
వ్యవసాయ రంగంలో భవిష్యత్ అంతా ఇక కృత్రిమ మేథ ఆధారితమైనదిగా ఉంటుందని అలాగే సమర్ధమైన ఎలక్ట్రానిక్ వ్యవస్థ, పరిశోధన అభివృద్ధికి సంబంధించి సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ఐలు ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు. సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ ఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయా రంగాలలొ ఏర్పాటు చేసిన అనంతరం, అవసరమైతే వాటికి సంబంధించి తగిన మార్పులు, చేర్పులు చేస్తారని, ఎప్పటికప్పుడుతలెత్తే సవాళ్లు, అడ్డంకులను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటారని, వాటిని తిరిగి మెరుగుపరిచి విలువ జొడిస్తారని ఆయన చెప్పారు. ఇందుకు ప్రత్యేకంగా శాస్త్రవేత్తల బృందం పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు.
సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ కి చెందిన సాంకేతిక పరిజ్ఞానానికి అద్భుత భవిష్యత్తు పట్ల శ్రీ బల్దేవ్‌సింగ్,శ్రీ ఆర్.కె.పరమర్ లు సంతోషం వ్యక్తం చేశారు. సిఎస్ఐఆర్-సిఎంఇఆర్‌ల కృషిని మరింత తీవ్రతరం చేసి దేశవ్యాప్తంగా వివిధ భౌగోళిక ప్రాంతాలకు, వివిధ రకాల నేలలకు, వివిధ సామాజిక ఆర్థిక ప్రమాణాల వారికి పనికి వచ్చే విధంగా ఆయా ప్రత్యేక కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన పరిష్కారాలు సాధించాలని శ్రీ బల్దేవ్ సింగ్, డాక్టర్ హిరానిని కోరారు.
***
(Release ID: 1648731)
Visitor Counter : 205